చపి (కురచ కథ)

రచయిత : బివిడి ప్రసాదరావు

చలాకీ పిల్ల కు సంక్షిప్త నామము చపి.

చపి ఆరవ తరగతి చదువుతూన్న అమ్మాయి. తనకు ఒక పేరు ఉన్నా, ఆమె వారు, అక్కడ నుండి మిగతావారు అంతా ఆమెను చలాకీ పిల్ల అని పిలవడము జరుగుతూ, అది తర్వాత కాస్తా చపిగా స్థిరపడి పోయింది.

"మూవీకి రానంటావేమిటి" చపిని, తండ్రి అడిగాడు.

చపి జవాబు ఇవ్వలేదు.

"మేము తయారైపోయాము. వస్తావా, రావా" చపిని, తల్లి అడిగింది, చివరాఖరులా.

"రాను" కచ్చితముగా చెప్పింది చపి.

"అదే, ఏమంటున్నాము" తండ్రి అడిగాడు.

"మీతో రావడమంటే సిగ్గుగా ఉంది, ఎబ్బెట్టుగానూ ఉంటుంది, భయము గానూ ఉంటుంది" చెప్పింది చపి.

చపి, తల్లిదండ్రులు మొహాలు చూసుకున్నారు.

చపే చెప్పింది, "ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతి సారీ, ఎందుకు వాదించుకుంటారో తెలియదు. కసురుకుంటారు, తిట్టుకుంటారు. ఇరుగు పొరుగు వారు గమనిస్తున్నారనీ గుర్తించరు. పోనీ, ఇంట్లో నేనున్నాననీ చూడరు. హో, ఒక్కటే గొడవ. ఛ. మూవీకు వెళ్లడానికీ ఇప్పుడిప్పుడే గొడవ పడ్డారు కూడా. అస్తమానము ఎందుకో, ఇలా రుసరుసలాడు కుంటున్న మీరు, తర్వాత ఎలా, చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారో, నాకు అర్థము కావడము లేదు. అందుకే మీలాటి వారితో సర్దుకు తిరగడము నా వలన కాదు ... కాదు"

"మేము మొగుడూ పెళ్లాలము. మా సొదలు మాకుంటాయి. మాకు లేని ఇబ్బంది నీకు ఎందుకు" అన్నారు ఆ తల్లిదండ్రులు, కోరస్ గా కాకపోయినా, సుమారుగా అదే మాదిరిగా.

"అవునా, మరి, అక్కడా ఇక్కడా, ఎవరెవరో, మొగుడూ పెళ్లాలు గోల చేసుకుంటుంటే, చోద్యముగా మీరు ఎందుకు మాట్లాడతారు, వారిని ఎందుకు, ఎలా విమర్శిస్తూ ఉంటారు." అనడిగింది చపి, వెంటనే.

మళ్లీ ఆ తల్లిదండ్రులు, ఒకరి మొహము ఒకరు చూసుకున్నారు, ఆ వెంటనే...

***

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.