హరివిల్లు చిగురించడంతో నీలాకాశం సప్తవర్ణ చీర ధరించినట్టు ఉంది.చంద్రుడు మబ్బుల చాటు నుండి రతిని ఒరా చూపులు చూస్తూ దాగుతుమూతలు ఆడుతున్నాడు.అప్పుడే పురుడు పోసుకున్న పిల్ల గాలులు రతి లేత పరువాలని ముద్దాడుతూ తన్మయత్వంతో మురిసిపోతున్నాయి.మబ్బుల నుండి జాలువారిన చిరుజల్లులు రతి మేనిపై పవళించి ముత్యల వలే మిరిమిట్లుగొల్పుతున్నాయి.చలికి వణికిపోతున్న పకృతి రతి నిచ్వాస ఉచ్వాస లో నుండి వచ్చే వేడితో చలిగాంచుకుంటున్నది.

సమయం సాయంత్రం 5:30 అయినది.చల్లని గాలి,పచ్చని చెట్ల నడుమ రతి ఉద్యానవనంలో కూర్చొని తన మధురాతి మధురమైన సుమధుర మధుర స్మృతుల జ్ఞాపకాలను స్మరిస్తూ నింగికి నయనాలు అర్పించి ,పక్రుతికి తన శరీరాన్ని అందించి తనలో తాను మాట్లాడుకుంటూ స్వర్గలోకానుభూతి పొందుతున్నది.

యవ్వనంలోకి అడుగుపెట్టడంతో లేత మోముపై మొటిమలు ముగ్గు వలే ఉన్నాయి.సూర్యుడు అస్తమించే సమయంలో ఎంతటి ఎర్రగా ఉంటాడో అంతకన్న వెయ్యి రెట్లు ఎరుపు తన అధరాల లోకంలో నింపుకున్నది.ఇంటర్ ద్వితీయ సంవత్సరంఎం.పి.సి చదువుతున్నది రతి.అందలో రతికి సాటి జ్ఞానంలో మేటి ఆ కళాశాలలో ఎవరు లేరు.రతికి కలెక్టర్ అవ్వాలి అని కోరిక ఆ లక్ష్యసాధన వైపే ఆమె అడుగులు వేస్తున్నది.ఇంటర్ మొదటి సంవత్సరంలో స్టేట్ మొదటి ర్యాంకు సాధించి రెండవ సంవత్సరంలో తన విజయ పరంపర కొనసాగించడమే లక్ష్యంగా పెట్టుకొని నిరంతర శ్రమ కృషి పట్టుదలతో చదువుతున్నది.

రతి తండ్రి జ్ఞానేశ్వర్ రావ్ ప్రభుత్వ విశ్వ విద్యాలయానికి ఉపకులపతిగా పనిచేస్తున్నారు.తల్లి సరస్వతి పభుత్వ డిగ్రీ మహిళా కళాశాలకి ప్రధానోపద్యయురాలు.తల్లి తండ్రులు భోదన వృత్తిలో ఉండటం వల్ల రతికి చదువు పై చిన్నప్పటి నుండి మక్కువ ఎక్కువ.ఒక్కగానొక్క కూతురు కావడంతో అల్లారి ముద్దుగా పెంచుకున్నారు.రతి కూడా తల్లి తండ్రులు ఎలా చెపితే అలా విని చదువులో తనను తాను నిరూపించుకుంటూనే ఉంది.ఇలా ఆ చిన్ని కుటుంబం ఈ భూ బంతిలో నివసించుతున్నారు.

రతి రెండవ సంవత్సర పరిక్షలు రాసి పరీక్షా ఫలితలకై వేచిచూస్తున్నది.తండ్రి జ్ఞానేశ్వర్ రావ్ తన కూతురిని ఉన్నత చదువులు పరాయి దేశంలో చదివించాలి అని సంకల్పించాడు.విషయాన్ని వెంటనే భార్య సరస్వతికి చెప్పగానే తను కూడా తన సమ్మతం తెలిపింది.కూతురి గదిలోకి తల్లితండ్రులు ఇద్దరు వెళ్ళి తమ నిర్ణయాన్ని చెప్తారు.రతి మారు మాట్లాడకుండా మీ ఇష్టమే నా ఇష్టము అను అంగీకరిస్తుంది.

