" అమ్మ"

1. ఆ.వె.
అమ్మ యన్న మాట కమ్మని పూదోట*
పరిమళాలు చిల్కు పసిడిపంట*
హద్దులేవిలేని ఆకాశమేనంట*
అమ్మ మమతలోన అవధి ఎంత?*

2. ఆ.వె.
కనుల ముందు కదలు కమ్మని వరమెద్ది?*
కనులు పోల్చలేని కనకమెద్ది?*
కరకు రాతి గుండె కరగు పదముయెద్ది?*
కమ్మతావి పదము అమ్మ ఒకటె.*

౩. ఆ.వె.
గర్భకుహరమందు గడచినమాసాలు*
గుడ్డువైన నీకు గుర్తురావు*
అమ్మ చెప్పుచుండ ఆశ్చర్య మొలికించు*
కమ్మనైన పదము అమ్మ ఒకటె*

4. ఆ.వె.
నొప్పికలుగు వేళ, మెప్పుపొందు ఘడియ*
నోట వచ్చుమాట, నుడువు మాట*
పశులు పక్షులైన పరగి మానవులైన *
అమ్మదనము సాటి అవని లేదు *

*** నాగమంజరి గుమ్మా***
ఉపాధ్యాయిని
మం.ప.ప్రా.ఉ.పాఠశాల
వెంకటరమణపేట 535145
శృంగవరపుకోట

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.