రీఛార్ఙ్ (కార్డ్ కథ)

"కాబట్టి పిల్లలూ!ఎవరి వస్తువైనా మనకి దొరికితే నిజాయితీగా దాన్ని పోగొట్టుకున్నవారికి అప్పగించేయాలి.మన దగ్గర ఉంచుకోకూడదు.పరాయి సొమ్ము పాము వంటిది.అర్ధమయిందా"అన్నాడు వీర్రాజుమాష్టారుఖగా పాఠం ముగిస్తూ."అర్ధమయింది సార్ !"అన్నారు పిల్లలు ముక్తకంఠంతో. ఇంతలోసెల్ మోగితేఆన్ చేసి "హలో"అన్నాడు."సార్ నేను వరంగల్ నుండి మాట్లాడుతున్నాను.దయచేసిఈ నెంబర్ కి 120₹లు airtel card వేయించండి"అన్నాడుప్రాధేయపడుతూ "నాకేం పని?నీసెల్ లో వేయించటానికి"చిరాగ్గా అన్నాడు వీర్రాజు."సార్ నెంబర్ పొరపాటుగా చెప్పడం వల్ల నా సెల్ లోకి రావాల్సిన బేలన్సు మీ నెంబర్ లో జమ అయిపోయింది.తప్పు నాదేనండి.కనీసం ఓ50₹లు అయినా వేయించండి" జాలిగా అడిగాడు."సారీ! నా దగ్గర డబ్బులు లేవు"అన్నాడువీర్రాజు."పోనీ తర్వాత ఐనా వేయించండి"అడిగాడతను."కుదరదయ్యా! నువ్వు చేసిన తప్పుకి నేనెలా భాధ్యుడినవుతాను.అసలు నేనెవరికి ఫోన్లు చేయను.మిస్స్ డ్ కాల్స్ ఇస్తాను.వాళ్ళే చేస్తారు.ఇప్పుడు నన్నొదిలెయ్ "అన్నాడు మరింత విసుగ్గా.అవతలి వైపు నుంచి ఆవ్యక్తి బతిమాలుతూనే ఉన్నాడు.వీర్రాజు సెల్ స్విఛ్ఛాఫ్ చేసి ఇంటికి బయలుదేరాడు,ఇంతకుముందు పిల్లలకు చేసిన నీతి బోధ గాలికొదిలేసి."ఏవండీ!చిన్న పొరపాటు జరిగింది"అంది భార్య."ఏంటి?" "అబ్బాయి సెల్ లో బేలన్స్ అయిపోయిందని కాలేజ్ నుండి ఫోన్ చేస్తే అస్తమానం ఎందుకని ఒక్కసారే 222₹ల ఆఫర్ని రీఛార్ఙ్ చేసా.ఐతేఒక నెంబర్ పొరపాటు చెప్పటంతో అది ఒంగోలులోని వేరేవాళ్ల సెల్ లో ఫీడ్ అయిపోయింది.కాస్త మీరు వాళ్లతో మాట్లాడండి"అంది.వీర్రాజు దభీమని అక్కడున్న సోఫాలో కూలబడిపోయాడు.
-----కౌలూరి ప్రసాదరావు
ఈ కథ విపుల మాసపత్రిక జూలై 2011లో ప్రచురింపబడింది.

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.