తెగింపు

- బూదూరి సుదర్శన్

“వాడు చెబితే నేనెందుకు వినాలి ? నేను వినను!” ఆ అయిదేళ్ళ పిల్లాడి మాటలు చాలా ముద్దుగా ఉన్నాయి.

“తప్పు నాన్నా అలా అనకూడదు.” అంటూ ఆ తల్లి తన బిడ్డని దగ్గరగా తీసుకుంది.

ఆ పిల్లాడి తల నిమురుతూ ఇలా చెప్పసాగింది. “వాడు నీ అన్న కదా ? వాడు చెప్పినట్లు వినాలి.నీకో చిన్న కథ చెప్పనా..అప్పట్లో శ్రీరాముడని ఓ గొప్పరాజు ఉండేవాడు.అతనికి ముగ్గురు తమ్ముళ్ళు.వాళ్ళలో లక్ష్మణుడంటే రాముడికి చాలా ఇష్టం.ఎందుకో తెలుసా..?”

“ఎందుకు?” ఆ పిల్లాడు అమాయకంగా అడిగాడు.

“ఎందుకంటే లక్ష్మణుడు శ్రీరాముడు చెప్పినట్లు వినేవాడు కాబట్టి.మీరిద్దరూ కూడా వాళ్ళలా మంచి పేరు తెచ్చుకోవాలి.ఈశ్వర్,దినేష్ లు మంచి అన్నదమ్ములు అనిపించుకోవాలి.సరేనా..?” అంది అమ్మ.

“సరే అమ్మా..” అన్నాడు దినేష్.

అయితే అది ఓ సంవత్సరం వరకు మాత్రమే..!

'అలా చెట్టు ఎక్కొద్దు.కిందపడతావ్..!'

' మెల్లగా వెళ్ళు.. పరిగెడితే పడిపోతావ్....!!

' టైమ్ వేస్ట్ చెయ్యొద్దు చదువుకో.......!!!' ఇలా తమ్ముడి జాగ్రత్త గురించి ఆరాటపడేవాడు ఈశ్వర్.

అయితే దినేష్ వాటిని అందరిలాగే తన స్వేచ్ఛకు అడ్డుగా భావించాడు.!

అలా తనకు ఎనిమిదేళ్ళ వయస్సులోనే ఇలా ఫిక్సయ్యాడు. 'నాకు చెప్పడానికి వాడు శ్రీరాముడు కాదు..!,వాడి మాటలు వినడానికి నేను లక్ష్మణుడిని అంతకన్నా కాదు.!! అయినా అప్పట్లో రాముడు కూడా లక్ష్మణుడ్ని టైమ్ వేస్ట్ చెయ్యొద్దు, చదువుకో అని చెప్పి ఉండడు.!!! ఇది నా లైఫ్.నాకు నచ్చినట్లే ఉంటా...”

అలా ఎవడి మాటా వినని మొండిఘటంలా తయారయ్యాడు దినేష్.!

********************************

15 సంవత్సరముల తరువాత ,

భీమిలి బీచ్ .... ,

“నాకు ఆ గాలిపటం కావాలి....” ఆ అయిదేళ్ళ పాప ఏడుస్తోంది!

హన్వితకు ఏంచేయాలో పాలుపోలేదు.బిక్కు బిక్కుమంటూ పక్కనున్న తన స్నేహితురాళ్లవైపు చూసింది.

“అంతా నీవల్లే...ఆ పాప తనకు తానుగా ఆ గాలిపటాన్ని మెల్లగా ఎగరేసుకుంటూ వెళ్తోంది.నువ్వే అనవసరంగా చిన్నూ,స్వీటీ అంటూ దాన్ని తీసుకున్నావ్.! ఇప్పుడు చూడు అది ఖచ్చితంగా సముద్రంలో పడిపోతుంది.ఎలా తెచ్చిస్తావ్?” అన్నారందరూ.

హన్విత ఆ పాపను చూసింది.ఎంతో దిగులుగా కనిపించిందా పాప.

“చిన్నూ ! నేన్నీకు కొత్త గాలిపటాన్ని కొనిస్తాగా,ఏడవకు..” అంది.

“అహా.., నాకు అదే కావాలి.నాకు నా గాలిపటమే కావాలి.” అంటూ ఆ పాప మళ్ళీ ఏడవటం స్టార్ట్ చేసింది.

హన్వితకు ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంది.

ఇంతలోఆ పాప వాళ్ళ అమ్మా నాన్నా వచ్చారు. “ఇక్కడున్నావా..?, నీకోసం ఎక్కడెక్కడ వెతికానో..గాలిపటమేది...” అడిగింది ఆ పాప వాళ్ళ అమ్మ.

