సహజీవనమా? .........సర్వనాశనమా?


సహ జీవనమా?.....సర్వ నాశనమా?....................


ఆధునిక సమాజంలో చూస్తున్న వెర్రి పోకడలు ప్రగతికి పునాది అనాలో, నాశనానికి నాంది అనాలో తెలియని అయోమయ స్థితిలో నేడు మానవ జాతి ఉంది. సాంకేతిక విప్లవ విజ్ఞానంతో అరచేతిలో ప్రపంచాన్ని ఇముడ్చుకున్న నేటి యువతరం గడుపుతున్న సహజీవనం మాత్రం కడు శోచనీయమైనది.

  • * * * *

మైధిలీ, విక్రం ఇద్దరూ సాప్ట్ వేర్ ఇంజనీర్లు. చెరొక లక్ష సంపాదిస్తున్నారు. ఇద్దరికీ ఇంటికి పంపించాల్సిన అవసరం లేదు. మూడు పువ్వులు, ఆరుకాయలుగా జీవితం ఉంది. ఇంకేం?....... ఇద్దరూ సహజీవనానికి నాంది పలికారు. జూబ్లీ హిల్స్ లో ఒక అపార్ట్ మెంట్ లో అద్దెకు దిగారు. ఇద్దరికీ జీవితం ఎంజాయ్ చేయటమే లక్ష్యం. క్లబ్బులు, పబ్బులు, పార్కులు, సినిమాలు...... ....ఏది కావాలంటే అది క్షణాల్లో పొందగల సౌకర్యం దొరికింది. మైధిలీ తల్లిదండ్రులు విద్యావంతులు కారు. కూతురు చెప్పింది గుడ్డిగా నమ్మటం మాత్రమె వారికి తెలుసు. విక్రమ్ కు తండ్రి లేడు. తల్లి గారాబంగా పెంచడంతో ఆడింది ఆటగా, పాడింది పాటగా జీవితాన్ని గడిపేస్తున్నాడు.

  • * * * *

ఇద్దరూ ఒకరి నొకరు అర్ధం చేసికొన్నాము అనుకున్నారు. వంట, ఇల్లు సర్దటం కలిసి చేసికునేవారు. ఒక ఆరు నెలలు బాగానే గడిచాయి. ఇంతలో విక్రం కు నైట్ డ్యూటీ షిఫ్ట్ పడింది. మైధిలీ పగలు డ్యూటీ కి వెళితే, విక్రం నైట్ డ్యూటీ కి వెళ్ళాల్సి వచ్చేది. పగలు తను పడుకోవటం వలన మైదిలీకి ఏ సహాయం చేయలేక్ పోయేవాడు విక్రం. పని భారం అంతా తన మీదే పడుతుందని గ్రహించిన మైధిలీకి విసుగు, కోపం, చిరాకు ఎక్కువ కాసాగాయి. చిన్న, చిన్న సూటీ పోటీ మాటలు చిలికి చిలికి గాలి వాన లాగా పెద్ద పెద్ద తగవులకు దారీ తీసేలా చేశాయి. తను మగవాడిననే అహం విక్రం కు, తను సంపాదిస్తున్నననే గర్వం మైధిలీ కి రావటం వలన చిటపట మంటూ ఉప్పు, నిప్పులా బ్రతుక సాగారు.

  • * * * *

ఇంతలో మైదిలీకి ప్రేగ్నేన్సి రావటంతో అబార్షన్ కు సూచించాడు విక్రం. కానీ మైధిలీ లోని తల్లి హృదయం దానికి సుతరాము అంగీకరించ లేదు. మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. ఇప్పుడిప్పుడే పిల్లలు వద్దని, ఎలాగైనా అబార్షన్ చేయించాలనే ప్రయత్నించాడు విక్రం. మైధిలీ అంగీకరించక పోవడంతో ఇద్దరూ విడి పోవటానికి సిద్దమైనారు. విడిపోవటానికి మైధిలీ ఇష్టపడదని, అబార్షన్ కే సిద్దపడుతుందని విక్రం తలిచాడు. కానీ మైధిలీ స్థిరనిర్ణయం ముందు విక్రం కు విడిపోక తప్పలేదు.

