ప్రియాంక

ప్రియాంక

చరణ్, ప్రియాంక ముంబై రైల్వే స్టేషన్ ఉన్నారు..ఢిల్లీ వెళ్ళవలసిన ట్రైన్ ఇంకా రాలేదు....

చరణ్ నువ్వు లేకపోతే నేను ఎలా ఉండాలి ఆరు నెలలు కనీసం ఫోన్ కూడా కుదరదు అంటున్నావు.వారానికి ఒక్కసారి మాత్రమే చేస్తా అంటున్నావ్..నేను ఎలా ఉండగలను చెప్పు..

లేదు లేదు ప్రియ నీకు కంపనీ కోసం నా ఫ్రెండ్ మాధవ్ ఉన్నాడు కదా వాడికి చెప్పాను వాడు వీక్లీ ఒకసారి నిన్ను బయటికి తీసుకోని వెళ్తాడు పెళ్ళికి కావాల్సినవి అన్ని షాపింగ్ చెయ్యి ఇదిగో నా క్రెడిట్ కార్డ్స్ అని ఇస్తాడు.

కాని నువ్వు లేకుండా తనతో షాపింగ్ నేను చేయను.. చెర్రీ వద్దు లే నువ్వు వచ్చాక పెళ్లి షాపింగ్ చేద్దాము.

లేదు లేదు నాకు కుదరదు నేను పెళ్ళికి మూడు రోజులు ముందు వస్తాను నాకు లీవ్ దొరకదు పెళ్లి జరిగిన వెంటనే నిన్ను తీసుకోని వెళ్తాను అని చెప్తాడు..

అప్పుడే మాధవ్ వస్తాడు..

అల్ డి బెస్ట్ రా..

పెళ్లి పెట్టుకొని ఎందుకు వెళ్తునావ్ లీవ్ తీసుకోని ఉంటే బాగుంటుంది కదా..

లేదు మాధవ్ కుదరదు లే ఇదిగో తను నా కాబోయే భార్య పేరు ప్రియాంక..

హాయ్ ప్రియాంక..

హాయ్ మాధవ్..

చూడు మాధవ్ ప్రియాంక పెళ్లి షాపింగ్ చేయాలి కావున నువ్వు తనను షాపింగ్ తీసుకోని వెళ్ళాలి తను లోన్లీ ఫీల్ కాకుండా అప్పుడప్పుడు బయటికి తీసుకోని వెళ్ళు..

సరే చరణ్ నువ్వు చెప్పడం నేను కాదు అనడం ఆ తప్పకుండ తీసుకోని వెళ్తాను..

అప్పుడే ట్రైన్ వస్తుంది చరణ్ బై చెప్పి వెళ్ళిపోతాడు..ప్రియాంక కన్నీరు కారుస్తూ ట్రైన్ వెళ్ళేవరకు అక్కడే ఉండిపోతుంది..

ప్రియాంకా ట్రైన్ వెళ్ళిపోయింది వెళ్దామా ఇంకా అంటాడు మాధవ్..

ప్రియాంకను మాధవ్ ఇంటి దగ్గర వదిలి,వెళ్ళిపోతాడు..

@@@@@@@@@@@@@@*************@@@@@@@@@@@@@@


చరణ్ ఒక ఆర్మీ ఆఫిసర్ ఢిల్లీ నుండి ముంబై కి ఆరు నెలల ఒక్కసారి తనకు తెలిసిన వారి ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాడు.

అలా ఒక్కసారి ముంబై కి వచ్చి కొన్ని రోజులు గడుపు తుంటాడు..ఒక్క చల్లని సోమోదయం వేళ ముంబై మహా నగర ధ్వని మరియు వాయు కాలుష్యం నుండి తప్పించుకోవాలని ఊరికి చాల దూరంగా ఉన్న ఒక పార్క్ కి వస్తాడు..అప్పుడే ప్రియాంక తన తండ్రిని వీల్ చైర్ లో తీసుకోని అలా చల్ల గాలికి తిప్పుతూ ఉంటుంది.

ప్రియాంక ను చరణ్ చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు..అందుకోసం రోజు సాయంత్రం పార్క్ కి ప్రియాంక కోసం వస్తు ఉండే వాడు.ఒక్కరోజు ప్రియాంక తండ్రికి పార్క్ లో గుండె పోటు వస్తుంది.

ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండగా..అక్కడ ఉన్న చరణ్ ఏమైంది అని అడుగుతాడు..నాన్న గారికి స్ట్రోక్ వచ్చింది ఏమి చేయాలో అర్థం అవ్వటం లేదు అని ఏడుస్తూ కంగారుగా చెప్తుంది పార్క్ లో ఉన్న వారు మొత్తం వచ్చారు..

చుట్టు గుమ్మి గుడారు చరణ్ అందరు దూరంగా వెళ్ళండి తనకి ఊపిరి ఆడాలి కదా అని వెంటనే తన కారు తీసుకోని వచ్చి ఆసుపత్రికి తీసుకోని వెళ్ళి జాయిన్ చేస్తారు..

అక్కడ ఏమి కాదు మొదటి స్ట్రోక్ కాబట్టి భయం లేదు ఇంకోసారి వస్తే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అంటారు..

ఊపిరి పీల్చుకున్న ప్రియాంక చాల చాల థాంక్స్ అండి మీ ఋణం ఎప్పటికి మర్చిపొను అంటుంది..

పర్వాలేదు మీ పేరు అని చరణ్ అడుగుతాడు..

అప్పుడే చెప్తుంది నా పేరు ప్రియాంక మరి మీ పేరు

నా పేరు చరణ్ నేను ఏమి ఆఫిసర్ ని చెప్పి నాకు పని ఉంది నేను మళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు.

@@@@@@@@@@@@@@@***************@@@@@@@@@@@@@

తర్వాత రోజు ఆసుపత్రికి వచ్చి ప్రియాంక తండ్రి ని కలుస్తాడు..

ఎలా ఉంది అండి ఇప్పుడు ఆరోగ్యం పర్వాలేదు కదా..

చాల ధన్యవాదాలు చరణ్ నా ప్రాణం పోయి ఉంటె నా కూతురు అనాధ అయ్యి ఉండేది..తన పెళ్లి చూడకుండ వెళ్ళిపోయేవాడిని.తనను ఒక అయ్యా చేతిలో పెట్టి నేను పొతే అంతే చాలు నాకు అని చెప్తాడు.

ఏమి కాదు మీరు రెస్ట్ తీసుకోండి..అని చెప్పి ప్రియాంక చరణ్ ఇద్దరు బయటకి వస్తారు..

ప్రియాంక అడుగుతున్నా అని తప్పుగా అనుకోవద్దు మీ తల్లి గారు లేరా అని అడుగుతాడు..

ప్రియాంక దిగులుతో లేదు అండి మా అమ్మ గారు చనిపోయారు మా బంధువులు ఉన్న లేనట్లే నాకు నాన్న ,,నాన్నకు నేను అంతే.అని చెప్తుంది.

మీరు అమ్మ నాన్న ఏమి చేస్తూ ఉంటారు అని అడుగుతుంది.నాకు ఎవరు లేరు అండి నేను అనాధ ని.నేను పని చేసేది ఢిల్లీ ఆర్మీ లో కాని ఇక్కడ నేను పుట్టి పెరిగిన అనాధ ఆశ్రమం ఉంది అక్కడికి వచ్చి వెళ్తూ ఉంటాను..మా ఆశ్రమం ఫాదర్ నన్ను పెంచి పోషించారు వారి ఇంటికి వస్తు ఉంటాను.నాకు ముంబై లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు తన పేరు మాధవ్. ఇంకా నాకు ఎవరు తెలియదు అని చెప్తాడు..

అది విన్న ప్రియాంక చాల బాధ పడుతుంది.

చరణ్ గారు ఇక మీదట ముంబై లో మీకు మేము కూడా ఉన్నాము మీరు మా ఇంటికి కూడా రావచ్చు దిగులు పడకండి అని చెప్తుంది.

అలా చరణ్ రోజు ప్రియాంక ఇంటికి వచ్చి కొద్ది సేపు గడిపి పార్క్ కు వెళ్లి ఆనందంగా ఉంటారు..

ఒక రోజు ప్రియాంక తండ్రి ప్రియాంకతో అమ్మ ప్రియాంక చరణ్ మీద ని అభిప్రాయం ఏంటి అని అడుగుతాడు..

ఏమి లేదు అమ్మ తను ఒక అనాధ అందులోను చాల మంచివాడు తనను పెళ్లి చేసుకుంటే నువ్వు ఆనందంగా ఉంటావు అని నాకు అనిపిస్తా ఉంది.