ఆ పాప “ఈ అక్కే తీసుకొని అదిగో అక్కడ వదిలేసింది!” అంటూ మళ్ళీ ఏడవటం స్టార్ట్ చేసింది.

హన్విత “సారీ అండీ ఇలా జరుగుతుందనుకోలేదు.ఏదో సరదాకి తీసుకున్నాను ఇంతలో జారిపోయింది.నేనుపాపకి కొత్తది కొనిస్తాను.” అంది

“భలేదానివమ్మాయ్..ఇంత చిన్న విషయానికేంటమ్మాయ్ నువ్వు కూడా చిన్నపిల్లలా.., ఆ గాలిపటం లేకపోతేనే మంచిది,లేకపోతే బీచ్ లో గాలిపటాలెగరేయడమేంటి..? నేనే లాగి పడేద్దామనుకున్నాను.” అని“రా బుజ్జీ ఇంటికెళ్దాం!” అని తన పాపను ఎత్తుకోబోయింది ఆ తల్లి.

అయితే ఆ పాప 'నాకు గాలిపటం కావాలి' అంటూ ఆ మట్టిలో పడి దొర్లసాగింది.!

హన్వితకు చాలా బాధేసింది.అలా పక్కకు చూసింది.అప్పటినుండీ ఓ నలుగురు కుర్రాళ్ళు అక్కడున్న అమ్మాయిలకి సైట్ కొడుతున్నారు.!

అసలే పాప ఏడుస్తోందని హన్విత కంగారుపడుతుంటే ఈ కుర్రాళ్ళ చేష్టలు ఆమెకు మరింత విసుగుని కలిగించాయి.

“అలా తినేసేలా చూడకపోతే ఆ గాలిపటాన్ని తేవొచ్చుగా?” అన్నారు హన్విత పక్కనున్న స్నేహితురాళ్ళు.

“తెస్తే మాకేంటంట?!” అన్నారు ఆ కుర్రాళ్ళు చిలిపిగా.

“ఆ...ఎవడైతే ఆ గాలిపటాన్ని తెచ్చి హన్విత చేతిలో పెడతాడో వాడికి హన్విత ఐ లవ్ యూ చెబుతుంది.” అంది ఓ అమ్మాయి.

“నిజంగానా!!?!” అంటూ నలుగురు కుర్రాళ్ళూ ఒక్కసారిగా ముందుకొచ్చారు.

తన ఫ్రెండ్ చెప్పిన మాటలకు హన్విత అదిరిపడింది.!

“ఏంటే నువ్వనేది..? నేను ఐ లవ్ యూ చెప్పడమేంటి..?” అంది హన్విత కంగారుగా.

“నువ్వాగు..ఇక్కడ ఎవడికి ఆ దమ్ముందో చూద్దాం?” అందా స్నేహితురాలు.!

హన్వితకు కూడా అదెలాగూ జరగనిపని అనిపించింది.

“గాలిపటం ఎక్కడ?” అన్నారు అందరూ.

“అదిగో అలా సముద్రం వైపు వెళ్తోంది చూడండి!” అంటూ గాలిపటాన్ని చూపించింది హన్విత.

ఆ గాలిపటాన్ని చూడగానే అందరి ప్రాణాలూ పైపైనే పోయాయి.!

“చూడు పాపా..,! మేం నచ్చకపోతే డైరెక్ట్ గా నచ్చలేదని చెప్పేయ్.! ఇక్కడినుండి వెళ్ళిపోతాం.!అంతేగానీ ఇలాంటి ప్రాణంపోయే పరీక్షలు పెట్టొద్దు.దానికోసం వెళ్ళి సముద్రంలో పడితే ఎవడు రెస్పాన్సిబిలిటీ..?!” అంటూ అందరూ చల్లగా అక్కడనుండి జారుకున్నారు.!

ఇంతలో హన్విత స్నేహితురాళ్ళను తోసుకుంటూ ఓ కుర్రాడు పరిగెత్తుకుంటూ ముందుకెళ్ళాడు.!

“ ఏయ్.. కళ్ళు కనబడట్లేదా?” అరిచిందా అమ్మాయ్.అయితే ఆ కుర్రాడు అవేమీ పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు.

గాలిపటం అప్పుడే తన దిశను మార్చుకుంటోంది...!

ఆ కుర్రాడు కనీసం గాలిపటంవైపు కూడా చూడకుండా నేరుగా లైట్ హౌస్ లోకి దూసుకెళ్ళాడు.

చకచకా పైకెళ్ళి సరిగ్గా గాలిపటం లైట్ హౌస్ కి దగ్గరగా వచ్చేసరికి ఒక్క ఉదుటున ఎగిరి దూకి ఆ గాలిపటాన్ని అందుకున్నాడు.!

ఎంతో నైపుణ్యం ఉన్నవాడిలా ఎంతో చాకచక్యంతో బ్యాలెన్స్ చేసి కిందకు దూకాడు.!

