ఇంగితము (కురచ కథ)

రచయిత : బివిడి ప్రసాదరావు

ఆమె, అతడు చదువు కుంటున్నారు.

తన ప్రేమను కాదంటున్న ఆమెను, ఇబ్బంది పెడుతున్నాడు అతడు, మరల మరలా. ఆమె చెప్పింది, మళ్లీ, ఈ మారు కఠినముగా కాదు, నింపాదిగా, "నాకు చదువు అవసరము. మాకు ఆస్తి లేదు. నేను ఉద్యోగము చేసి, మా వాళ్లకు తోడవ్వాలి. నా కోరిక అది. నన్ను నువ్వు నిజముగా ప్రేమిస్తే, దయచేసి నన్ను విడువు"

తర్వాత, చాన్నాళ్లుగా, తన వెంట కానరాని అతడు, ఆమెలో మరుగయ్యిపోయాడు, క్రమముగా.

ఆమె బాగా చదువుకుంది. ఉద్యోగము సంపాదించుకుంది. తన వారిని చక్కగా చూసుకుంటూనే, పెళ్లి చేసుకుంది, తల్లయ్యింది, అమ్మమ్మయ్యింది, నాన్నమ్మయ్యింది, కాల గమనము వెంబడి.

ఆమె చనిపోయింది, తన 61వ యేట, సహజముగానే.

తర్వాత, అప్పుడే, అక్కడ, తన వెంట కాన వచ్చిన అతడును చూసి, పోల్చుకొని, ఆమె అస్తవ్యస్తముగా అడిగింది: "ఇక్కడకు ... నువ్వు ... ఎప్పుడు ... వచ్చావు"

"నువ్వు, నీ వాళ్ల కోసము పరితపిస్తున్నావని చెప్పావు చూడు, అప్పుడే, నీకు ఇక మీదట, ఇబ్బంది పెట్టరాదని, బలవంతముగా నీకు దూరమయ్యాను ... ఆ తర్వాత, నా సంసారము, కష్టాలు, సుఖాలు, సొదలు, రొదలు ... అంతా మామూలే ... ఆ మధ్యనే, చనిపోయి, ఇక్కడకు చేరా. నీ కోసము, ఇక్కడ వేచి, వెతుకుతూ ఉన్నాను. ఇక్కడ, ఇప్పుడు, నీవు కాన వచ్చావు, అమ్మయ్య, ఇక, ఇక్కడ, ఇప్పుడు, ఏ ప్రతిబంధకము నీకు అడ్డు ఉండవు ... కదూ ..." అంటూనే అతడు మాట్లాడుతున్నాడు, ఇంకా.

***

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.