వారణాసి భానుమూర్తి రావు
రచనలు
184
పాఠకులు
21,689
లైకులు
1,813

ప్రొఫైల్  

తొలి రచన పోస్టు చేసిన తేదీ:    

సంగ్రహం:

వారణాసి భాను మూర్తి గారు వృత్తి రీత్యా పేరు పొందిన కార్పొరేట్ కంపెనీలల్లో ముఖ్య ఆర్థిక కార్య నిర్వహణాధికారిగా పని చేశారు . ప్రవృత్తి రీత్యా కథలు , వచన గేయాలు తన పదవ తరగతి నుండి రాస్తూనే ఉన్నారు. . ఇది వరకు 40 కథానికలు , 400 దాకా వచన గేయాలు రాశారు. . ఆయన కథలు కొన్ని పత్రికలు , ఆంధ్ర జ్యోతి , విజేత , ఆంధ్ర ప్రభ లో ప్రచురితము అయ్యాయి . ఆయన రెండు పుస్తకాలు ముద్రించారు . 2000 సంవత్సరంలో ' సాగర మథనం ' అనే పుస్తకాన్ని , మరియు 2005 సంవత్సరములో ' సముద్ర ఘోష ' అనే పుస్తకాన్ని విడుదల చేసారు . ' సముద్ర ఘోష ' ను కీశే . శ్రీ అక్కినేని నాగేశ్వర రావు గారికి అంకితం చేశారు . ఇది రసమయి (డాక్టర్ రాము)ద్వారా జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత , పద్మ విభూషణ్ , డాక్టర్ శ్రీ సి. నారాయణ రెడ్డి గారు విడుదల చేశారు . ఇటీవల ఆయన రాసిన కథ ' పెద్ద కొడుకు ' భావ గీతి కథల పోటీలో ప్రతిలిపి ద్వారా ప్రత్యేక బహుమతి వచ్చింది . ప్రతిలిపి లో తన రచనలను పంచుకోవడం , పాఠకుల మన్ననల్ని పొందడం చాలా సంతోషంగా ఉన్నది . యశస్వీ గారి 'కవితత్వాలు' లో కవి గారి గురించి ఇలా..''భాను మూర్తి గారి కవిత్వం లో సామాజిక తపన , ఆవేదన ఉంటుంది . నిద్రపట్టని రాత్రుల్లో మనో సీమలో ఆలోచనల ఉలి ఏదో అస్పష్ట భావాన్ని చెక్కుతూ ఉంటుంది.. అందుకే వెతలమీద వెలుగురేకల్ని ప్రసరిస్తున్నారు మనోహర మనోజ్ఞ భూమిని చూస్తూ పరవశించి పొయిన భానుమూర్తి. ఆశ ఆంగ్లమైనప్పుడు పోక్రాన్ హిరోషిమాగా మారి విశ్వజనీనమౌతుంది వీరి కవితలో. దేవుడు తన కాపలాదారుడ్నే కరుణించలేని నాడు ఇతని స్వేదంలో పుడుతోంది ఒక విష్ణు సహస్ర నామం. రక్తంలో మ్రోగుతోంది ఒక నమకం చమకం. గొంతులో వినబడుతోంది ఆకలి వేదం. ఎవరి గుడెసె వారికి గుడే కావాలన్న సత్యం. ఈ రాతి గుండె మనుషులకు దయ , కరుణ కలగ డానికి గోలీలు కనిపెట్టాలనుకుంటారు. మనసుల్ని అమ్మకాలకు పెట్టి నిరంతరం దాడి చేసే మనుషుల కుటిల కుతంత్ర బాధా తప్త సర్ప ద్రష్ట లోకంలోకి రాననే ధిక్కారంతో కడుపు నిండినా మండినా కవిత్వమే కంటారు .రొచ్చుజీవితాల మీద కనికరం కిరణాలై కురుస్తారు. మట్టి వేదాలు వల్లిస్తారు.


బమ్మెర పోతన

1,761 అనుచరులు

Venkata Rameshbabu Tanguturi

0 అనుచరులు

Satyasrinivas Grandhi

0 అనుచరులు

Gadda Naveen

0 అనుచరులు
telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.