ఇక అతని పని ఔట్ అనుకున్నారందరూ.

అయితే ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఒక్క దెబ్బ కూడా తగలకుండా క్షేమంగా కిందకు దూకడంతో ఆశ్చర్యపోవడం అక్కడివాళ్ళవంతైంది.!!

దినేష్ గాలిపటంతో నవ్వుతూ ముందుకొచ్చాడు.!!

హన్విత క్షణం పాటు విస్తుపోయింది.(అతని సాహసాన్ని చూసి ).!

రెండుక్షణాలపాటు సంతోషపడింది(ఆపాప ఇక ఏడవదని తెలిసి).!!

ఆ తర్వాత క్షణం అదిరిపడింది.(తను కాసిన పందెం గుర్తొచ్చి)!!!

'వామ్మో ఇప్పుడు నేను ఇతనికి ఐ లవ్ యూ చెప్పాలా?' అనుకుంటూ పక్కనున్న తన ఫ్రెండ్స్ వైపు చూసింది.అయితే వాళ్ళు ఇవేమీ పట్టించుకోవట్లేదు.నోరెళ్ళబెట్టి అతడినే చూస్తున్నారు.!

అవును మరి.! అంతెత్తునుండి గాలిపటాన్ని పట్టుకొని కిందకు దూకి ఏమాత్రం చలించకుండా వస్తున్న దినేష్ ను చూసి వారికి నోట మాట రాలేదు.!

హన్విత కు కోపమొచ్చింది. “హలో ఇక నోళ్ళు మూస్తారా..?” అంది.ఫ్రెండ్సంతా ఆమె వైపు కొరకొరా చూశారు.

దినేష్ నవ్వుతూ ముందుకొచ్చాడు.! ఇక్కడ హన్విత కు టెన్షన్ ఎక్కువైపోతోంది.!!

అయితే దినేష్ హన్విత దగ్గరికి రాకుండా నేరుగా ఆ పాపదగ్గరికెళ్ళి “ఇదిగో పాపా నీ గాలిపటం” అంటూ ఆ పాపకు గాలిపటాన్ని అందించాడు.

ఆ గాలిపటాన్ని చూడగానే ఆ పాప సంతోషంగా లేచి నిలబడింది.

“ఏంటయ్యా బాబూ ఒక్కసారిగా మమ్మల్ని భయపెట్టేశావ్..? అంతెత్తునుండి దూకాల్సిన అవసరమేముంది.నీకేమైనా అయ్యుంటే..?” అంది ఆ పాప వాళ్ళ అమ్మ.

దినేష్ నవ్వుతూ ఆ పాప వైపు చూశాడు.

“అంకుల్..అంతపైనుండి దూకినా మీకు దెబ్బలు తగల్లేదా...? మీరు సూపర్ మ్యానా..?!” అమాయకంగా అడిగింది.

దినేష్ ఆ పాపను దగ్గరగా తీసుకుని “నేనేమీ సూపర్ మ్యాన్ ని కాదు.నాకు ఇది అలవాటే.కానీ నువ్వు మాత్రం ఇలాంటివి చేయకూడదు.సరేనా?” అంటూ ముందుకు కదలబోయి ఏదో గుర్తొచ్చినవాడల్లా ఆగాడు.!

అతనలా నిలబడగానే హన్వితకు గుండాగినంతపనైంది.

మెల్లగా వెనక్కు తిరిగి హన్విత దగ్గరకొచ్చాడు. “మీరెందుకో కంగారు పడుతున్నట్లున్నారు.” అన్నాడు.

'హమ్మయ్య.! ఇతను మన పందెం గురించి వినలేదు..' అనుకొని ఊపిరి పీల్చుకుని “అదేం లేదు.! పాప ఏడుస్తుంటేనూ..” అంది హన్విత.

“ఓ.కే...గుడ్ బై..ఇలా అంటున్నానని ఏం అనుకోకండి...మీరు బావున్నారు!” అనేసి రోడ్ మీదకెళ్ళాడు.హన్విత అతడివైపు సూటిగా చూసింది.

అతడు రోడ్ మీదకెళ్ళి బైక్ స్టార్ట్ చేసి తిరిగి హన్వితవైపు చూశాడు.ఆమె వెంటనే తన చూపులను మరల్చుకుంది.!

“మీరు నిజంగా చాలా బావున్నారు..” అనేసి కాసేపాగి “మీ ఫ్రెండ్స్ కన్నా..” అనేసి వేగంగా బైక్ లో దూసుకుపోయాడు.

అతడేం చెప్పాడో విని అర్థం చేసుకోవడానికి హన్విత ఫ్రెండ్స్ కి చాలా సేపైంది...!

