చెదిరిన కల

కలలో మెలకువలో ఉన్న నేను స్నేహితులతో సిట్టింగ్ లో ఉన్నా అప్పుడు సరిగ్గా మధ్యాహ్నం 2:00 గంటలు. కాలింగ్ బెల్ మోగింది. ఎవరబ్బా ఈ టైంలో అనుకున్నాను. వెళ్లి డోర్ ఓపెన్ చేయగా కొరియర్స్ వచ్చాయి సర్ అన్నాడు. ఇక్కడ నరసింహ ఎవరు సర్ అన్నాడు. నేనే అన్నాను. ఇక్కడో సంతకం పెట్టండి సర్ అన్నాడు. సంతకం పెట్టేసి పార్సిల్ చూస్తూ డోర్ క్లోజ్ చేసి వచ్చి కూర్చున్నాను.

నా స్నేహితులు ఎవరు పంపారు అని అడిగితే చూశా నిజామాబాద్ అని ఒక కొరియర్, ఇంకొకటి విజయనగరం అని రాసుంది. నీకు అక్కడ ఎవరున్నారు రా? కొరియర్ పంపడానికి అని అడిగారు. ఇది నాకు సాహిత్య స్నేహితులు పంపారు. నేను ఫేస్ బుక్ లో కవితల పోటీలో పాల్గొని కవితలు రాశాను. నేను విజేతై ఉంటాను. కనుక నాకు కొరియర్ పంపారు అని గర్వంగా చెప్పుకున్నాను. రేయ్ ఏమివచ్చిందో! త్వరగా ఓపెన్ చేయరా అని అడిగారు.

సరే! అని నిజామాబాద్ కొరియర్ ఓపెన్ చేయగా అందులో చాలా ఐటమ్స్ ఉన్నాయి. నేను ఆశ్చర్యపోయాను. అందులో మొబైల్ ఫోన్ ఉంది అది లేటెస్ట్ మోడల్ ఇంకా రిలీజ్ కూడా ఐనట్లు ఎక్కడా ప్రచారం లేదు. మైక్రోమ్యాక్స్ ఆండ్రాయిడ్ మరియు కీప్యాడ్ ఉంది. చూడ్డానికి అచ్చం టి.వి.రిమోట్ లా ఉంది. ఒక గంట చార్జింగ్ పెడితే ఒకరోజు అంతా వాడుకోవచ్చట. నా మొబైల్ పగిలిందని వారికి ఎలా తెలుసబ్బా అనుకున్నాను. సమయానికి బాగానే పంపారు అనుకున్నాను. ఇంకా అందలో సర్టిఫికెట్, ఆర్ట్ బ్రెష్ లు, పెన్నులు ఇలా నాకు కావలసినవే అవసరమైనవే ఉన్నాయి. చాలా ఆనందపడ్డాను.

స్నేహితులు ఇంకో కొరియర్ ఓపెన్ చేయమన్నారు. అది ఓపెన్ చేయబోతుండగా కల చెదిరిపోయి మెలుకువ వచ్చేసింది... ప్చ్...!

కలం పేరు:- కుంచె
-మీ...చింతా లక్ష్మీనారాయణ!

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.