రాధా మాధవ్


సాయంత్రం సరిగ్గా ఐదు గంటలయ్యింది. రాధకు చిరాకు కలుగుతోంది. వస్తానన్న సమయానికి అతను రాకపోయేసరికి. పార్క్‌లో ఒంటరిగా ఉన్న రాధను పోకిరి యువకులు అదోరకంగా చూసుకుంటూ వెళ్తున్నారు. అతనిపై ఆమెకు కోపం మరింత రెట్టింపయ్యింది. 

అకస్మాత్తుగా అతను తన కళ్లెదుట కనబడితే చంపేయ్యాలన్న కోపం వచ్చింది. అదే సమయంలో ఆమె కళ్లల్లో ఒక్క మెరుపు మెరిసింది. మళ్లీ వెంటనే నిరాశ తొంగి చూసింది. అతను ఒక అందమైన అమ్మాయితో మాట్లాడుకుంటూ తనవైపే వస్తున్నాడు. రాధకి ఎక్కడ లేని కోపం మరింత రెట్టింపయ్యింది. అప్పటికే కోపంతో రగిలిపోతున్న ఆమెకు నిప్పుకు గాలి తోడైనట్లు కోపం మరి ఎక్కువైంది అతనితో ఆమెను చూసిన తర్వాత. ఇద్దరూ రాధ దగ్గరకు రానే వచ్చారు. మాధవ్ తన ఆఫీసులో పని చేస్తున్న అమ్మాయిని పరిచయం చేశాడు రాధకు. 

రాధకు లోపల కోపంగా ఉన్నా పైకి మాత్రం నవ్వినట్టు నటిస్తూ ఆమె పరిచయాన్ని స్వీకరించింది. కొద్ది సేపటికి ఆ మాటా ఈ మాట మాట్లాడుకునే సరికి పల్లీ.. పల్లీ.. బఠానీ.. బఠానీ.. అంటూ అమ్ముకునే వాడు ఇటువైపు వచ్చాడు. వాడి దగ్గర టైంపాస్‌కు కొన్ని పల్లీలు తీసుకొని ముగ్గురు తింటున్నారు. అప్పుడు రాధకు ఆ అమ్మాయి గురించి అన్ని వివరంగా చెప్పుకుంటూ మాధవ్. ఈ అమ్మాయికి అమ్మ లేదు. నాన్న మరియు చెల్లెలు ఉన్నారు. నాన్నగారు చిన్న ఉద్యోగం చేసినా అది కూడా ప్రస్తుతానికి లేదు. వారిద్దరి జీవిత భారం ఈమెపైనే ఆధారపడి ఉంది. 

అందుకనే మొన్ననే కొత్తగా మా ఆఫీసులో చేరింది. అనుకోకుండా ఈ రోజు వాళ్ల దూరపు బంధువులు ఈ పార్క్‌కు దగ్గరలో ఉన్న కాలనీలో ఉంటున్నారని తెలిసి అక్కడికి వెళ్తుంది. అదే దారి కాబట్టి అలా నాతో కల్సి ఇలా మాట్లాడుకుంటూ వచ్చింది. 

అందుకే ఇంత ఆలస్యమయింది. క్షమించు రాధ అని మాధవ్ వేడుకున్నాడు. రాధలో కోపం అంతా మటుమాయమై నవ్వుల పువ్వులు విరిశాయి. అప్పుడు ఆ అమ్మాయి తలను కిందకు దించుకొంది. 

వారి ముఖాల భావాలను అర్థం చేసుకొని కొద్ది సేపటికి ఆ కాలనీ వెళ్లే బస్సు వచ్చే సమయం అయింది కాబట్టి వెళ్తున్నానని ఇద్దరికి చెప్పి అక్కడి నుండి కదిలింది అమ్మాయి. అప్పుడు రాధకు గుండెల్లోని భారం అంతా ఒక్కసారి దించుకున్నట్లుగా ఉంది. 

వస్తానన్న సమయానికి రాకపోయేసరికి, మళ్లీ అమ్మాయితో రావటం చూసి ఖంగుతిన్నది రాధ. తొందరపాటుతో తప్పుగా అర్థం చేసుకొంది రాధ, మాధవిని. ఆ అమ్మాయి కష్టాలను అర్థం చేసుకొని ఆమెని ఒక చెల్లెలా భావించి మాధవ్ తీసుకురావటం తెల్సిన తర్వాత ఎంతో బాధ పడింది రాధ లోలోపల. పార్క్‌లో ఇద్దరూ ముద్దు, ముచ్చట్లతో సంతోషాలతో ఎన్ని గంటలైనా కొన్ని క్షణాలుగా మారిపోయి అన్నట్లు గడిపారు. 

సమయం దాటిపోతుంది. అప్పటికే మసక చీకట్లు కమ్ముకొస్తున్నాయి. ఇంకా కొద్ది క్షణాలు ఆగితే వర్షం వచ్చేట్లుగా వాతావరణ పరిస్థితి మారింది. ఇలా రోజూ ప్రైవేటు క్లాసులని, ఏదో షాపింగ్ అని మాధవ్‌ను కలుస్తుంది. ఇంకా ఎన్ని రోజులు ఇలా కష్టంగా గడుస్తాయో.. తమ పెళ్లి ఎప్పుడు జరుగుతుందో అని ఆరాటపడుతున్నారు. ఇక ఎవరి ఇంటికి వారు టాటా..బైబై..గుడ్‌నైట్ చెప్పుకుంటూ ఆనంద బాష్పాలతో వెళ్లిపోయారు. కొన్ని రోజులకు వారనుకున్న సమయం, పెళ్లి ముహూర్తం కుదిరింది. ఇద్దరూ పెళ్లి చేసుకొని సుఖఃసంతోషాలతో జీవించారు.


telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.