నాన్న నాకు ఇష్టమే కాని తన నిర్ణయం తెలుసుకోవాలి కదా అంటుంది..సరే సరే నీకు ఇష్టం కదా నేను చరణ్ ని అడుగుతాను..

సాయంత్రం ఇంటికి వస్తాడు చరణ్ అందరు కలిసి పార్క్ కి వెళ్తారు అక్కడ చరణ్ తో ప్రియాంక తండ్రి బాబు చరణ్ నేను నిన్ను ఒక్కటి అడగాలి అనుకుంటున్న..

అయ్యో అంకుల్ అడగండి మీరు ఏదైనా అడగవచ్చు..

ఏమి లేదు బాబు అడుగుతున్నా అని తప్పుగా అనుకోవద్దు మా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా....!!!

చరణ్ ఆనందానికి అవధులు లేవు ఇంకా అంకుల్ ఈ విషయం నేను మీకు ఎలా చెప్పాలి అనుకుంటాను మిరే నన్ను అడిగారు..

నేను మొదటి సారి చూసినప్పుడే ప్రియాంక ను ప్రేమించ..తనకు ఓకే అయితే నాకు ఓకే అంటాడు..

అలా ఇద్దరి అంగీకారంతో నిశ్చితార్తం జరిగిపోతుంది..

అలా చరణ్ ప్రియాంక చాల ఆనందంగా ప్రేమ పావురాలు లాగా జీవిస్తూ ఉంటారు..

చరణ్ తన లీవ్ అయిపోవడంతో ఢిల్లీ వెళ్లి మల్లి వస్తాను అప్పుడు మిమ్ములను కూడా అక్కడికి తీసుకోని వెళ్తాను..

ఇలోగా మీరు పెళ్లి పనులు చూసుకోండి పెళ్లి అయ్యిన వెంటనే వేల్లిపోదాము ఢిల్లీ కి అని చెప్పి వెళ్ళిపోతాడు...

పెళ్లి పనులు సహాయం కోసం మాధవ్ ని ప్రియాంక కి పరిచయం చేసి వెళ్ళిపోతాడు..


@@@@@@@@@@@@@@**************@@@@@@@@@@@@@@


మాధవ్ చాల ఫాస్ట్ మనిషి వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ మాధవ్ చదువు అయిపొయింది కాని కాలిగా తిరుగుతూ ఉంటాడు.ఒక రోజు మాధవ్ ప్రియాంక కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు నువ్వు చరణ్ కి ఫోన్ చేసావు అంటా నీకు లోన్లీ నెస్ గా ఉంది అని చెప్పావు అంటా నాకు ఫోన్ చేసి తిడుతున్నాడు త్వరగా రెడి అవ్వు నేను వస్తున్నా బయటికి వెళ్దాము అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.

ప్రియాంక రెడి అయ్యి ఉంటుంది ఇద్దరు కలిసి సినిమా వెళ్తారు..అలా రోజు ఎదో ఒక ప్లేస్ కి తీసుకోని వెళ్తూ ఉంటాడు..

ఒక రోజు ప్రియాంక రోజు గుడి,పూజలు,పెళ్లి షాపింగ్ ఇంతేనా మనము పబ్ కి వెళ్దాము అని అంటాడు.

ప్రియాంక లెదు నేను రాను నాకు ఇష్టం ఉండదు.అంటుంది..!!

ఒక్కసారి వస్తే కదా తెలిసేది ప్లీజ్ రా అని బతిమిలాడుతాడు..!!

సరే అయితే ఎక్కువ సేపు ఉండాను అని చెప్తుంది..నైట్ నైన్ కి రెడి అయ్యి ఉండు వచ్చి తీసుకు వెళ్తాను అని చెప్పి వెళ్తాడు..

@@@@@@@@@@@@************@@@@@@@@@@@@

ఇద్దరు కలిసి పబ్ కి వెళ్తారు..ప్రియాంక ఒక చైర్ లో కూర్చొని ఉంటుంది మాధవ్ వచ్చి హే ప్రియాంక పబ్ లో కూర్చోకూడదు రా డ్యాన్సు చేద్దాము అని పిల్చుకోని వెళ్లి డ్యాన్సు చేస్తారు ఇద్దరు...ప్రియాంక కి కాల్ వస్తుంది చరణ్ దగ్గర నుండి వెంటనే అక్కడి నుండి బయటికి వచ్చి ఫోన్ లో మాట్లాడు తుంది.