పరీక్షా ఫలితాలు వచ్చాయి మళ్ళి తనే స్టేట్ ఫస్ట్ కాని రతి మోములో ఆనందం లేదు తన గమ్యం ఒక్కటే నాన్న గారి కోరిక తిర్చలీ సివిల్స్ లో సత్తా చాటి బడుగు బలహీన వర్గాలకి సేవ చేయాలి అదే తన జీవిత లక్ష్యం దాని కొరకే ఈ అక్షరపోరాటం.అమెరికాలో ఒక మంచి విశ్వవిద్యాలయంలో బి.టెక్ జాయిన్ అయినది.మొదటి సంవత్సరలో విశ్వవిద్యాలయం టాపర్ గా నిలిచి అగ్ర రాజ్యంలో మన తెలుగు వారి సత్తా చాటింది.

అదే కళాశాలలో చదువుతున్న జాన్ కిమ్నిస్ ఇంగ్లడ్ దేశానికి చెందినవాడు.అరుఅడుగుల ఆజానుబాహుడు.రాజ వంశానికి చెందిన వాడు.రతిని చూడగానే ప్రేమలో పడ్డాడు.తను ఎవరో ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకున్నాడు.ఒకరోజు గ్రంధాలయంలో రతి చదువుకుంటూన్నది.అక్కడికి చేరుకున్న కిమ్నిస్ రతి మేని సొగసులను తదేకంగా చూస్తూ ఉహలోకంలో విహరిస్తూన్నాడు.అది గమనించిన రతి అక్కడి నుండి లేచి నడవసాగింది.కిమ్నిస్ కూడా తన వెనుకే అడుగులో అడుగు వేసుకుంటూ పోతున్నాడు.

రతి వెనక్కి తిరిగి హే వై యు ఆర్ ఫాలోయింగ్ మీ అంటుంది.

కిమ్నిస్ నో నో ఐయాం నాట్ ఫాలోయింగ్ యు ఐ ఐ అంటూ ఎదో గోనుకుంటూ వెళ్ళిపోతాడు.

అలాగే రతి వెనుక తిరుగుతుండగానే ద్వితీయ సంవత్సరం వచ్చేసింది పరిక్షలు రాయడం మళ్ళి రతి కళాశాల టాపర్ అవ్వడం జరిగిపోయాయి.

కిమ్నిస్ చెల్లి క్వీన్ లిమ్ర పెళ్లి ఖరారు అవ్వడంతో కిమ్నిస్ చెల్లి పెళ్ళికి తన కళాశాలలో ఉన్న అందరిని ప్రత్యేక విమానంలో ఇంగ్లాండ్ తీసుకుపోవాలని నిర్ణయించుకుంటాడు.అందరికి ఆహ్వానాలు అందించి తన ప్రేయసి దగ్గరకు వెళ్తాడు.పెళ్లి పత్రిక ఇచ్చి కళాశాల మొత్తం వస్తున్నారు నువ్వు కూడా రవళి అంటాడు.తన సరే అని తల ఊపి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.

కిమ్నిస్ కి సందేహం కలుగుతుంది తను వస్తుందో రాదో ఎలాగైనా తనని ఇంగ్లాండ్ తీసుకోని వెళ్ళాలి.అని కళాశాల ప్రిన్సిపాల్ తో చెప్పిస్తాడు.కిమ్నిస్ ఇంగ్లాండ్ రాజ కుమారుడు మన కోసం ప్రత్యేక విమానం వేయిస్తున్నాడు కావున మన కళాశాలలో ఉన్న ప్రతి విద్యార్తి తప్పనిసరిగా రావాలి అని అందరిని ఉద్దేశించి చెప్తాడు.

