అనుకున్నది ఒకటి. ..అయ్యింది ఒకటి


అనుకున్నది ఒకటి......... అయ్యింది మరొకటి


ఒక్కొకసారి మనం ఒకటి అనుకుంటే....మరొకటి జరుగుతుంది........ఏదైనా మన మంచికే iఅనుకోవాలి.

ఉదయాన్నే లేస్తూనే ఫోన్ రింగ్ అవుతుంటే తీసి ‘హలో’ అంది దుర్గ...

‘ఆంటీ! నేను ప్రియాను...’’ అవతల నుంచి కొంచెం కంగారుగా ప్రియ గొంతు వినబడింది.

‘అ... చెప్పమ్మా! “

‘ఆంటీ! శ్రీను అంకుల్ ఫోన్ నెంబర్ ఇవ్వరా...”’

‘ఆ.....నేను మరల ఫోన్ చేసి చెపుతాను” ....నేను కాంటాక్ట్స్ లోకి వెళ్లి చూచుకొని’’ అని ఫోన్ పెట్టేసింది దుర్గ.....ఆ తరువాత పని హడావిడిలో పడి మర్చి పోయింది . తరువాత్ మరల అరగంటకు మరల ఫోన్ చేసింది ప్రియ....

“ఆంటీ! శ్రేణు అంకుల్ ఫోన్ నెంబర్ ఇవ్వరా...”అయ్యో! మరచి పోయాను...... ఇదిగో ఇప్పుడే ఇస్తాను...........కాంటాక్ట్స్ లోకి వెళ్లబోతుంటే మరల ఫోన్ మోగింది....చిన్ననాటి స్నేహితురాలు సరళ ఫోన్ .....తనతో అరగంట మాటలాడి ఫోన్ పెట్టేసేసరికి ప్రియ నుంచి ౩ మిస్స్డ్ కాల్స్ ఉన్నాయి........

దుర్గ ఆలోచించసాగింది. ఎందుకు ప్రియ ఇన్ని సార్లు శ్రీను నెంబర్ కోసం ఫోన్ చేసింది..... ఏమైఉంటుం దబ్బా.............. శ్రీను దుర్గకు చెల్లెలి కొడుకు .........శ్రీను వాళ్ళ ఇంటి ప్రక్కనే సురేష్ వాళ్ళు ఇటీవల ఇల్లు కట్టుకొని శ్రీను వాళ్ళతో కలిసిపోయి దుర్గ ఇంటికి వస్తు పోతూ బాగా క్లోజ్ అయ్యారు. ప్రియ సురేష్ మేనకోడలు......కానీ తరువాత తెలిసిందేమంటే సురేష్ అక్క కులాంతర వివాహం చేసికొని ప్రియ పుట్టిన తరువాత చనిపోయిందని సురేష్ బావ మరల పెళ్లి చేసికొన్నా సురేష్ తో సత్సంబంధాలున్నాయని, ఆ వచ్చిన భార్య కూడా సురేష్ ని తన సొంత తమ్ముడిలా చూసుకుంటుందని, ప్రియను అయితే సొంత బిడ్డలగా చూచుకుంటదని శ్రీను చెప్పాడు ....దుర్గకు చాలా ఆశ్చర్యం వేసింది. టీ.వీ. సీరీయల్స్ ప్రభావం దుర్గ పై బాగా ఉండటం వలన శ్రీను మాటలు నమ్మ లేక పోయిది. కానీ ఇటీవలే సురేష్ పెళ్ళిలో ప్రియను సురేష్ బావ పెళ్లి చేసికొన్న శ్యామలను చూచి నప్పుడు విస్తు పోయింది. అంతవరకు ఎమేమో ఊహించుకున్న ఆమె మనసు వాళ్ళ అన్యోన్యతను జీర్ణించుకోలేక పోయింది.

