కిలపర్తి దాలినాయుడు
రచనలు
53
పాఠకులు
671
లైకులు
1

ప్రొఫైల్  

తొలి రచన పోస్టు చేసిన తేదీ:    

సంగ్రహం:

విజయనగరం ప్రాంతం సాలూరు వాస్తవ్యులైన శ్రీ కిలపర్తి దాలినాయుడు కవి, రచయిత. ఈయన చేసిన అనేక రచనలు అన్ని ప్రముఖ వార్తాపత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి. తన 21వ ఏట కార్టూనిష్టుగా కుంచెపట్టారు నాయుడు. దా.నా.కలంపేరుగా మార్చుకున్నారు.దాదాపు వెయ్యికి పైగా కార్టూన్లు వివిధ పత్రికలలో అచ్చయ్యాయి. రాష్టస్థ్రాయి బహుమతులు కూడా చాలాసార్లు అందుకున్నారు. బాలసాహిత్య రచయితగా దాదాపు 6 పుస్తకాలవరకూ ప్రచురణ అయ్యాయి. జిల్లాస్థాయి బాలసాహిత్యవేత్తగా చోటు సంపాదించుకున్నారు. రేడియో పాఠాల రచయితగా కూడా ఆ ప్రాంతంలో అందరికీ సుపరిచితులయ్యారు.విజయనగర్‌ ఉత్సవ్‌లో కార్టూన్ల ప్రదర్శనకుగాను విజయనగరం జిల్లా కలెక్టర్‌చే ఉత్తమ పురస్కారం అందుకున్నారు. ఉపాధ్యాయునిగా, కార్టూనిస్టుగా, సాహితీవేత్తగా, రచయితగా వివిధ అంశాలలో ప్రతిభను కనబరుస్తున్నారు.  బాలసాహిత్యమంటే ఇష్టపడే దాలినాయుడు ‘గులాబిరేకులు’, ‘సూక్తిసుధ’, ‘బాబిగాడి సరదాలు’, ‘వెలుగుకిరణాలు’, ‘ఊహారేఖలు’,‘వృక్షపక్షము’ లాంటి బాలసాహిత్య కథలను అందించారు. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉంటూ ప్రభుత్వం తరపున ‘ఆడుతూ...పాడుతూ’ అనే పూర్వప్రాధమిక పుస్తకం, సైన్స్‌ ప్రయోగాల నిర్వహణ గురించి తెలియజేసే ‘విజ్ఞానశాస్తమ్రేళాలు’, రేడియో పాఠాల కరదీపిక వంటి గ్రంథాల ప్రచురణలో భాగస్వామ్యం వహించారు.


Baskara Reddy Badduri

2 అనుచరులు

Kamala Kamala

4 అనుచరులు
telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.