వైద్యరంగంలో తెలుగు తేజాలు

(జాతీయ వైద్యుల దినోత్సవం ప్రత్యేకం)

ప్రపంచ వైద్య చరిత్రను చూసుకుంటే... వివిధ వైద్యరీతుల వికాసానికి భారతీయ వైద్యులు చేసిన కృషి కూడా తక్కువేమీ కాదు. అందులో తెలుగు నేలపై జన్మించి, వైద్యరంగానికి విశేష సేవ చేసిన వైద్యులు కూడా ఎందరో ఉన్నారు. ఈ జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా అలాంటి కొందరు మేటి వైద్యుల గురించి మనమూ తెలుసుకుందాం..

ఆచంట లక్ష్మీపతి (మార్చి 3, 1880 - ఆగస్టు 6, 1962) ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు మరియు సంఘసేవకుడు. ఈయన నాటి మద్రాసు ( నేటి చెన్నయ్) లోని ఆయుర్వేద వైద్య కళాశాల ప్రధానోధ్యాయులుగా (1920-1928) సేవలు అందించారు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు దగ్గర మాధవవరం లో శ్రీ రామయ్య, శ్రీమతి జానకమ్మ లకు 1880 , మార్చి 3 న జన్మించారు. ఆంగ్ల భాష తో పాటు తెలుగు లోనూ తన రచనా వ్యాసాంగాన్ని కొనసాగించిన డా. ఆచంట లక్ష్మీ పతి1922-27 కాలంలో తెలుగు లో "ధన్వంతరి" పత్రికనూ ఆంగ్లం లో 'ఆంధ్రా మెడికల్ జర్నల్ ' ను ప్రచురించారు.

ఆయన ఆంగ్లంలో "ఆంధ్ర మెడికల్ జర్నం" ను నడిపారు. ఈయన 63 పుస్తకాలను భారతీయ వైద్యం పై అనగా దర్శనములు, ఆయుర్వేద విజ్ఞానం,ఆయుర్వేద శిక్ష, వనౌషథ విజ్ఞానము , భారతీయ విజ్ఞానము వంటివి వ్రాశారు.ఆయుర్వేదంపై అనేక ఆంగ్ల పుస్తకాలను వ్రాశారు. చలిజ్వరము రోగ లక్షణాలు, దానికి ఆయుర్వేద వైద్యము గురించి చలిజ్వరము పుస్తకాన్ని రాశారు.

దీవి గోపాలాచార్యులు (అక్టోబరు 10, 1872 - సెప్టెంబరు 29, 1920) వైద్య శాస్త్రవేత్త, హిందూ సంప్రదాయ వైద్య పరిశోధకులు, ఆయుర్వేద పండితులు, అఖిల భారత ఆయుర్వేద విద్యాపీఠానికి పూర్వాధ్యక్షులు.

1917లో ఆయన అఖిల భారతాయుర్వేద విద్యాపీఠానికి అధ్యక్షత వహించి దేశవ్యాప్తంగా ఆయుర్వేద అభివృద్ధికి కృషి చేశారు. వైద్యరత్న, ఆయుర్వేద మార్తాండ భిషఙ్మణి బిరుదు పొంది ప్రఖ్యాతిచెందారు.

ఆయుర్వేద వైద్యానికి ప్రఖ్యాతిపొందిన గోపాలాచార్యులు దేశవ్యాప్తంగా ఆయుర్వేదాన్ని ప్రచారం చేయడం లోనూ, విస్తృతమైన వ్యాప్తికి కృషిచేయడంలోనూ ప్రశస్తిపొందారు.

గోపాలాచార్యులు పలు జాతీయ సదస్సుల్లో, కార్యకలాపాల్లో ప్రసంగాలు చేశారు.

ఈయన స్వగ్రామం. కృష్ణా జిల్లా , నాగాయలంక మండలం (దివిసీమ) లోని భావదేవరపల్లి గ్రామం .

ప్లేగు, కలరా వ్యాధుల నిరోధానికి ప్రాచీన హిందూ సంప్రదాయ వైద్యాన్ని ఉపయోగించుకొని "శతధౌత ఘృతం" "హైమాది పంక్రమ్‌ (పానకం)" అనే రసాయనాలను సృష్టించి ఔషధ రూపంలో వ్యాధిగ్రస్తులకు అందించారు. ఆ విధంగా ప్రజలకు ఎంతో మేలు ఒకకూర్చారు.

యల్లాప్రగడ సుబ్బారావు (జనవరి 12, 1895 - ఆగష్టు 9, 1948) భారత దేశమునకు చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. పశ్చిమ గోదావరి భీమవరంలో జన్మించిన ఈయన లెడర్లీ ప్రయోగశాలలో వైద్యబృందం నాయకులుగా ఫోలిక్ ఆమ్లం యొక్క నిజస్వరూపాన్ని కనుగొన్నాడు.

