మాయ జాలం మనుష్య లోకం

“నారాయణ నారాయణ ..”అంటు నారద ముని వైకుంటం ప్రవేశించాడు....,

“ విషయము ఏమిటి నారదా....!”అని శేష తల్పముపై సేద తీరి ఉన్న విష్ణు మూర్తి అడుగగా...

“.. యేమని చెప్పను , యెంతని చెప్పను కలియుగములో జతుగుతున్న వింతలను... ఆడ మగ తేడా తెలియకుండా..వేషదారణ... , అమ్మాయిలు పాంట్ షర్ట్స్ ...కత్తరించిన జుట్టు.తెలియని ఆడ తనం..ఇలా అబ్బాయిల సంగతంటావా....మోకాళ్ళ పైకి నిక్కర్ల లాంటి ప్యాంటు ..బుజాల వరకు జుట్టు...కొంత మందైతే..ఏకంగా ముడి పెట్టుకుంటున్నారు....గడ్డలు ..మీసాలు తీసి ...నున్నటి ముఖాలతో...మెరుస్తూ ఉన్నారు.. , పంచె కట్టు మగాడు... చీర కట్టు ఆడది కరువాయే ..

ద్వాపర యుగమున ధర్మరాజు జూదమాడి తమ్ములను భార్యను కుదువ పెట్టినాడు ..

నేడు కుటుంబ సపరివారముగా జూదము ఆడుతున్నారు ... కుదువ పెట్టుటకు తల నీలాలు తప్ప ...అదే ఫాషన్...మత్తు పానీయాలు..మాదకద్రవ్యాలు.. సేవించటం...మత్తులో విచక్షణ మరచి జీవించటం...,

లక్ష్మి దేవి నీ పాదాల చెంత ఉండి..మొలక నవ్వుల వలపులనిస్తూ...అనురాగాల తెలిస్తుంది..., మీ ఇద్దరి అన్యోనత ఎప్పటికి ... కడు ముచ్చటే.....,

కలియుగమున భార్య భర్త సరి సమానము అంటారు ...లేకుంటే విడాకులంటూ...గుప్పిట ఉన్న కాపురాన్ని కోర్టుల వరకు తీసుకెళ్ళి ...ముడునాళ్ళకె..బ్రతుకు దుర్బరం చేసుకుంటున్నారు...పసిపిల్లలను విదిపాలు చేస్తూ...” అంటూ నిట్టూర్చాడు నారదులవారు...

“ఇంకా చెప్పు నారద కలియుగ వింతలు వేశేశాలు..’ అని విష్ణు మూర్తి ప్రసించాడు...

“ఇక చెప్పుకోవలసిన వింత ఏమంటే.., మనమేమో పుష్పక విమానము పై ఇద్దరు లేక ముగ్గురాము మాత్రమే విహారము చేస్తాము...కానీ.., అక్కడేమో మూడు వందలకు పైగా పక్షిలా కనిపించే యత్రం....దాన్ని విమానము అంటారు...అందులో విహారము ..ఎక్కడికైనా...గంటలలో చేరుకుంటారు...దేశ విదేశాలకు...రాకెట్ అని ....అందులో ఐతే...ఇతర గ్రహాల పైకి కుడా వేసుతున్నారు ప్రభు...!” అంటూ..కళ్ళు ఇంతింత చేసుకుని మరి తెలిపారు నారదుల వారు..

“ నారద నాకు చూడాలని ఉంది.... కలియుగ వింత ,..అని సంబర పడిన విష్ణు మూర్తి తో..

“ సరి సరి... నీవు నాలుగు చేతులు , ...నీల వర్ణంతోను...నేను తుంబురము చేత పట్టిన...ఇలా వెళితే... మనని సంక్రాంతి సంబరాలకి... లేదా అమెరికాలో హాలోవీన్ కాస్ట్యూమ్స్ అని భావిస్తారు... నారాయణ , మామూలు మనుష్యులలా...మారి..వెళదాము...” అంటూ...విష్ణు మూర్తిని ప్రయాణం గావించారు నారదులవారు..

“అలాగే ..నారదా.. భూలోకంలోని వింతలను చూసి , ..ఆపదలో ఉండి..సత్యవంతంగా జీవిస్తూ...దైవ స్మరణ చేస్తూ...తనకు కలిగిన దానిలో కొంత ఇతరులకు పెట్టాలనే బుద్ది కలిగిన వారిని...న్యాయ పరంగా వారాలనిస్తూ... మన బిడ్డలను ఆదుకుందాము... నారద .!...అంటూ...నరడులవారి వెనుకెనుకే...కడుగులు కదుపుతూ....నడువసాగారు..మన విష్ణు మూర్తి గారు...!!

. ( నీతి ఆపదలో ఆదుకున్న మనిషి ...దేవునికి ప్రతి రూపము , ...ఎదుటి మనిషిలో దైవాన్ని చూడాలి .!! ఓం నమోనారాయణాయ... దేవ దేవ )..

********************* ************* ******************


.. రచన అనురాధ కట్ట ..

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.