ప్రేమతో మిగిలెదవా?..........పగతో రగిలెదవా?.......


ప్రేమతో మిగిలెదవా? ....పగతో రగిలెదవా?.....


వివేకానంద కాలేజీలో ఇంటర్ కాలేజీ పోటీలు జరుగుతున్నాయి. డిబేట్. ఎస్సే రైటింగ్, ఆటలు అన్నింటిలో ఆనంద్ కే ప్రైజులు వచ్చాయి. ఓవర్ ఆల్ ఛాంపియన్ షిప్ అందుకుంటున్న ఆనంద్ సంతోషానికి హద్దులు లేవు. కానీ ఆనంద్ ను చూస్తున్న రేవంత్ కు మాత్రం పుండు మీద కారం చల్లినట్లుంది. చిన్నప్పటి నుంచీ ఆనందే చదువుల్లో, ఆటల్లో, పాటల్లో అన్నింటిలో తనకు మించిన టాలెంట్ తొ ముందుకు దూసుకు పోతున్నాడు. రేవంత్ మాత్రం చిన్నప్పటి నుంచీ ఇద్దరూ స్నేహితులైనా ఆనంద్ ను ఓడించ లేక పోయాడు.

  • * * * *

ఆనంద్, రేవంత్ లు మంచి స్నేహితులు. రేవంత్ తండ్రి రామారావు ఆనంద్ తండ్రి సత్యం క్రింద ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అనుకోని ప్రమాదంలో రేవంత్ తండ్రి చనిపోయాడు. వాళ్ళకు వచ్చిన నష్ట పరిహారం ఫిక్స్డ్ డిపోజిట్ వేయించి దాని మీద రేవంత్ కుటుంబం బ్రతికేలా చేసాడు ఆనంద్ తండ్రి సత్యం. కానీ ఇవేమీ రేవంత్ కు తెలియదు. ప్రతి సంవత్సరం అన్నింటిలో ఆనంద్ ఫస్ట్ రావటం రేవంత్ కు సహించ లేని విషయం గా మారింది. టెన్త్ క్లాసులో ఆనంద్ స్కూల్ ఫస్ట్ అయితే రేవంత్ అత్తెసరు మార్కులతో పాసయ్యాడు. కానీ ఆనంద్ స్నేహంలో మార్పు లేదు. రేవంత్ ను ప్రోత్సహించడం తన భాద్యతగా భావించేవాడు. కానీ ఆనంద్ ఇచ్చే ప్రోత్సాహాన్ని కావాలని తనను అవమానిస్తున్నట్లుగా భావించేవాడు రేవంత్. దిన దినానికి ఆనంద్ పై రేవంత్ కు పగ, అసూయ, ద్వేషం వట వృక్షంలా

పెరిగిపోసాగాయి. చివరికి ఆ ఈర్ష్య ఆనంద్ ను ఎలాగైనా అంతమోందించాలనే నిర్ణయానికి దోహదం చేశాయి.

  • * * * *

రాత్రి పది గంటల సమయంలో ఆనంద్ బైక్ మీద వస్తుండగా వేగంగా వెళ్లి తన బైక్ తో డాష్ ఇచ్చాడు రేవంత్. అనుకోని సంఘటనతో “ఆ.........ఆ..........” అంటూ ఆనంద్ బైక్ మీద నుంచీ రోడ్డు మీదకు పడిపోయాడు. వెనుకగా వస్తున్న లారీ ఆనంద్ పైకి ఎక్కటం, ఆనంద్ అక్కడికక్కడే ప్రాణాలు విడవడం త్రుటిలో జరిగిపోయాయి. తన పగ తీరిందని వెనక్కి తిరిగి చూడకుండా ఆనందంగా వెళ్లి పోయాడు రేవంత్.

పోస్టు మార్టం జరిగిన తరువాత ఆనంద్ శవాన్ని ఆనంద్ తల్లి దండ్రులకు అప్ప చెప్పారు. వారు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. కాలేజ్ మొత్తం శోక సముద్రం అయ్యింది. ఇన్స్పెక్టర్ ప్రదీప్ తో కేస్ ఇన్వెస్టిగేషన్ మొదలు అయ్యింది. ఆనంద్ కెవ్వరు శత్రువులు లేరు. లారీ డ్రైవర్ ఎవరో బైక్ తో గుద్దటంతో వెనుక వస్తున్నా తన లారీ క్రింద పడ్డాడని చెప్పటంలో ఆ గుద్దింది ఎవరో ప్రదీప్ కు అంతు బట్ట లేదు. రోడ్డు మీద ఉన్న సి.సి. కెమెరాలో హంతకుడు బైక్ మీద ఆనంద్ ను గుద్దటం కనపడింది. కానీ అతని వెనుక భాగం కెమెరాలో పడటం వలన అతనిని గుర్తు పట్టడం కష్టమైంది. ప్రదీప్ పదే పదే ఆ వీడియోను చూడసాగాడు, ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని. సడెన్ గా ఆగంతకుని మెడ కాలర్ మీద ఏవో అక్షరాలు కనిపించాయి ..అక్కడ జూమ్ చేసి చూడగా మోడరన్ టైలర్స్ వారి స్టిక్కర్ అది. ఆతను నీలి రంగు చొక్కా వేసికొన్నాడు. ఆ ఆధారంతో మోడరన్ టైలర్స్ దగ్గరికి వెళ్లి నీలి రంగు చొక్కా ముక్కను వెరిఫై చేయగా అది రెండు నెల్ల క్రితం రేవంత్ అనే కాలేజ్ స్టూడెంట్ కుట్టించినట్లుగా తెలిసింది. దానితో రేవంత్ ను అరెస్ట్ చేసారు. రేవంత్ మొదట కాదన్నా ఆధారం దొరకటంతో నేరం అంగీకరించక తప్పలేదు.