అందులోని బంగారు వన్నె భస్మం స్ప్రూ వ్యాధి, మక్రోసైటిక్ అనీమియా అను రక్తహీనత వల్ల కలిగే వ్యాధి నిర్మూలనకు అసమానమైన, అద్భుతమైన మందుగా నిర్ణయింపబడింది. క్షయరోగ నివారణియగు బసోనికోటి నికాసిడ్, హైడ్రాక్సైడ్ మందులను కనుగొన్నారు.

బోదకాలు, టైఫాయిడ్, పాండురోగం మున్నగు వ్యాధులకు పూర్తిగా నిర్మూలింపగల మందులను కనుగొన్నాడు. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ నుండి డిప్లొమా పొందిన తర్వాత, హార్వర్డ్ లో తనకు ఆచార్య పదవి తిరస్కరించడము వలన ఈయన లెడర్లీ ప్రయోగశాలలో చేరాడు. ఈయన రూపొందించిన హెట్రజాన్ అను డ్రగ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ చే ఫైలేరియాసిస్ (బోదకాలు వ్యాధి) నివారణకు ఉపయోగించబడినది. సుబ్బారావు పర్యవేక్షణలో బెంజమిన్ డుగ్గర్ 1945లో ప్రపంచములోనే మొట్టమొదటి టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ అయిన ఆరియోమైసిన్ ను కనుగొనెను.

చావలి వ్యాఘ్రేశ్వరుడు భారతదేశానికి చెందిన ప్రముఖ శస్త్రచికిత్స నిపుణులు మరియు పోలియో వ్యాధిగ్రస్తుల పాలిట వరప్రదాత.ఆయన తూర్పుగోదావరి జిల్లా లోని రాజమండ్రి లో జన్మించారు.

ఆయన తండ్రి ఆయుర్వేద వైద్యులు. ఆయన ఎం.బి.బి.ఎస్ చేసి జనరల్ సర్జన్ మరియు ఆర్థోపెడిక్స్ లలో రెండు ఎం.ఎస్ డిగ్రీలను ఆంధ్రా మెడికల్ కళాశాల, విశాఖపట్నం నందు చేసారు.

ఆయన విశాఖపట్నం లోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో మొదటి ఆర్తోపెడిక్స్ ప్రొఫెసరుగా పనిచేసారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థోపిడిక్ వైద్య విభాగ వ్యవస్థాపకుడు. ఆయన ఫోలియో చికిత్సలో "ప్లాసెంటాల్ గ్రాప్ట్" వైద్యవిధానాన్ని పరిచయం చేసిన మొట్టమొదటి భారతీయుడు. సబ్త్రో చాంటరిక్ ఓస్టియోటొమి కి మెటాలిక్ గైడ్ పద్ధతిని ప్రవేశ పెట్టిన తొలి భారతీయుడు.

ఆయన ప్రపంచంలో బహు కొద్ధిమందికి తెలసిన హాఫ్ నీ జాయింట్ ట్రాన్స్ ప్లాంటేషన్ శస్త్ర చికిత్స నిపుణుడు, తొలి భారతీయుడు. ఈ క్షేత్ర వికాసానికి దోహదపడుతూ, ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఆర్తో పిడిక్స్ పుస్తకం రచించిన తొలి భారతీయుడు.

డాక్టర్ పి.వేణుగోపాల్ హృద్రోగ శస్త్రచికిత్స వైద్యంలో నిపుణులు. 49 సంవత్సరాల సేవ తరువాత 3, జులై 2008న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ డైరెక్టర్ గా పదవీ విరమణ చేసారు.

కేంద్ర ఆరోగ్యమంత్రి అంబుమణి రామదాసుతో అల్ ఇండియా మెడికల్ సైన్సెస్ నిర్వహణపరమైన విధానాలతో విభేదించి, కుట్ర పూరితమయిన చట్టం ద్వారా తొలగింపబడి తిరిగి సుప్రీం కోర్టు ద్వారా నియమింపబడి, సంస్థ లోని డాక్టర్లు, ఇతర సిబ్బంది, పలువురు రాజకీయ నాయకులు, మీడియా వారి మద్దతు పొంది విజయం సాధించిన అరుదయిన వ్యక్తి.

భారత దేశములో మొట్టమొదటి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసిన వైద్యుడు. అనేక అంతర్జాతీయ హృద్రోగ సంస్థలకు సలహాదారుడిగా మరియు సభ్యుడిగా ఉన్న వేణుగోపాల్ తెలుగుజాతికి గర్వకారణం.