ఎలా ఉన్నావు ప్రియా..

నేను చాల బాగా ఉన్న నువ్వు ఎలా ఉన్నావు.

నేను త్వరలోనే వస్తాను నువ్వు జాగ్రత్త అంటాడు..

నాకు ఏమి పర్వాలేదు నువ్వు మాధవ్ తో అన్నావు అంటా నన్ను బయటికి తీసుకుపోమని నన్ను ప్రతి రోజు బయటికి తీసుకోని పోతునాడు అని అంటుంది..

చరణ్ నేనా??? లేదే నేను చెప్పలేదు వాడికి ఓకే ఓకే నాకు పని ఉంది జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు..

మాధవ్ ప్రియాంక ను వెతుకుతూ వస్తాడు బయటికి ఏంటి మధ్యలో అలా వచ్చేసావ్ అంటాడు నీకు చరణ్ చెప్పాడా నన్ను బయటికి తీసుకోని వెళ్ళమని అని సూటిగా అడుగుతుంది..

లేదు చెప్పలేదు నేనే ఊరికే అన్న.. అలా అంటేనే కదా నువ్వు వచ్చేది అందుకే అన్నాను అంటాడు..

నేను నిన్ను ప్రేమిస్తున్న నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్తాడు..


ప్రియాంక ఏంటి మాధవ్ నేను ని ఫ్రెండ్ ఫియన్సి ని మాకు నిశ్చితార్తం కూడా అయిపొయింది..

నువ్వు ఇలాంటి వాడివి అనుకోలేదు అంటుంది..

చూడు ప్రియాంక వాడు ఒక ఆర్మీ అఫిసేర్ అందులోను అనాధ ఎప్పుడు చచ్చి పోతాడో వాడికే తెలియదు..

నేను పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకును నన్ను చేసికుంటే ని జీవితం ఆనందంగా ఉంటుంది అని చెప్తాడు..

ప్రియాంక మాధవ్ ని అసహించుకోని అక్కడి నుండి వెళ్ళిపోతుంది..కాని మాధవ్ చెప్పిన మాటలు గుర్తు వస్తు ఉంటాయి.చరణ్ దూరం అవ్వటం మాధవ్ తో తాని గడిపిన క్షణాలు తనకు బాగా అనిపించాయి..

వెంటనే మాధవ్ కి ఫోన్ చేసి నేను బయటికి వెళ్ళాలి నా మనసు బాగా లేదు అంటుంది..

నేను ఫాం హౌస్ లో ఒక మీటింగ్ లో ఉన్న నువ్వు ఒక పని చెయ్యి ఇక్కడికి రా నేను డ్రైవర్ ని పంపుతాను అని చెప్తాడు..

సరే అని చెప్తుంది ప్రియాంక..ఫాం హౌస్ కి వెళ్తుంది..మాధవ్ స్విమింగ్ ఫూల్ లో ఉంటాడు..

ఏంటి మీటింగ్ అన్నావు కదా మరి స్విమింగ్ ఫూల్ లో ఉన్నావు అని అడుగుతుంది..

ఇప్పుడే అయిపొయింది శరీరం వేడిగా ఉంది అందుకే స్విమ్ చేస్తున్న అంటాడు..

సరే నేను బయట వెయిట్ చేస్తాను త్వరగా రా అని చెప్తుంది..

లేదు ప్రియాంక నువ్వు కూడా స్విమ్ చెయ్యి అంటాడు..

నాకు స్విమ్ రాదు అంటుంది..

సరే అయితే నేను నేర్పిస్తాను అని చెప్తాడు..

లోపల స్విమ్ సూట్ ఉంది వెళ్లి వేసుకొని రా అని చెప్తాడు..

ఇద్దరు కలిసి స్విమ్ చేస్తూ రొమాన్స్ చేస్తూ ఉంటారు..

@@@@@@@@@@@@***********@@@@@@@@@@@

చరణ్ ప్రియాంక కి ఫోన్ చేస్తాడు తను లిఫ్ట్ చెయ్యదు..ప్రియాంక నాన్న కి ఫోన్ చేస్తే విషయం చెప్తాడు తను మీ ఫ్రెండ్ ఫాం హౌస్ కి వెళ్ళింది..సరే అంకుల్ నేను ముంబై వచ్చాను అక్కడికి వెళ్లి ప్రియాంక ని తీసుకోని ఇంటికి వస్తును అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు..