ఇంకా చేసేది ఏమి లేక రతి కూడా తల్లిదండ్రులతో చెప్పి బయలుచేరి వెళ్తుంది.పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.రాచ మర్యాదలకి అందరు ఆశ్చర్యపోయారు.ఏడూ రోజులు పెళ్లి వేడుకలలో అలసిపోయిన కిమ్నిస్ స్నేహితులందరికీ చివరి రోజు సాయంత్రం పెద్ద పార్టీ ఇస్తాడు.అందరు తాగుతారు,స్నేహితుల బలవంతంతో రతి కూడా తాగుతుంది.మొదటి సారి కావడంతో స్పృహ తప్పి వింత వింతగా ప్రవర్తిస్తూ గంతులు వేస్తునది.ఇది గమనించిన కిమ్నిస్ అక్కడికి చేరుకొని తనకు అలవాటు లేదు అని తెలిసి ఎందుకు ఇచ్చారు అని మందలిస్తాడు.కిమ్నిస్ కూడా మత్తులో ఉన్నాడు.వెంటనే అక్కడి నుండి రతిని తీసుకోని గదిలో నిద్రపెట్టడానికి తీసుకువెళ్తాడు.

రతి కిమ్ము ఎక్కడికి తిసుకేల్తున్నావు నన్ను,నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని నాకు తెలుసులే నిజం చెప్పు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు నాలో ఏమి నచ్చింది అని అంటుంది.కిమ్నిస్ అవును నేను నిన్ను ప్రేమిస్తున్న అని తను రాసుకున్న ఒక కవిత చదివి వినిపిస్తాడు.

*****

నిగ నిగల నగ్నిక

అందాల ఓ దేవకన్య

కన్నులలో మెరుపులు

చెక్కిలలో సోముడి దరహాసం

చూపులలో సూర్య కిరణాలు

పెదవులలో పకృతి అందాలు

నీ నడుము ఓంపులలో

నయాగరా జలపాతం

నీ నాభిపై నా జిహ్వతో

ముద్దుల పుష్పాలు

పుష్పింపజేయాలని

నీ ఊరువుల నడుమ

నే నలిగిపోవాలని

పంచభూతాల సాక్షిగా

నా పంచప్రాణాలు

నీవే..నిన్నే ఎల్లవేళలా

ప్రేమిస్తున్న..ప్రేమిస్తూనే

ఉంటా ఓ నా ప్రియా

అఖిలనేత్రి..!!

*****

ఏమన్నవో నాకు ఏమి అర్థం కాలేదు కిమ్నిస్ కాని నేను కూడా నిన్ను ప్రేమిస్తున్న కాని నాకు కొన్ని ఆశయాలు ఉన్నాయి అందులోను మా అమ్మ నాన్న మన ప్రేమను ఒప్పుకోరు అని ఖరాఖండిగా చెప్తుంది.కావున అర్థం చేసుకో నీది వేరే దేశం నాది వేరే దేశం మన ప్రేమ విజయం సాధించదు అందులోను నేను చాల సాధించాలి అని చెప్పి కంటతడి పెడుతుంది.

కిమ్నిస్ రతిని దగ్గరికి తీసుకోని నేను నీకోసం ఎన్నిరోజులైన ఎదురుస్తాను నీవు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో అది సాధించే వరకు నీకు కనపడను కళాశాల కూడా మారిపోతాను.నీవు విజయం సాధించిన తర్వాత నీకు కనపడతాను అని చెప్పి తనని పడుకోమని చెప్పి వెల్లిపోతుండగా..

రతి వెనుక నుండి కిమ్నిస్ ని హత్తుకుంటుంది.కిమ్నిస్ రతి వైపు తిరిగి తన బాహువులలో రతిని బంధించి రతి ఫలకంపై కిమ్నిస్ పెదవుల ముద్రలు వేసి అక్కడి నుండి నిష్క్రమిస్తాడు.తరువాత రోజు అందరు వెళ్ళిపోతారు కాని కిమ్నిస్ ఇంగ్లాండ్ లోనే వేరే కాలేజీ జాయిన్ అవుతాడు.

