🎤ఆరాతీయడం!

గాలిలో దీపం పెట్టి
గాలినే కాపాడు అన్నట్లు
నువ్వే నన్ను చూసి
నువ్వే నాలో ఆశలురేపి
నన్ను మంచివాడా అని అడగడం!

అగ్గిపుల్ల గీసి
నువ్వు వెలగద్దు అన్నట్లు
నువ్వే నా వెంట వచ్చి
చిరునవ్వులు నవ్వి
నాలో ఏవేవో కోరికలు రేపి
నన్ను మంచివాడా అని అడగడం!

బావిలోకి తోసి
నీకు ఈత రాదా అన్నట్లు
నువ్వే నా వైపు ఓరచూపులు చూసి
నువ్వే నన్ను ప్రేమించి
నాలో ప్రేమను నింపేసి
నన్ను మంచివాడా అని అడగడం!

ఏదైతేనేమి
ఆరాతీయడం మొదలెట్టావుగా!
నన్ను ఇష్టపడే తెలుసుకుంటున్నావుగా!!

-కుంచె చింతాలక్ష్మీనారాయణ(2005).

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.