పేను(కార్డుకధ)

కైసంలో వెండికొండపై శివుడు కార్తీక పౌర్ణమి పండువెన్నెలను ఆస్వాదిస్తూ"ఈ చల్లనిరేయి,ఎంతో హాయి"అంటూ కూనిరాగంతీస్తూ రెప్పవాల్చి నిద్రలోకిజారుకున్నాడు. శిరస్సు పై ఉన్న చంద్రుడు ఉప్పొంగిపోతున్నాడు.ఆ పక్కనే జటాజూఠంలో ఉన్న పేనుకు ఈర్ష కలిగింది. ఓ చంద్రా శివుని ప్రశాంత నిద్రకు నీవేకారణమని సంబరపడకు.అతడ్ని మేల్కొలిపి ప్రళయతాండవం చేయించగల శక్తి నాకుంది చూడు!అంటూ శివునితల గొరగడం ప్రారంభించింది.శివుని తలలో నుసి,దురద ప్రారంభమైయ్యాయి.
అరమోడ్పు కన్నులతో ప్రశాంతంగా నిదురించే శివుడు దిగ్గునలేచాడు.
నటరాజు గా విలయతాండవమే చేసాడు.ఆతాండవానికి చంద్రుడు గగనానికి చేరి సర్వజీవరాసులకు ఆనందం పంచాడు.కిందకురాలిన పేను నటరాజు పాదాలకింద నలగిచచ్చింది.
నీతి:ఉన్న స్థానమొక్కటైనా! మంచిభావాలు కలవారు ఉన్నతి స్థానం చేరి పూజలందుకుంటారు.
చెడుభావాలున్నవారు అధములై నశిస్తారు.

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.