అతను చెప్పింది అర్థమవ్వగానే హన్విత ఫ్రెండ్స్ మొహాలు పాలిపోయాయి.!!

హన్వితకు నవ్వొచ్చింది. “నవ్వవే నవ్వు.అతడ్ని మోసం చేసిందేగాక ఇప్పుడు నవ్వుతున్నావా..?” అన్నారు.

హన్విత కోపంగా చూస్తూ “నేనేం మోసం చేయలేదు.గాలిపటం నాకు తెచ్చిస్తే ఐ లవ్ యూ చెబుతానన్నాను.కానీ అతను ఆ పాపకి తెచ్చిచ్చాడు.కాబట్టి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు..!” అని అక్కడి నుండి మెల్లగా జారుకుంది.

********************************

మరుసటిరోజు ...

“ అరే...దినేష్ వచ్చాడు.” అంటూ స్నేహితులందరూ దినేష్ ను పలకరించారు

“ఏంట్రోయ్..,! చాలా రోజులైంది.ఈసారెక్కడికెళ్ళావ్..?” అడిగాడు హరీష్.హరీష్ దినేష్ కు చాలా క్లోజ్ ఫ్రెండ్.

“కేరళ...” అన్నాడు దినేష్.

“అయినా నువ్వు ఇలాంటి సాహసయాత్రలుచేయడం మానుకుంటే బెటర్.” అన్నాడు హరీష్.మిగతా ఫ్రెండ్స్ కూడా “అవున్రా..! హరీష్ చెప్పింది కరెక్ట్” అన్నారు.

దినేష్ నవ్వుతూ “ఏం..ఇప్పుడేమైంది..?” అడిగాడు.

“రిస్క్ ఎందుకురా..?” అన్నాడు హరీష్.

“రిస్క్ ఇప్పుడు కాకుంటే ఎప్పుడు చేస్తాం...? అయినా నేను ఈ అడ్వెంచర్స్ మానుకోవాలంటే ఇంతకన్నా కిక్ ఉండే విషయం ఏదైనా దొరకాలి.” అన్నాడు,

“నువ్వు ఎవడి మాట ఎప్పుడు విన్నావు గనక!” అంటూ సైలెంట్ అయ్యాడు హరీష్.

ఇంతలో ఓ పెద్దాయన అటుగా వెళ్తూ “బాబూ...నిన్నెక్కడో చూసినట్లుందే..” అన్నాడు.

“ఎక్కడో కాదు.ఇక్కడే చూశారు.ఏంటో చెప్పండి?” అన్నాడు దినేష్. !

ఆ మాటలకు ఆ పెద్దాయన అదిరిపడి “ఆ..! ఇప్పుడు గుర్తొచ్చింది.నువ్వు నీలకంఠ గారి అబ్బాయివి కదూ.” అన్నాడు.అవునన్నట్లు తలూపాడు దినేష్“ అంటే ఈశ్వర్ తమ్ముడివన్నమాట..” అన్నాడాయన.

ఆ మాటలకు దినేష్ భృకుటి ముడిపడింది. “కాదు..వాడే నా అన్న.” అన్నాడు.!

ఆ మాటలకు ఆ పెద్దాయన దిమ్మదిరిగింది.! మరేం మాట్లాడకుండా అక్కడనుండి వెళ్ళిపోయాడు!!

దీన్నంతా గమనిస్తున్న హరీష్ దినేష్ ని అడిగాడు. “ఎందుకురా మీ అన్న అంటే నీకు అంతకోపం? అతనేంచేశాడని..?”

దినేష్ హరీష్ వైపు సూటిగా చూస్తూ. “కోపం ఏమీ లేదు.కాకపోతే వాడి మాటలు వినాలంటే మాత్రం ఒప్పుకోను ! వాడికి నచ్చినట్లు బ్రతకమంటే అస్సలు ఊరుకోను !! ఇది నా జీవితం.నా ఇష్టం.” అన్నాడు.

హరీష్ దినేష్ మాటలకు బదులిస్తూ “నిన్నెవరు పెళ్ళి చేసుకుంటారో గానీ ఆ వచ్చే అమ్మాయికి మాత్రం నీ గురించి పూర్తిగా తెలిస్తే అస్సలు ఒక్క క్షణం కూడా ఉండదు!” అన్నాడు సరదాగా..

“అయినా అప్పుడే పెళ్ళిగోలేంటి..? ఈ రాజాకి తగిన రాణి ఇంకా కనపడలే...” అంటూ ఒక్క క్షణం ఆగాడు......................!

ఎదురుగా ఒక అందమైన అమ్మాయి స్కూటీ మీదుగా వస్తోంది.