రతి రెండు సంవత్సరాలు అమెరికాలో చదివి విశ్వవిద్యాలయం టాపర్ గా నిలిచి.భారతదేశానికి వెళ్ళిపోతుంది.

ఢిల్లీ లో సివిల్స్ కోచింగ్ జాయిన్ అవుతుంది.పగలు రాత్రి ఏంటో కష్టపడి చదువుకుంటుంది.తరచూ కిమ్నిస్ గుర్తు వచ్చేవాడు.అయినా తన తండ్రి ఆశయం గుర్తు తెచ్చుకొని కనీసం ఫోన్ కూడా చేయకుండా అలానే ఒక్క సంవత్సరం కష్టపడి సివిల్స్ లో స్టేట్ ఫస్ట్ వస్తుంది.తన తండ్రి కన్నకలలు నిజం చేస్తుంది.

విషయం తెలుసుకున్న కిమ్నిస్ భారతదేశానికి వచ్చి ఫోన్ చేస్తాడు.నిన్ను కలవాలి నేను ఢిల్లీ లో ఉన్నాను అని తను ఉన్న అడ్రస్ చెప్తాడు.వెంటనే రతి బయలు చేరి వెళ్తుంది.ఒక్కరిని ఒక్కరు చూసుకోని తనివి తీర ఏడుస్తారు.కిమ్నిస్ రతిని కౌగిలించుకొని మోముపై ముద్దుల వర్షం కురిపిస్తాడు.

ఇద్దరు కలిసి ఎన్నో మాట్లాడుకుంటారు,తను ఎంత కష్టపడి చదివి విజయం సాధించిందో వివరంగా చెప్తుంది.కిమ్నిస్ నేను ఇప్పుడు ఇంగ్లాండ్ కి రాజు ను అయ్యాను.నేను నిన్ను తీసుకోని పోతాను నీవే ఇంకా రాణి వి అంటాడు.

లేదు నేను భారతదేశం లో ఉండి పేద ప్రజలకి సేవ చేయాలి అదే మా నాన్న ఆశయం అంటుంది.కాని నేను ఇంగ్లాండ్ వదిలి రాలేను అంటాడు కిమ్నిస్..మరి ఎలా చేద్దాము,ముందు మీ నాన్న తో మాట్లాడి తరువాత ఈ విషయం పై ఆలోచించాలి అనుకుంటారు.వెంటనే ఇద్దరు కలిసి రతి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్తారు.

రతి తండ్రి మాకు ఇష్టమే కాని మా అమ్మాయిని భారతదేశం వదిలి పంపడం కుదరదు ఇక్కడ సేవ చేయాలి మా అమ్మాయి అంటాడు.కిమ్నిస్ మామయ్యా గారు నాకు లక్షల కోట్లు ఉన్నాయి కావలి అంటే మన ట్రస్ట్ తరుపు నుండి ఎన్ని వేల కోట్లు అయిన ఖర్చు చేసి కొన్ని జిల్లాలను దత్తతగా తీసుకుందాము అంటాడు.

లేదు బాబు మా అమ్మాయిని ఒక అధికారి హోదాలో చూడాలి అనుకున్నాము అలానే సేవ చేయాలి అనుకున్నాము ఒక రాణి గా ఉండి చేసే సేవ అది ఎక్కడో పరాయి దేశంలో ఉండి చేయగలదు అని నేను అనుకోవడం లేదు అంటాడు.

మరి నేను మా దేశాన్ని వదిలి రాలేను మామయ్యా ఈ సమస్యకి పరిష్కారం ఏంటి మరి,సరే బాబు అమ్మాయికి పోస్టింగ్ ఇవ్వని తరువాత ఇతర విషయాలు మాట్లాడుకుందాం అంటాడు.

కొన్ని రోజులలో రతికి పోస్టింగ్ ఇస్తారు.జాయిన్ అయ్యి ఉంటుంది.కిమ్నిస్ మన పెళ్లి ఎక్కడ చేసుకుందాము నీవు ఇంగ్లాండ్ కి వస్తావా రావా అంటాడు.ఆ ప్రశ్నకి రతి దగ్గర సమాధానం లేదు అలానే సంవత్సరం గడిచిపోయింది.

