అప్పుడప్పుడే తెల్లవారుతోంది. కానీ ఆకాశమంతా కారుమబ్బులతో హోరుగాలలతో వర్షం మొదలైంది. ఆ వర్షానికి శివ అనే పిల్లవాడు ఇంటి ముందు పడిన వర్షపు నీళ్ళపై పడవలు చేసి వదులుతున్నాడు.
ఆ పడవలు అమాతంగా పెద్ద పేపర్ పడవలు అవుతున్నాయి. ఆ కాగితం పడవలు పెరిగి పెద్దవడం చూసి ఆశ్చర్యపోయాడు. తన అమ్మ నాన్నలను పిలిచి చూపించాడు. వాళ్ళు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ఆ దారిలో వస్తూ పోయే అందరూ చూసి ఆశ్చర్యపోయారు.
మీడియా మొత్తం శివ చేసిన పడవలను చిత్రీకరించి టెలికాస్ట్ చేస్తున్నారు. రకరాకాలైన అనుమానాలతో మీడియా ఒకటే అనుమానాలు? శివని మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని మీడియా చూస్తున్న ప్రజలు కూడా ఆశ్చర్య పోయారు. కాగతం పడవలు అలా పెద్దగ కావడం వెనుక ఏదో కీడుకు సంకేతంలా ఉందని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చానల్స్ రేటింగ్ ఆప్షన్లు కూడా పెట్టిటది. కాగితం పడవ పెరిగి పెద్దవడం మానవాళికి ముప్పు కలుగుతుంది అంటే yes✔ లేకపోతే no❌ పోల్ ఆప్షన్లు పెట్టారు.
నిజానికి అక్కడ ఏమీ జరగలేదు. ఆ శివ కాగితంతో చేసిన పడవకు సైన్స్ ప్రకారం పెరిగి పెద్దయ్యే గుణం ఉంది. అది ఎలాంటిది అంటే ఉదా:- పిల్లలు వాటర్ బాల్స్ అని చిన్న చిన్న మెదడు వాపు గుళికలను చూసారుగా ఆ వాటర్ బాల్స్ నీటిలో వేస్తే అవి ఎలా పెరిగి పెద్దవుతాయో అలా ఆ శివ చేసిన కాగితం పడవకు కూడా అలాంటిదేనని మీడియాలో సైన్స్ నిపుణులు తెలియజేశారు.
అంతటితో ఆ అనుమానాలన్నిటినీ సమాధానం దొరికిందని అందరూ హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. శివ కాగితం పడవ సముద్రాలన్నీ దాటినంత ఘనత వచ్చేసింది!
నీతి:- మనం ఏ విషయానికి తొందర పడక కొంచెం సహనం పాటించాలి.
రచన:- కుంచె19.06.2017


telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.