“కనబడలేదనుకో..అయినా కనబడితే మాత్రం నచ్చేయాలని రూలేమీ లేదు కదా...అయినా నచ్చినంత మాత్రాన మనముందుకు రాదు కదా....వచ్చినంత మాత్రాన ఏం చేయలేము కదా.....” దినేష్ చెప్పుకుపోతున్నాడు.!

“వామ్మో..! ఈ అమ్మాయెవర్రా బాబూ.. మనకే మెంటలెక్కించింది!!” అనుకున్నాడు.

“రేయ్.. ఏంట్రా? నీలో నువ్వే ఏదో చెప్పుకుపోతున్నావ్..?” ఒక్కసారిగా ఫ్రెండ్స్ కదిలించేసరికి ఈ లోకంలోకి వచ్చాడు.

“ఏంలేదులే.” అనేసి.. 'ఈ అమ్మాయిని ఎక్కడో చూసానే..' అనుకున్నాడు.

'నిన్న బీచ్ లో కనబడింది ఈ అమ్మాయే కదా.అయినా నిన్న ఏమీ అనిపించలేదు.ఈ రోజెందుకు ఇలా మతి పోగొడుతోంది' అనుకొని ఆ అమ్మాయినే చూస్తూ కూర్చున్నాడు.!

అయితే అది రెండు క్షణాలు మాత్రమే....!

ఆ అమ్మాయి వేగంగా స్కూటీ మీదుగా వెళ్ళిపోయింది.

“మేరా జాన్స్..” అన్నాడు దినేష్ గట్టిగా..! అప్పుడప్పుడూ ఫ్రెండ్స్ ను అలా పిలవడం దినేష్ కు అలవాటే..!

“ఏంట్రా..?” అన్నారందరూ.

“మీకు లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటే తెలుసు కదా?” అడిగాడు.

“ఆ తెలుసు..”.

“లవ్ అట్ సెకండ్ సైట్ అంటే తెలుసా?” అన్నాడు.! అందరూ విచిత్రంగా చూశారు.

ఇంతలో దినేష్ మొబైల్ రింగయ్యింది.నాన్న దగ్గరనుండి ఫోన్...

“ నాన్న ఫోన్ చేశాడు తర్వాత కలుస్తా..” అనేసి వేగంగా బైక్ పై దూసుకుపోయాడు దినేష్.

********************************

ఇంట్లోకి వెళ్ళగానే అమ్మ,నాన్న, ఈశ్వర్ లు దినేష్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.

“నాన్నా...ఏంటి పిలిచావ్..?” అన్నాడు దినేష్.

“నీతో కాస్త మాట్లాడాలి..” అన్నాడు నీలకంఠ.

దినేష్ వచ్చి దగ్గరగా కూర్చున్నాడు.

“మన కంపెనీ కి మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్ ఖాళీగా ఉంది.నేను తలుచుకుంటే అందులోకి కొత్తవాళ్ళను అప్పాయింట్ చేయవచ్చు.కానీ ఆపోస్ట్ నీ కోసమే ఉంచాను.” అన్నాడు నీలకంఠ.

నాన్న మాటలకు దినేష్ ఆశ్చర్యపోయాడు.!

“ నాన్నా..ఇప్పుడే ఎందుకు..? నాకు కాస్త టైమ్ కావాలని చెప్పాను కదా..” అన్నాడు దినేష్.

దానికి నీలకంఠ ఈ విధంగా సమాధానమిచ్చాడు. “నిన్ను ఇప్పుడే పూర్తి బాధ్యతలు తీసుకోమనట్లేదు..జస్ట్ ఓ వారం పాటు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండు.నేను కంపెనీ వర్క్ మీద న్యూయార్క్ వెళ్తున్నాను.రాగానే నేను మళ్ళీ కొత్తవాళ్ళను తీసుకుంటాను..” అన్నాడు నీలకంఠ.

దినేష్ కాసేపు ఆలోచించాడు.

“వాడికి ఇష్టం లేకపోతే బలవంతపెట్టొద్దు నాన్నా..” అన్నాడు ఈశ్వర్.

అన్నవైపు ఓ రకంగా చూస్తూ... “నేను రెడీ..!” అన్నాడు.అలా అనేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు.

నీలకంఠ కొడుకు ప్రవర్తనకి నవ్వుకున్నాడు...

*******************************

ఓరెండు రోజులపాటు 'నీలకంఠ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్' మేనేజింగ్ డైరెక్టర్ గా ఏ ఇబ్బందీ లేకుండా బాధ్యతలు నిర్వర్తించాడు.

అయితే మూడో రోజుకి దినేష్ కు విసుగొచ్చింది.!

నేరుగా అన్న క్యాబిన్ లోకి వెళ్ళాడు.ఎప్పుడూ లేనిది తమ్ముడు తన క్యాబిన్ లోకి రావడంతో ఈశ్వర్ ఆశ్చర్యపోయాడు.!

