ఎందుకో..!!

మెరుపుల మేను సొగసులు ఉండగ..!!

వెచ్చనైన సూర్య కిరణాలు ఎందుకో..!!


పెదవుల తీపి మకరందము ఉండగ..!!

పతంగిక మధు కౌసుమము ఎందుకో..!!


శిరోజాల నల్ల తామిస్రము ఉండగ..!!

నడిరేయి మబ్బు నభాకము ఎందుకో..!!


డెందములో దైవ చింతన ఉండగ..!!

దిన దిన ఇజ్య నాటనము ఎందుకో..!!


ఫలకము నవ్వు గొదుగొని ఉండగ..!!

ప్రతిఘ్నము పైడి ధరించుట ఎందుకో..!!


కలం పేరు :-అఖిలాశ

మీ

జాని తక్కెడశిల


telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.