స్నేహమా క్షమించు

రోజూ ప్రతిరోజూ

నీ మాటకోసం ఎదురుచూస్తున్నా...

నీ పిలుపుకోసం ఎదురుచూస్తున్నా...


నీ పలకరింపుల జడిలో తడిపేశావ్

నీ చిరునవ్వులతో నన్ను కట్టిపడేసావ్


చందమామలాంటి అందం చూసి

వెన్నెలలాంటి మనసుందనుకున్నా

సూర్యుడై మండుతున్నావా నేస్తమా....


భూమాతలాంటి సహనం నీకుందనుకున్నా

అసహనంతో లావాలా మరిగిపోతున్నావా బంధమా...


ఆకాశమంత విశాలహృదయం నీకుందనుకున్నా

చీమకూడా దూరని చిట్టడవిలాంటి హృదయం నీది

కనికరం ఎరుగని కరుణలేని జాలిలేని గుండె నీది


మన్నించావేమోనని మాటకలుపుతున్నా

క్షమించమన్నా నోరుమెదపవా స్నేహమా...

క్షమించమన్నా సంకళ్ళు తీసేయవా బంధమా...


సున్నితంగా ఉంటావనుకోలేదు తెలిసుంటే

దూది కన్నా మెత్తని మాటలతో పలకరించే వాడిని


నా మాటలతో మత్తుచల్లేవాడిని

నా చేష్టలతో గారడి చేసేవాడిని

కానీ

నేను అలాంటోన్ని కాను

నామసస్సాక్షికి నిదర్శనం నేను

స్నేహానికి ప్రాణమిచ్చేటోడిని

"స్నేహమా క్షమించు"

మన్నించి మటాడు స్నేహమా...

క్షమాబిచ్చవేయలేవా ఈ స్నేహబిచ్చగాడికి!!


#కుంచె 02.11.2016.

#చింతాలక్ష్మీనారాయణ.


#గమనిక:- నా స్నేహితుడు తన స్నేహం కోసం రాపించుకున్నారు నాతో.....

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.