ఎందుకు ఇప్పుడు ప్రియ శ్రీను నెంబర్ కావాలంటున్నది .................సురేష్ కు వాళ్ళ బావకు ఏమైనా గొడవలు వచ్చాయేమో ........శ్రీను సురేష్ కు నచ్చ చెబుతాడేమో అని ఫోన్ చేసాడేమో ........అంతే అయ్యుంటుంది .....తన మదిలో చెలరేగే ఊహలు ప్రక్కన పెట్టి కాంటాక్ట్స్ లోకి వెళ్లి శ్రీను ఫోన్ నెంబర్ నోట్ చేసికోని ప్రియకు ఫోన్ చేసి నెంబర్ చెప్పింది ‘’థాంక్స్...ఆంటీ!”” అంటూ ఫోన్ పెట్టేసింది ప్రియ.....’ ’ఎందుకు అని అడగటానికి కుడా ఛాన్స్ ఇవ్వలేదు.... ఏమి అయి ఉంటుంది ......దుర్గ మదిలో ఒకటే ఆలోచనలు........అసలే శ్రీను అందరి విషయాల్లో తల దూర్చుతాడు...ఎందుకైనా మంచిది ఒకసారి శ్రీనును హెచ్చరిస్తే మంచిది అనుకొని శ్రేనుకు ఫోన్ చేసింది........రింగ్ అవుతుంది ...కానీ ఫోన్ ఎత్తలేదు ....ఏమయ్యాడో...శ్రీను ఎప్పుడు ఇంతే ......ఫోన్ త్వరగా లిఫ్ట్ చేయడు....అనుకొంది... ౩ సార్లు ఫోన్ చేసినా శ్రీను రిసీవ్ చేసికోలేదు

ఇంతలో మరల ప్రియ ఫోన్ చేసి ‘’’ఆంటీ! శ్రీను అంకుల్ భార్య విజయ ఫోన్ నెంబర్ ఇవ్వరా......అని అడిగింది ....కాంటాక్ట్స్ లోకి వెళ్లి విజయ నెంబర్ ఇచ్చింది. థాంక్స్ చెప్పి ఫోన్ పెట్టేసింది ప్రియ. అవును....నాకు ఈ తెలివి రాలేదే... శ్రీను ఎత్తక పొతే శ్రీను భార్య విజయకు ఫోన్ చేయ వచ్చుగా... అనుకొని వెంటనే విజయకు రింగ్ చేసింది .. ౩ సార్లు రింగ్ చేసినా విజయ కూడా రిసీవ్ చేసికోలేదు. ...ఏమయింది......సురేష్, శ్రీను ఏమైనా గొడవ పడ్డారా.......ఎందుకు ప్రియ ఇద్దరి నంబర్లు అడిగింది......ఆలోచనలతో ఆమె బుర్ర వేడెక్కింది.

మరలా ప్రియ ఫోన్ చేసి ‘’ఆంటీ! శ్రీను అంకుల్ కొడుకు ఆదిత్య ఫోన్ నెంబర్ ఇవ్వరా.... అని అడిగింది. ‘’వాడి నెంబర్ నా దగ్గర లేదు...ప్రియా....అసలు ఎందుకు వీళ్ళ ఫోన్ నంబర్లు అడుగుతున్నావు......... విషయం ఏమిటి?.........మెల్లగా విషయం రాబట్టాలని దుర్గ అడిగింది.

‘’ఏంలేదు అంటీ..... శ్రీను అంకుల్ ఫ్యామిలీ సురేష్ అంకుల్ ఫ్యామిలీ తిరుపతి వెళ్ళారుగా............ఎంత ఫోన్ చేసినా సురేష్ అంకుల్ ఫోన్ తీయడం లేదు......మిస్సెడ్ కాల్ చూచైనా వాళ్ళు ఫోన్ చేయటం లేదు. అమ్మ మనస్సు కీడు శంకిస్తుంది.........అమ్మ కు చాలా టేన్షన్ గా ఉంది.... ‘’....అప్పుడు గుర్తు వచ్చింది డుర్గకు శ్రీను రెండు రోజుల పాటు కనపడనని, సురేష్ ఫ్యామిలీతో కారులో తిరుపతి వెళ్ళుతున్నాని చెప్పినట్లు......’’ఆ...అవును......నేను కుడా ఫోన్ చేసాను.....లిఫ్ట్ చేయడం లేదు........కారులో వద్దంటే వినలేదు... ఆసలే ఆ తిరుపతి ఘాట్ రోడ్లు......ఏ యాక్సిడెంట్ అయ్యిందో ఏమో...... ‘’ అంది దుర్గ.....’’వద్దు ఆంటీ ....అలాంటి అపశకునపు మాటలు అనవద్దు. .... ఎం జరుగదు....పాజిటివ్ గా థింక్ చేద్దాం........మంచే జరుగుతుంది. ‘’ సరేనమ్మా!....నేను కూడా ఫోన్ చేస్తూ ఉంటాను... మీకు ఏమన్నా కబురు తెలిస్తే నాకు వెంటనే ఫోన్ చేయండి..... ‘’ అంది దుర్గ.. ‘’అలాగే ఆంటీ!” అంది ప్రియ.