“తమ్ముడూ..నువ్వేంటి నా క్యాబిన్ లోకి...?, సరే..వచ్చి కూర్చో..” అన్నాడు.

దినేష్ వచ్చి కూర్చొని “నాకు బోర్ కొడుతోంది.నేను ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్తాను.ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్.” అన్నాడు.

ఈశ్వర్ చాలా సహజంగా “సరే నీ ఇష్టం..” అన్నాడు.

దినేష్ అలా ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్ళాడు.

********************************

“ఏంట్రోయ్.., ఎమ్.డి గా ఛార్జ్ తీసుకున్నావంటా..? కంగ్రాట్స్!” అన్నారందరూ.

“దాందేముందిలే..ఈ రోజు కాకపోయినా రేపైనా అన్నతో పాటూ నేనూ ఏదో ఒక పోస్ట్ లో ఛార్జ్ తీసుకోవలసిందేగా..?” అన్నాడు దినేష్.

“ఎలా ఉంది మరి కొత్త లైఫ్?” అడిగాడు హరీష్.

“మరీ కొత్తగా ఏంలేదు.., మా అన్న ఉన్నాడుగా ఇక అక్కడ నా అవసరం ఎక్కువగా ఉండదు.అన్నీ వాడే చూసుకుంటాడు.” అని చెప్పి ఎదురుగా చూశాడు.

సరిగ్గా మూడురోజుల క్రిందటి సన్నివేశం మళ్ళీ రిపీట్ అయ్యింది.!

ఆ అమ్మాయి మళ్ళీ స్కూటీ మీద మెల్లగా వస్తోంది.!!

“అయినా అక్కడ ఆఫీస్ లో ఎంతసేపని ఉంటాం..? ఇక్కడైతే ఎప్పుడూ హ్యాపీగా ఉండొచ్చు.రోజూ చూసే మొహాలైనా కొత్తగా ఉంటాయి.ఎంతైనా ఇక్కడ ఉన్నవాళ్ళని వదిలేసి ఆఫీస్ లో ఉంటే చాలా బాగోదు..!” ఆ అమ్మాయినే చూస్తూ చెప్పుకుపోతున్నాడు దినేష్.

హరీష్ కాస్త ఎమోషనల్ అయ్యాడు.!

“రేయ్ దినేష్..! ఇన్నాళ్ళూ నువ్వు మొండిఘటానివే అనుకున్నాము.కానీ మేమంటే ఇంత ఇష్టమా..?! చాలురా...ఈ జన్మకి ఇది చాలు.మాకోసం ఆఫీస్ నే వదిలేసి వచ్చేశావంటే నువ్వేరా అసలైన దోస్త్..!!"అన్నాడు హరీష్.

ఆ మాటలకు దినేష్ అవాక్కయ్యి “ఓహో వీడికి ఇలా అర్థమైందా..?!” అనుకున్నాడు.

ఆరోజునుండి తర్వాత నాలుగురోజులపాటు సేమ్ సీన్స్ రిపీట్ అయ్యాయి.

ఆ అమ్మాయి స్కూటీ మీద మెరుపుతీగలావచ్చి వెళ్ళిపోతోంది.

దినేష్ మాత్రం ఆ అమ్మాయిని ఎలాగైనా మాట్లాడించాలని అనుకుంటున్నాడు.!

********************************

తర్వాతిరోజు ...

ఎప్పట్లానే ఆఫీసుకు వెళ్ళాడు దినేష్.అన్న క్యాబిన్ లోకి వెళ్ళబోయి లోపల చాలా మంది ఉండటంతో ప్రయత్నం విరమించుకున్నాడు.

ఇంతలో “దినేష్..” అన్న పిలుపు వినబడటంతో లోపలికి వెళ్ళాడు.లోపల 'నీలకంఠ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్' బోర్డ్ మెంబర్స్ అందరూ ఉన్నారు.

“ఏంటి స్పెషల్..? అందరూ ఇక్కడే చేరారు.” అన్నాడు దినేష్.

“చిన్న సమస్య వచ్చి పడింది.సమయానికి నాన్న కూడా ఇక్కడ లేరు.” అన్నాడు ఈశ్వర్.

“ఏంటి సమస్య..?” అడిగాడు

“మన కంపెనీస్ లో ఫార్మా రంగంకూడా ఒకటి కదా.ఇప్పుడిప్పుడే మనం మెడిసిన్స్ తయారు చేయడంలో కూడా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాం.ముఖ్యంగా మనకి ఈ ఫీల్డ్ లో పరమేశ్వరం గారితో పోటీ ఉంది.” అన్నాడు ఈశ్వర్.

“ఆయన డాడీ ఫ్రెండ్ కదా..అప్పుడప్పుడూ లంచ్ కి వస్తుంటాడు..” అన్నాడు దినేష్.