యార్లగడ్డ నాయుడమ్మ ప్రఖ్యాతి గాంచిన శిశు వైద్యుడు.ప్రకాశం జిల్లా, కారంచేడు గ్రామములో జన్మించారు. గుంటూరు వైద్యశాలలో పనిచేస్తున్నారు. అతి కష్టమైన శస్త్ర చికిత్సలు చేయుటలో నిష్ణాతులు. జన్మతోనే వివిధ రీతులలో అతుక్కుని పుట్టిన మూడు అవిభక్త కవలల విజయవంతముగా శస్త్ర చికిత్స చేసి వేరు చేశారు. 2016లో వైద్యరంగంలో ఆయన చేసిన సేవలకుగాను పద్మశ్రీ పురస్కారం లభించింది.

హెచ్.ఎం.లాజరస్ లేదా హిల్డా మేరీ లాజరస్ (జనవరి 23, 1890 - జనవరి 23, 1978) ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణులు.వీరు జనవరి 23, 1890 సంవత్సరంలో విశాఖపట్టణంలో జన్మించారు. వీరిది క్రైస్తవం స్వీకరించిన బ్రాహ్మణ కుటుంబం.ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వంచే స్త్రీల వైద్యసేవల నిమిత్తం భారతదేశంలో తొలి వైద్యురాలిగా నియమితులయ్యారు.

ప్రసూతి విభాగంలో సహాయకురాలిగా తొలి రెండు నెలలు పనిచేశారు. తరువాత కలకత్తాలోని డఫెరిన్ ఆసుపత్రికి బదిలీ అయ్యారు. అక్కడ 13 నెలలు ఆర్.ఎం.ఒ.గా సేవలందించి సూరత్ వెళ్ళారు. మూడున్నరేళ్ళ తరువాత విశాఖ డఫెరిన్ వైద్యాలయంలో చేరారు. విశాఖలో ప్రసూతి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి తెలుగులో బోధనకు అంకురార్పణ చేశారు.

అలా విశాఖలో ఐదేళ్ళు, చెన్నైలో పన్నెండేళ్ళు, లేడీ హార్డింగ్ కళాశాల ప్రధానోపాధ్యాయినిగా మూడున్నరేళ్ళు పదవీ బాధ్యతలు నిర్వర్తించార

డా. నోరి దత్తాత్రేయుడు (Dr. Dattatreyudu Nori) సుప్రసిద్ధ భారతీయ వైద్యుడు మరియు రేడియేషన్ ఆంకాలజిస్టు. ఈయన అమెరికాలోని మెమోరియల్ స్లోన్ కేటరింగ్ ఆసుపత్రి యందు క్యాన్సర్ విభాగానికి అధికారిగా సేవచేస్తున్నారు.ఫిబ్రవరి 1972 నుండి ఫిబ్రవరి 1973 వరకూ గాంధీ ఆసుపత్రి లో పనిచేసారు . 1973 నుండి 1976 వరకు హైదరబాద్ ఉష్మానియా యూనివర్సిటీ కి అనుబంధం గా ఉన్న రేడియం ఇంస్టిట్యూట్ అండ్ క్యాన్సర్ హూస్పిటల్ లో రెసిడెంట్ గా పనిచేసారు . అనంతరము అమెరికా వెళ్ళారు .

ఈతనికి మొదటి నుండీ క్యాన్సర్ వైద్యం లో ఏదో చేయాలని తపన ఉండేది . అందుకే ఈ విభాగములో నూతన విధానాలు కనిపెట్టడానికి కృషిచేసారు . తన కృషిలో ఎన్ని వైఫల్యాలు ఎదురైనా లెక్కచేయకుండా విజయం కోసం తపించారు .క్యాన్సర్ వ్యాధికి సంబంధించి 4 పుస్తకాలు , 200 పైగా పేపర్లు రాసారు . డా. నోరి ప్రపంచం లోనే బ్రాకీథిరపీ (brachytherapy) అనే వైద్యప్రక్రియలో అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తి. ఈయన ఈ ప్రక్రియను 1979 నుండి ఉపయోగిస్తూ, వైద్యపరిశోధన మీద దృష్టి యుంచి దీనిని అభివృద్ధిచేసి, ఎందరో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు నయం చేశాడు.

చిట్టూరి సత్యనారాయణ (అక్టోబరు 6 1913 - ఏప్రిల్ 19 2012) భారతదేశ ఇ.ఎన్.టి నిపుణులు. ఆయన భారత రాష్ట్రపతికి వ్యక్తిగత వైద్యుడుగా పనిచేసారు.ఈయన తూర్పు గోదావరి జిల్లాలోని పామర్రు గ్రామంలో సర్వారాయుడు, సుభద్ర దంపతులకు అక్టోబరు 6 1913 న జన్మించారు. తాను నేర్చుకున్న ఆధునిక వైద్యం ప్రాచీన విజ్ఞానంలోని నిగూఢ శాస్త్ర సత్యాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని అధర్వణ వేదాన్ని అధ్యయనం చేసారు. వేదపండితుల వద్ద శిక్షణ పొందారు. అధర్వణ వేదం నుండి అనేకానేక గర్బ నిరోధక పద్ధతులను వెలికితీసి, తమ వైద్య శాస్త్ర చరిత్రలో పొందువరిచారు. ప్రాచీన వైద్య విధానాలను మధించారు.