  • * * * *

మైదిలీకి ఇప్పుడు ఏడవ నెల. ఫర్నిచేర్ మొత్తం మైదిలీకే వదిలేసి విక్రం వెళ్లి పోయాడు. తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పలేక పోయింది మైధిలీ. ఇన్నాళ్ళు జేవితం ఎంజాయ్ చేయటం వలన మైధిలీ ఏమీ సేవ్ చేసికోలేదు. ఒక్కటే హాస్పిటల్ కు చెకప్ కు వెళ్ళటం, మంచీ చెడు చూచే దిక్కు లేకపోవడం వలన ఒంటరితనం భరించ లేక పోయింది ఆమె. తను చేసిన తప్పు ఆమెకు ఇప్పుడు బాగా అర్ధం అవసాగింది. ఒకవేళ డేలివరీ లో తనకు ఏమన్న అయితే, తన బిడ్డ పరిస్థితి ఏమిటి?.......ఊహించడానికి కూడా ఆమె మనస్సు అంగీకరించ లేదు.

  • * * * *

దేవుని దయ వలన మైదిలీకి సుఖ ప్రసవం అయ్యింది. ఎవరి ద్వారానో విషయం విన్న ఆమె తల్లిదండ్రులు లబోదిబో మంటూ కూతురును చూడటానికి వచ్చారు. పాపను తాము పెంచుతామని మైధిలిని మరలా వివాహం చేసికోమని బ్రతిమిలాడారు. కానీ మైధిలీ అందుకు అంగీకరించలేదు. తన బిడ్డే సర్వసంగా భావించి ఆమెకు మంచి విద్యా బుద్దులు నేర్పించి, ఆమె కోసమే బ్రతకాలని నిర్ణయించుకుంది. తన్ జీవితం ఎటు తెగిన గాలిపటం అయ్యింది. తన బిడ్డకైనా మంచి భవిష్యత్తు నిస్తే అంతే చాలు అనుకుంది.

  • * * * *

22 సంవత్సరాలు గడచిపోయాయి. తండ్రి పేరు చెప్పలేక సమాజం లో మైధిలీ ఎదుర్కొన్న కష్టాలు అన్నీ , ఇన్నీ కాదు. ఆడది సమాజంలో ఒంటరిగా బ్రతకటం ఎంత కష్టమో, తను ఎంత దిద్దుకోలేని పొరపాటు చేసిందో ఆమెకు స్పష్టంగా అర్ధమయింది. అష్ట కష్టాలు పడి మైధిలి తన కూతురును కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా స్థిర పరిచింది. ఒకరోజు తన తల్లిని తతీసికొని హాస్పిటల్ కు వెళ్ళింది మైధిలి. అనుకోకుండా ఆమెకు వీల్ చైర్ లో విక్రం కనిపించాడు.

‘’ఎలా వున్నావ్ మైధిలీ?.........” అని పలుకరించాడు. అతనిని అలా చూచేసరికి ఆశ్చర్య పోయింది మైధిలి. విక్రం తను పెండ్లి చేసికున్నానని, కానీ పెండ్లికి ముందే ఒకరికి అన్యాయం చేసాననీ తెలిసిన ఆమె తనని వదిలి వేల్లిపోయింది అని, తరువాత యాక్సిడెంట్ లో తన రెండు కాళ్ళు పోయాయని, ప్రస్తుతం అవిటి బ్రతుకు బ్రతుకుతున్నానని చెప్పడంతో

మైధిలి బాధ పడింది.

కొద్దిసేపు ఆలోచించుకున్న మైధిలి ‘’నేను నీతో ఒంటరిగా మాట్లాడాలి”” అని చెప్పింది. ‘ఇకనైనా మైధిలి, తను కలసి మెలసి ఉండొచ్చు, బహుశా అదే విషయాన్ని మైధిలి కూడా చెబుతూ ఉండవచ్చు అని అనుకున్నాడు విక్రం. మరునాడు ఇద్దరూ పార్కులో కలుసుకున్నారు. అప్పుడు మైధిలి అతనితో ‘’సహజీవనం వలన మనిద్దరం మన జీవితాలలో ఏమి నష్టపోయమో, అ విషయాలన్నీ యూత్ తో పంచుకుందాం. టి.వి. లో, నెట్ లో, యూ – ట్యూబ్ లో, పేస్ బుక్ లో మన అనుభవాలను అందరికే చెప్పి, అలాంటి ఆలోచనలు తప్పని యువత కు తెలియజేద్దాం. మనిద్దరం ఇలా చేయడం ద్వారా చివికి పోయిన మన బ్రతుకులకు ఒక పరమార్ధం చేకూర్చుకుందాం.””.................అని చెప్తుంటే వింటున్న విక్రం మైధిలి ని చూచి అవాక్కయిపోయాడు. విక్రం కు తన మీద, తన ఆలోచనల మీద ఎంతో జుగుప్స కలిగింది. తను అందుకోలేనంత ఉన్నత శిఖరాలను అధిరోహించిన మైధిలికి మనస్సులోనే శిరస్సు వంచి నమస్కరించాడు విక్రం.
telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.