“ఆ..ఆయనే..వాళ్ళ కంపెనీతో మనకి ఆరోగ్యకరమైన పోటీనే ఉందిగానీ కొత్తగా ఓ మెడిసిన్ విషయంలో కాస్త చిక్కొచ్చిపడింది.” అన్నాడు ఈశ్వర్.

“ఏమైంది..?” సీరియస్ గా అడిగాడు దినేష్.

“ ఇప్పుడు ఆ కంపెనీ హెడ్ ఎవరో తెలుసా..? పరమేశ్వరంగారి అబ్బాయి యుగంధర్.పరమేశ్వరంగారికి కొడుకంటే ప్రాణం.అందుకే ఇంత చిన్న వయస్సులోనే యుగంధర్ ని కంపెనీ హెడ్ గా నియమించేశాడు.అయితే అతను వాళ్ల నాన్నగారంత మంచివాడు కాదు.” అన్నాడు ఈశ్వర్.

“అంటే...?” తీవ్రంగా ఆలోచిస్తూ అడిగాడు దినేష్.

“మన కంపెనీ రీసెర్చ్ సెంటర్ నుండి ముఖ్యమైన పేపర్స్ ని దొంగలించాడు.మన వర్కర్స్ ని డబ్బుతో కొనేశాడు.ఈ విషయం పరమేశ్వరంగారికి తెలియదు.నాన్నగారు ఎల్లుండి ఆఫీసుకు వస్తారు.అప్పట్లోగా ఎలాగైనా ఈ సమస్యని లేకుండా చేయాలి.” అన్నాడు ఈశ్వర్.దినేష్ అన్న వైపు చిత్రంగా చూశాడు.!

అన్న ఎన్నో విషయాలను చాలా సింపుల్ గా సాల్వ్ చేశాడు..ఇలాంటి వాళ్ళకి అవసరమైతే చేత్తో కూడా సమాధానం చెప్పగల సమర్థుడు.! కానీ ఎందుకు ఆలోచిస్తున్నాడో దినేష్ కు అర్థం కాలేదు.

దినేష్ భావాలను అర్థం చేసుకున్న ఈశ్వర్ ఇలా అన్నాడు. “నీ అనుమానం నాకు అర్థమైంది.మనం ఏ మాత్రం తేడా చేసినా రేపు నాన్నగారి పరువుకి నష్టం వాటిల్లుతుంది.” అన్నాడు ఈశ్వర్.

ఇంతలో బోర్డ్ మెంబర్స్ నుండి ఒకతను ఇలా అన్నాడు. “మేము ఎన్నోసార్లు పొలైట్ గా చెప్పి చూశాం సర్.అయినా అతను వినలేదు..”

“ఓ సారి నేను చెప్పి చూస్తాలే..” అన్నాడు దినేష్

“వద్దు...నీకసలే ఆవేశం ఎక్కువ.” అన్నాడు ఈశ్వర్

“నేను ఇప్పుడే వెళ్తున్నాను.!” అనేసి బయలుదేరాడు దినేష్!!

“సర్..వెంట మనుషులని పంపించండి సర్..ఒక్కరే వెళ్తున్నారు..” అన్నారు బోర్డ్ మెంబర్స్ అందరూ

ఈశ్వర్ ఓ చిరునవ్వు నవ్వి “వాడు నా మాట అస్సలు వినడు.అయినా మాట్లాడతానన్నాడుగా..చూద్దాం..ఏం మాట్లాడి వస్తాడో.” అన్నాడు.

********************************

' యుగంధర్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ .'

నేరుగా కంపెనీ హెడ్ ఆఫీస్ దగ్గరకు వెళ్ళి కార్ ఆపాడు దినేష్.

నేరుగా ఆఫీసులోకి దూసుకెళ్ళాడు.వెళ్తూనే రిసెప్షన్ దగ్గర తన ఐడెంటిటీ కార్డ్ ని పడేసి చక చకా ముందుకు కదిలాడు.!

“హలో ! ..ఎవరు..మీరు..అప్పాయింట్మెంట్ లేకుండా...,” అనబోయిన ఆమె ఆ ఐడెంటిటీ కార్డ్ లో దినేష్ వివరాలు చూసి సైలెంట్ అయ్యింది.

నేరుగా హెడ్ చాంబర్ లోకి దూసుకెళ్ళి “హెల్లో మిస్టర్ యుగంధర్..” అంటూ కూర్చున్నాడు దినేష్.

ఊహించని ఈ పరిణామానికి యుగంధర్ అవాక్కయ్యాడు.!

“ఏయ్..ఎవర్నువ్వు..? నిన్నెవరు లోపలికి రానిచ్చింది..?” కోపంగా అడిగాడు యుగంధర్.