ఫోన్ పెట్టేసిన దగ్గర్నుంచీ దుర్గ మైండ్ లో ఒకటే ఆలోచనలు. .........అయ్యో ఎలా ఉన్నారో........ఆ ఘాట్ రోడ్లలో కారు దొర్లి పడిపోతే ఇంకైమయినా ఉందా......యాక్సిడెంట్ అయ్యిందేమో .....హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారేమో.........అసలు అ ఘాట్ రోడ్డులో కారు లోతుకు పడిపోయిందేమో.......ఎవరు చూడలేదేమో.... అందుకే ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదేమో.....ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటి..........భయం, అలజడితో ఆమె మనసు కుదురుగా ఉండక పరి పరి విధాల ఆలోచించ సాగింది. శ్రీను ఫోనుకు, విజయ ఫోనుకు మార్చి మార్చి రింగ్ చేసింది.........ఎవ్వరూ లిఫ్ట్ చేయటం లేదు.......అయ్యో......... ఇప్పుడెలాగా.........కాలు గాలిన పిల్లిలా ఇంట్లోకి, బయటకు తిరగసాగింది.......భర్త కు ఫోన్ చేద్దామంటే ఈ రోజంతా మీటింగ్ ఉంది........ఫోన్ చేయవద్దని చెప్పారు....ఎలా...ఎలా.......భయం, ఉత్కంత్తతతో 5 గంటలు గడిచాయి.... ఎన్ని సార్లు ఫోన్ చేసినా నో రెస్పాన్స్..........ప్రియకు ఫోన్ చేసింది......ఏమైనా తెలిసిందా.. అని.....లేదు ఆంటీ అని చెప్పింది. ...’’ప్రియా!.......మీకేమయినా తెలిస్తే నాకు వెంటనే ఫోన్ చేయమ్మా’’... అంది...’’ఏం ఫరవాలేదు.......అంతా మంచే జరుగుతుంది.. మీరు టేన్షన్ పడకండి..’ అంది ప్రియ...

ఇంలో ఫోన్ రింగ్ అయ్యింది....ప్రియ ఫోన్.... అమ్మో... ఎం వినాల్సి వస్తుందో .... దేవుడా... నీవే ఉన్నావు.... అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది ......’

ఆంటీ!..... అంటూ పకప నవ్వింది ప్రియ.......

’ఏమయ్యింది ....ప్రియా......నా కసలే టెన్షన్ గా ఉంటే నువ్వేమిటి ...పక పక నవ్వుతున్నావు........ అసలు ఏమయింది..........”’

‘’ఏమీ లేదు ఆంటీ!.... వాళ్ళంతా క్షేమమే.....

‘’క్షేమమా........మరి ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు...”’

‘’వాళ్ళు దైవ దర్చనానికి వెళ్ళారట...........గుడిలోనికి ఫోన్లు అనుమతించరు గనుక ఫోన్లు అన్నీ కారులోనే వదిలేసి

కారుకు లాక్ వేసి వెళ్ళారుట..........”

‘ఆ..అ....ప్రియా చెప్పే మాటలు దుర్గకు వినిపించడం లేదు ....’’నేను పోజిటివ్ గా థింక్ చేయమని మీకు చెప్పుతునే ఉన్నానుగా ఆంటీ .........ప్రియ మాటలు పూర్తి అవ్వకుండానే ఫోన్ రింగ్ అయ్యింది........

శ్రీను ఫోన్ చేస్తున్నాడు...... నీరసంగా ‘హల్లో’.... అంది దుర్గ.......

‘’ఏమిటి ....పిన్ని.... 56 సార్లు ఫోన్ చేసావు.......ఏమయ్యింది....ఇప్పుడే ప్రియతో మాట్లాడాను.........నెవ్వు చాలా టెన్షన్ పడ్డావని చెప్పింది.... మేమంతా ఫోన్లు కారులో పట్టేసి వెళ్ళాము......అన్నాడు......

‘‘అవునా......’’’ మాటలు కరువయ్యాయి దుర్గకు .........


telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.