ఇంకా చేసేది లేకా కిమ్నిస్ తన రాజ్యానికి రాణి గా తన చెల్లి లిమ్ర ని ప్రకటించి భారదేశం వచ్చేస్తాడు.వచ్చిన వెంటనే అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటారు.భారతదేశంలో తన ట్రస్ట్ తరుపు నుండి కొన్ని జిల్లాలను దత్తతగా తీసుకోని సేవ చేస్తూ ఉంటాడు.

పెళ్లి అయ్యి సంవత్సరం గడిచేలోపే ఒక మగ పిల్లాడికి జన్మనిస్తుంది.అలా వారి జీవితం ఆనందంగా ఉంటుంది.ఇంగ్లాండ్ ఉన్న కిమ్నిస్ చెల్లి అనారోగ్య కారణాలతో మరణిస్తుంది.

ఇంకా మళ్ళి రాజ్యానికి రాజుగా కిమ్నిస్ ఉండిపోతాడు.అప్పుడప్పుడు భారతదేశానికి వచ్చి భార్య బిడ్డలతో గడిపి వెళ్ళిపోతూ ఉంటాడు.కాని రతికి భర్త దూరంగా ఉండటం ఇష్టం ఉండదు కాని నా అవసరం నా దేశానికి ఎంత ఉందో తన దేశానికి తన అవసరం కూడా ఉంది అని భావించి సర్దుకుపోతూ ఉంటుంది.

అలానే 10 సంవత్సరాలు గడిచిపోతాయి ఒక్కసారి ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి వస్తు ఉండగా కిమ్నిస్ విమానం గాలిలోనే కాలిపోయి కిమ్నిస్ చనిపోతాడు.ఇంగ్లాండ్ రాజ్యానికి రాజు కావలి ఇంకా కిమ్నిస్ వంశంలో ఎవరు లేరు చేసేది ఏమి లేకా తన భర్తకు ఇచ్చిన మాట ప్రకారం రతి ఇంగ్లాండ్ కి వెళ్లి రాణి అవుతుంది.

కాని భారదేశానికి వచ్చి సేవ చేసి కొన్ని వేల కోట్లు ట్రస్ట్ నుండి భారత ప్రభుత్వానికి విరాళంగా ఇవ్వడమే కాకుండా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది.రతి భారదేశం నా మాతృదేశం—ఇంగ్లాండ్ నా భర్త మాతృదేశం..నేను ఇరు దేశాలకి తల్లిని భారత దేశం నా పెద్ద కుమారుడు ..ఇంగ్లాండ్ నా చిన్న కుమారుడు..ఇద్దరు కలిసి మెలిసి ఉండాలి అని కోరుతున్న అని స్టేట్ మెంట్ ఇస్తుంది.

ఆ స్టేట్ మెంట్ తో ఇరు దేశాల ప్రజలు ఆహ్వానిస్తారు.కాని తన భర్త ఇంగ్లాండ్ కి చేయలన్నుకున్న కార్యక్రమాలు అన్ని చేసి ఇంగ్లాండ్ కి తల్లిగా కీర్తి గడుస్తుంది రతి.

అలాగే 25సంవత్సరాల తరువాత కొడుకును ఇంగ్లాండ్ కి రాజుగా చేసి రతి మల్లి భారతదేశానికి వచ్చి దేశ ప్రజలకి నా కడ వరకు ప్రత్యేక్షంగా సేవ చేస్తాను అని భారదేశంలో స్థిరపడిపోతుంది.

నా బిడ్డ నాకు దూరం అయినా నా భారతమాత తల్లి ఒడిలో నా చివరి శ్వాస విడువాలి అని కోరుకుంటున్న..అని దేశానికి సేవ చేస్తూ ఉంటుంది.

********************************************************************************

భారత్ మాతకి జై

మీ

అఖిలాశ

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.