  • * * * *

జైలు బయట రేవంత్ తల్లి నెత్తీ నోరు బాదుకుంటు “ఎంత పని చేసావురా? అ బాబుని చంపటానికి నీకు చేతులెలా వచ్చాయి?...........మీ నాన్న చనిపోయినప్పుడు వాళ్ళ నాన్న మనకెంత సహాయం చేసారో నీకు తెలియదు. దాని వలనే మనం ఈ రోజు ఇంత తిన గలుగుతున్నాము. ఆ బాబూ ఒక్కడే నీ పుస్తకాలు, స్కూల్, కాలేజ్ ఫీజులు కట్టి నిన్ను చదివిస్తున్నాడు. ఇవేవీ నువ్వు ఫీలవుతావని నీకు తెలియనివ్వవద్దని నా దగ్గర మాట తీసికున్నాడు. నీకు యాక్సిడెంట్ అయినపుడు రక్తం ఇచ్చింది కూడా ఆ బాబే.....నీకింత మంచి చేసిన వానిపై నువ్వు ఎంత పగ పెంచుకున్నావురా...........నిన్ను అ దేవుడు కూడా క్షమించాడు.........దేవుని లాంటి ఆ బాబును పొట్టన బెట్టుకున్నావు గదరా!”” వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది రేవత్ తల్లి రాజమ్మ.

ఆమాటలు విన్న రేవంత్ అదిరిపోయాడు. అతని కాళ్ళ క్రింద భూమి కంపించి నట్లు అయ్యింది. ఆనంద్ వాళ్ళ నాన్న తమకు అంత సహాయం చేసాడా...........ఆనంద్ తన పుస్తకాలు, ఫీజులు కట్టేవాడా?.........ఓ గాడ్.......తనకు యాక్సిడెంట్ అయినపుడు రక్తం ఇచ్చాడా?........ఓ గాడ్..........’’మమ్మీ మరి ఈ విషయం ఎందుకు చెప్పలేదు?””.......అంటూ జైలు ఊచల నుంచి చేతులు బయటకు పెట్టి తల్లిని కుదిపేసాడు రేవంత్........... "అది వాళ్ళ మంచితనం .....బాబూ....కుడి చేయి చేసింది ఎడమ చతికి తెలియనివ్వని దాన గుణం రా!........నీలో నిమ్నతా భావం పెరుగుతుందని నీకు చెప్ప వద్దని నా వద్ద మాట తీసికున్నడురా.......ఎన్నోసార్లు నీకు చెప్పాలని అన్పించినా, అ బాబుకు చేసిన ప్రమాణం నా నోరు నొక్కేసింది. నువ్వేమో ఒక్క మాటైనా నాతొ పంచుకోకుండా పగ, ద్వేషం పెంచు కున్నావు .........ఎనాడైనా నీ మనస్సులో ఇలా ఉందని ఒక్కనాడైనా నా ముందు బయట పడ్డావురా నువ్వు........లేదు........పడితే నీ జీవితం ఈ రోజు ఇలా ఉండేది కాదు....... నువ్వు, ఆనంద్ తో ఎంతో స్నేహంగా ఉన్నావని నేను అనుకున్నాను ..........ఏమాత్రం నీ మదిలోని ఆలోచన నేను గ్రహించి ఉంటే ఆ బాబూ ప్రాణాలు కాపాడి ఉండేదాన్ని.....ఆనంద్ మనం అందుకోలేనంత ఎత్తుకు ఎదిగిపోయాడు......నువ్వేమో అదో:పాతాళానికి దిగజారిపోయావు.....ఇంత పని చేస్తావని నేను అనుకోలేదు.... అయ్యో!....ఎంత ఘోరం చేసావురా.........గొంతు పెగుల్చుకొని ఏడుస్తూ చెప్పింది అ తల్లి...


  • * * * *

పగ, ద్వేషం రెండు నిండు జీవితాలను నాశనం చేసింది. పగ, ద్వేషం వలన మనం సాధించేది ఏమీ లేదు..........

ప్రేమతో దేన్నైనా సాధించ వచ్చు.............కనుక పగతో రగిలెదమా....ప్రేమతో మిగిలెదమా..... అని నిర్ణయించు కోవలసినది మనమే.............

(ఒకచోట జరిగిన యదార్ద సంఘటన ఆధారంగా వ్రాయటం జరిగింది)

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.