కలలన్ని రెక్కలు కట్టుకుని ఎగిరిపోయాక..
ఎక్కడినుండి ఎగిరివచ్చాయో కొన్ని సీతాకోక చిలుకలు..
గతాల సమాధి పునాది త్రవ్వి
కొన్ని నిజాలను వెలికి తీసాయి..
నీ వికృత చర్యకి రాలిన పువ్వు
శాశ్వత నిద్రలో వున్నది అక్కడే కదా..!

అబద్దాల సింహాసనాన్ని అధిష్టించాక
నిజం అంటే భయపడాల్సివస్తుంది..
పాతేసిన నిజాన్ని మట్టినుండి వెలికితీస్తే..
క్రూరమైన చూపొకటి నినుహత్య చేస్తుంది..
నిజాలను అమ్ముతానంటూ ఒకడు బయలుదేరాడు..
కొనేవారే కానీ..
వాటిని నమ్మేవారెవరు పుట్టలేదింకా..!

మట్టికింది నిజం కొన్ని కనుల కలలకు కన్నీరయినపుడు..
ఆకాశంలో న్యాయపు జెండానెగరేద్దామనే పోరాటం
చట్టసమ్మతమే కానీ..
అవినీతి చుట్టరికం అండయినవేళా
కళ్ళను పైకెత్తి
నీ కళ్ళలో కళ్ళుపెట్టి ధైర్యంగా చూసేవారెవరు చెప్పు..?

నువేమి చూడకమ్మ అంటూ న్యాయదేవతకు కళ్ళకుగంతలుగట్టి..
ఆడదాన్ని చేసి నోరు, కళ్ళు, చెవులు
అన్నీ మూసేసాక...
ఆడది ఆడదానికే సహాయం చేయలేని పరిస్థితిలో రాజ్యం ఏలుతుంటే..
వివక్షత పెద్దపీటగా అలంకరింపబడ్డాక
నువో నిజం తెలుసుకో...
నీ భుజం పై చేయివేసి సహాయం చేసేవారి చేయి ఓ పెద్ద అబద్ధమని...!

@సిరిమల్లెలు...

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.