మాధవ్ ఫాం హౌస్ కి వెళ్తాడు అక్కడ ప్రియాంక మాధవ్ స్విమింగ్ ఫూల్ రొమాన్స్ చూసి ఏమి చేయాలో అర్థం కాక..బాధను మొత్తం అదిమిపట్టి..

ప్రియ ఇంటి దగ్గర నాన్న ఎదురుచూస్తున్నారు రా వెళ్దాము అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

తను ఏమి మాట్లాడకుండా బయటికి వచ్చి కార్ లో కూర్చుంటుంది..

చరణ్ కళ్ళలో కన్నీరు కానీ ఏమి మాట్లాడకుండా డ్రైవ్ చేస్తూ ఉంటాడు..

ప్రియాంక చరణ్ నన్ను ఏమి అడగవా నన్ను కొట్టు ..తిట్టు..కాని అలాగా ఉరికే ఉండదు..నేను భరించలేను ని మౌనం..

అసలు నువ్వు ఎందుకు పరిచయం చేసావు మాధవ్ ని అని ఏడుస్తుంది..

చరణ్ ఏమి మాట్లాడాడు తన కళ్ళలోకి చూసి ఒక్క ప్రశ్న అడుగుతాడు..

ప్రియా నువ్వు మాధవ్ ని ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు..

ఆ ప్రశ్నటి నిర్గంత పోయిన ప్రియాంక ఏమి చెప్పాదు..అవును అన్నటు తల ఊపుతుంది..

సరే ఇల్లు వచ్చింది దిగి వెళ్లి పడుకో నేను మల్లి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు..

@@@@@@@@@@@@@@*************@@@@@@@@@@@

మాధవ్ దగ్గరికి వెళ్లి జరిగింది ఎదో జరిగిపోయింది మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు కదా నేను మీకు అడ్డు రాను నువ్వు ప్రియాంక ను పెళ్లి చేసుకో అంటాడు..

మాధవ్ హే చరణ్ ఏంటి అలా మాట్లడుతున్నావు నా గురించి తెలియదా నీకు నేను గడిపిన వారిని అందరిని చేసుకోవాలి అంటే ఎలా ప్రతి అమ్మాయి ఎదో ఒక బడ్జెట్ కి పడిపోతుంది ప్రియాంక కాస్త కాస్ట్లీ అంతే అంటాడు..

చూడు మాధవ్ అలా మాట్లాడకు తను అలాంటిది కాదు తన కళ్ళలో నీపై ఉన్న ప్రేమను నేను చూసాను తాను నిన్ను ప్రేమిస్తా ఉంది..సో నువ్వు తనని పెళ్లి చేసుకోవాలి అంతే అంటాడు..

లేదు చరణ్ మా నాన్న కేంద్ర మంత్రి కూతురితో పెళ్లి ఖాయం చేస్తున్నాడు..అని చెప్తాడు..

చరణ్ కోపంతో ఊగిపోయి అక్కడే ఉన్న పూల కుండి తీసుకోని మాధవ్ తల మీద బాదుతాడు..

చూడు మాధవ్ తను చాల మంచిది వాళ్ళ నాన్న కి ఈ విషయం తెలిస్తే తను చనిపోతారు నేను తనకి ఎదో ఒక్కటి చెప్తాను నువ్వు తనని పెళ్లి చేసుకోవాలి అని చెప్తూ ఉంటాడు..కాని మాధవ్ నుండి ఉలుకు పలుకు లేదు..

మాధవ్ మాధవ్ అంటాడు అప్పటికే మాధవ్ పరలోక ప్రయాణం మొదలు పెట్టాడు..

@@@@@@@@@@@@@@@**********@@@@@@@@@@@@@

చరణ్ జైలు కి వెళ్తాడు.. ప్రియాంక వాళ్ళ నాన్న కి విషయం తెలిసి మరణిస్తాడు..

ప్రియాంక అనాధ అయిపోతుంది...పాఠకులకు ప్రశ్న??????????????

జైలు నుండి వచ్చాక ప్రియాంక ను చరణ్ పెళ్లి చేసుకోవల వద్ద

చేసుకోవాలి అనే వారు ఎందుకు చేసుకోవాలో చెప్పండి

వద్దు అనే వారు ఎందుకు వద్దో చెప్పండి

కలం పేరు :- అఖిలాశ

మీ

జాని.తక్కెడశిల


telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.