మౌనం

ఒక ఊరిలో రాజు మరియు సతీష్ అనే ఇద్దరు మిత్రులు వుండే వారు.

వారు ఎప్పుడూ వారి వాగుడుతనంతో అందరి చేత తిట్లు తినేవారు.

అది చూసిన వారి సుందరం మాస్టారు ఒక ఉపాయాన్ని ఆలోచించాడు.

వారికి ప్రతి ఆది, మంగళ‌ , శనివారాలు అనగా ఒక వారంలో మూడు రోజుల పాటు మౌనం పాటించమని సలహా ఇచ్చాడు.

రాజు గురువు చెప్పినట్టు వినేవాడు.

సతీష్ మాత్రం గురువు మాటను పెడ చెవిన పెట్టాడు.

అదే ఊరిలో గంజయ్య అనే గజదొంగ వుండేవాడు.

వాడికి చెవిలో డప్పు కొట్టినా వినిపించనంత బ్రహ్మ చెవుడు వుండేది.

అతనికి ఒక పుట్టు మూగ వాడైన కొడుకు వుండేవాడు.

గంజయ్య ఎప్పుడూ ఆ పిల్లవాడిని చూసి బాధ పడుతుండేవాడు ..

ఒక శనివారం రోజు రాత్రి గంజయ్య ఎప్పటిలానే దొంగతనానికి బయలుదేరాడు.

అదే సమయంలో రాజు, సతీష్‌లు ఇంటికి తిరిగి వస్తున్నారు.

గంజయ్య వారిద్దర్నీ ఆపి తన దగ్గరున్న కత్తితో బెదిరించాడు.

వారి దగ్గర వున్న డబ్బును ఇచ్చేయమన్నాడు.

ఊహించని ఆ సంఘటనికి వారిద్దరూ బెదిరిపోయారు.

వారి వద్ద డబ్బు లేనందుకు ఏం చేస్తాడోనని ఇంకాస్త కలవరపడ సాగారు.

అంత భయంలోనూ రాజు తన మౌన వ్రతాన్ని వీడలేదు.

సతీష్ మాత్రం నవ్వుతూ మన లాంటి వాళ్ళ దగ్గర డబ్బు ఎందుకు ఉంటుంది అని నవ్వుతూ గంజయ్య‌కు చెప్పసాగాడు.

చెవిటివాడైన గంజయ్య సతిష్ తనను తిడుతున్నాడనుకొని సతీష్‌ని కత్తి‌తో పొడిచేశాడు.

తరువాత రాజు‌ని డబ్బు అడగగా మౌనం పాటిస్తున్న రాజు తన దగ్గర డబ్బు లేదని సైగలతో చెప్పసాగాడు.

ఆ సైగలు చేస్తున్న రాజు కూడ తన కొడుకు లానే మూగవాడేమో అని గంజయ్య అనుకున్నాడు.

వెంటనే తనని బెదిరించడం ఆపేసి తన దగ్గరే వున్న డబ్బునే తిరిగి రాజుకి ఇచ్చి తను వెళ్ళిపోయాడు.

తన ప్రాణాలు మిగిలినందుకు మనసులోనే గురువు ధన్యవాదాలు తెలుపుకున్నాడు...

సతీష్ తన వాగుడు తనంతో ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు.

నోరు తెరవందే చేపైనా గేలంలో పడదు ..మనిషి కూడా ఎంత తక్కువ మాట్లాడితే అంత అభివృద్ది చెందుతాడు.

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.