ఎప్పుడో దొరికే ఆ స్వర్గం కోసం

ఎక్కువ ఆలోచించకు వ్యర్ధం.

ఒక్క నాటి నీ బాల్యం కోసం

మరలా పుట్టు ప్రతి నిత్యం.

చిరునవ్వుల ఆ పలకరింపులు

కాకి ఎంగిలికి మినహాయింపులు.

గోలీలాటలు, గిల్లికజ్జాలు,

బొమ్మల పెళ్లి భాగోతాలు.

కొబ్బరిమట్టలక్రికెట్బాట్లు,

ఆటలో ఉండే అరటిపళ్ళు.

సంకురాత్రిపిడకల దండలు,

దొంగిలించిన కిటికీలు,గుమ్మాలు,

ఎడ్ల పందాలు, పప్పు బెల్లాలు,

పెళ్లి తంతులు, వేసవి సెలవలు.

చేతిలో చీదిన సిసింద్రీలు,

నేలబారు మొండి జువ్వలు.

అట్ల తద్దుల ఆరగింపులు,

అమ్మ పోసిన కుంకుడు తలంట్లు.

తలచిన కొద్ది ఊరే నిధులే

జ్ఞాపకాలుగా ఉన్న ఆ

చిన్నతనపు గురుతులే !!!

పి. గాయత్రిదేవి


telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.