ఎత్తుకు పై ఎత్తు (బాలల కథ)

ఎత్తుకు పై ఎత్తు (బాలల కథ)

వంతలాపురం అడవిలో చిత్రాంగి అనే చిరుత ఉండేది.

ఆ చిరుతకు అడవికి రాజు కావాలనే కోరిక విపరీతంగా ఉండేది.

అప్పటికే సింగరాజు అనే సింహం అడవికి మృగరాజుగా ఉండేది.

దానిని ఎలాగైనా చంపేసి, అడవి మృగాలపై పెత్తనం చెలాయించాలనే కోరక బాగా ఉండేది చిరుతకి.

అందుకే నేరుగా సింహం వద్దకు వెళితే చావు తప్పదని భావించి, నేరుగా ఏనుగు దగ్గరకు వెళ్లింది

"మిత్రమా.. ఆజానుబాహుడవు.. ఉంటే గింటే నీవే అడవికి రాజుగా ఉండాలి..కానీ.. నీకంటే బలహీనమైన ఆ సింహానికి ఎందుకు అధికారం" అని ఏనుగుని రెచ్చగొట్టి, సింహం మీదకి పోరుకి పురమాయించింది

ఏనుగు ఈ విషయం గురించి ఆలోచించేలోగానే, చిరుత మళ్లీ నక్కల గుంపు దగ్గరకు వెళ్లింది

"మిత్రులారా.. ఏనుగు, సింహానికి మధ్య జరిగే పోరులో, సింహం మరణించగానే, వెనువెంటనే మీ ఏనుగు మీదకు దాడి చేయండి. దాన్ని చంపి తినేయండి. నేను మీకు సహకరిస్తాను" అని మంతనాలు జరపసాగింది.

ఈ మాటలను ఏనుగు చాటుగా వింది.

తెలివిగలదైన ఏనుగు సింహానికి ఈ సమాచారాన్ని చేరవేసి, తనతో కలిసి పోరాడున్నట్లు నటించింది.

చిరుత భలే మంచి రోజు ఇది అని తనలో తన పాడుకుంటూ.

వారిద్దరి యుద్ధాన్ని దగ్గర నుండి చూడాలని భావించే.. బరి దగ్గరకు వెళ్లింది.

తమ దగ్గరకు చేరగానే, సింహం, ఏనుగులు కలిసి చిరుతపై అమాంతం దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.

అయితే చంపకుండా వదిలిపెట్టి ఇకనైనా సక్రమంగా బతకమని తెలిపాయి దొడ్డ మనసు గల ఆ పెద్ద జంతువులు

నీతి - దురాశ దు:ఖానికి చేటు

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.