ఇ.ఎన్.టి స్పెషలైజేషన్ గా పలు పరిశోధనలు చేసారు. వివిధ వైద్య పరిశోధక పత్రికలలో అనేక పరిశోధన వ్యాసాలు వ్రాసారు. ఎం.జి.రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి కాక ముందు జరిగిన ఒక దాడిలో ఒక తూటా ఆయన కపాలం దిగువన సైనస్ మార్గం లో ఒక చోట చిక్కుకుపోయి, వైద్యులకే సమస్యగా మారింది. క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ఆయన చాకచక్యంగా జూన్ 12 1967 న ఆ తూటాను తీసేసారు. తన 83 వ యేట గాంధీ శాంతి బృంధం తరపున అమెరికా మొదలగు దేశాలలో రాజాజీ వెంట వెళ్లారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి గౌరవ పురస్కారం అందుకున్నారు.టోక్యో లో జపాన్ క్రౌన్ ప్రిన్స్ చేతుల మీదుగా ప్రతిభా పురస్కారం అందుకున్నారు. ఈయన వారసులలో దాదాపు అందరూ వైద్యులే. ఈయన అనేక మంది రాష్ట్రపతులకు వ్యక్తిగత వైద్యుడు వైద్య పరిశోధకుడు అయిన డాక్టర్ చిట్టూరికి వ్యాధిగ్రస్తులకు స్వాంతన చేకూర్చడమే ధ్యేయం. ఆయన 2012 లో మరణించారు.

ఇందిరా నాథ్ (జ. 14 జనవరి, 1938) సుప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్త. గుంటూరులో జన్మించారు. తొలుత లండన్ నగరములోని ఈస్ట్ సఫొల్క్ వైద్యశాలలో (1963-64), తరువాత కార్డిఫ్ నగరములోని వైద్య కళాశాలలో (1964), లండన్ లోని రాష్ట్రీయ హృదయ వైద్యశాలలో (1965) పనిచేశారు. 1965లో సెయింట్ ఆండ్రూస్ వైద్యశాలలో రిజిస్ట్రార్గా నియమించబడ్డారు. 1967లో స్వదేశము వచ్చి AIIMS లో బయోటెక్నాలజీ విభాగానికి అచార్య పదవి (1967 - 71) చేబట్టారు. సత్యేంద్రనాథ్ బోస్ రీసెర్చ్ సంస్థలోప్రొఫెసర్ గా ఉంటూ (1999) ఎంతో మంచి వైద్య విద్యార్థుల పరిశోధనలకు ఊతమిచ్చారు.

వ్యక్తులలో తీవ్ర ఆరోగ్య నష్టాలకు దారితీసే క్లిష్టమైన సమస్యలను కనుగొనడంలో, సునాయాసంగా, ముదస్తుగా కుష్టువ్యాధిని గుర్తించేందుకు రెండు "ఎం లెఫ్రాయ్" ప్రోటీను అన్వేషించి కనుగొనడాంలో ఈమె పరిశోధనలు ఎంతో మార్గదర్శకం వహించాయి. మూడు నుంచి ఆరు వారాల లోపుగానే లెప్రా బాలిల్లి(శరీరమంతా వ్యాపించిన లెప్రొమా కంతులు) ని సూక్ష్మ దర్శిని ద్వారా కనుగొనడాన్ని వివరించారు. వంశపారంపర్యంగా తలెత్తు శోష రస కణముల అసాధారన అభివృద్ధిని, వాటి పనితీరును తన పరిశోధనల ఫలితాల ద్వారా వెల్లడించారు. ఉత్తమ స్థాయి ఔషధాల ద్వారా కూడా సాధించలేని వ్యాధి నివారణకు మూలములను కనుగొన్నారు.. కుష్టువ్యాధి బయల్పడక పూర్వమే, దాని ఆనుపానులను కనుగొని మూలములను నశింపజేయటానికి అవసరమైన చికిత్సలను కనుగొని, మన దేశములో కుష్టువ్యాధి వ్యాపించకుండా ఉండటానికి తమ వంతు కృషి చేసి విజేత కాగలిగారు.

కుష్టు వ్యాధి మీద ఈమె చేసిన పరిశోధనలు ప్రపంచ ప్రసిద్ధమైనవి. ఈమె ప్రస్తుతం అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలోని బయోటెక్నాలజీ విభాగానికి అధిపతిగా ఎస్.ఎన్.బోస్ కేంద్రంలో పరిశోధకులుగా చిరకాలంగా పనిచేస్తున్నారు

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.