“కూల్..కూల్..నేను నీలకంఠ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ M.D. ని.నా పేరు దినేష్.” అన్నాడు.

“ఓహో..నీలకంఠ గారి రెండో అబ్బాయివా..? నిన్నటిదాకా మీ అన్న ఎంతో మందిని పంపించాడు.ఇప్పుడు నువ్వొచ్చావా..?” ఎగతాళిగా అన్నాడు యుగంధర్.

“ఎవడు ఏమన్నాడో నాకనవసరం.నువ్వు చేసింది తప్పు.మర్యాదగా ఆ పేపర్స్ తో పాటు మా మనుషులని మాకు అప్పగించు.” అన్నాడు.

“అప్పగించకపోతే....” అన్నాడు యుగంధర్.

దినేష్ ఓ నవ్వు నవ్వి “నేను మా అన్నంత మంచివాడ్నైతే కాను.!” అన్నాడు.

“ఏంటి బెదిరిస్తున్నావా..?”

“ఏ..? నీకేమైనా చెవుడా..?! ఇంత గట్టిగా వార్నింగ్ ఇస్తుంటే మళ్లీ కన్ఫర్మేషన్ కావాలా?” అన్నాడు దినేష్.

“అంత మగాడివా? అయితే పేపర్స్ తో పాటు మనుషులు కూడా వైజాగ్ పోర్ట్ దగ్గరున్నారు. దమ్ముంటే తీస్కో...” అన్నాడు యుగంధర్.

“థాంక్స్ జాన్.అరగంటలో ఫోన్ చేస్తా” అనేసి చకచకా బయటకు నడిచాడు దినేష్.

దినేష్ బయటకు వెళ్ళగానే యుగంధర్ ఫోన్ అందుకున్నాడు.పోర్ట్ దగ్గరున్న తన మనుషులకు ఫోన్ చేసి “రేయ్..! ఆ నీలకంఠ కంపెనీ ఎం.డి అక్కడికొస్తున్నాడు.మీరేం చేస్తారో నాకు తెలీదు.వాడి బాడీ కూడా దొరక్కూడదు.!” అన్నాడు.

దినేష్ కిందకు వచ్చి “ఐడీ ప్లీజ్...” అని అక్కడున్న రిసెప్షనిస్టు దగ్గర నుండి తన కార్డ్ తీసుకొనికార్ స్టార్ట్ చేశాడు.

నేరుగా తన ఆఫీస్ కు వెళ్ళి చకచకా డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు వచ్చాడు.

అక్కడున్న డ్రైవర్ “సర్ కార్ తియ్యమంటారా?” అని అడిగాడు.

“వద్దు.ఇది అనఫిషియల్ వర్క్.బైక్ చాలు..ఆ బైక్ తియ్యి.” అని చెప్పి బైక్ స్టార్ట్ చేశాడు.

ఏదో గుర్తొచ్చినవాడల్లా ఆగి “అవునూ..నీకేమైనా ఇంపార్టెంట్ పని ఉందా?” అని అడిగాడు .

“లేదు సర్..” చెప్పాడా డ్రైవర్.

“బోర్ కొడుతోందా..?”.

“అవును సర్..

“అలా బయట తిరిగొద్దాం రా..!" అని చెప్పి 'కార్ స్టార్ట్ చెయ్' అన్నాడు.

“సర్ మరి బైక్...”

“నేను బైక్ లో వస్తా..నువ్వు కార్ లో రా..సరేనా..” అనేసి డ్రైవర్ తో పాటు పోర్ట్ దగ్గరకు బయలుదేరాడు దినేష్.!!

********************************

పోర్ట్ దగ్గరకెళ్లగానే ఇరవైమంది దాకా రౌడీలు.., తన కంపెనీలో పనిచేసి అమ్ముడుపోయిన మనుషులు ముగ్గురు కనబడ్డారు.

“సర్..మీరు మన పేపర్స్ తీసుకుని కారెక్కితే వెళ్ళిపోదాం..”ఆ ముగ్గురితో అన్నాడు దినేష్.

అయితే ఆ మనుషులు పక్కన ఇరవైమంది ఉన్నారన్న ధైర్యంతో ముందడుగు వేయలేదు.

క్షణంకూడా ఆలస్యం చేయలేదు దినేష్.!

ఒక్క సెకను కూడా ఆ రౌడీలకు ఆలోచించుకునే టైమ్ ఇవ్వలేదు.

పక్కనున్న రాడ్ తీసుకుని వేగంగా ఆ రౌడీల దగ్గరకెళ్ళి నలుగురికి నాలుగు దెబ్బల రుచి చూపించాడు.!

ఇక ఏమాత్రం టైమ్ వేస్ట్ చెయ్యకుండా మిగిలిన వారిని కూడా అయిదు నిమిషాలపాటు చితకబాదాడు.

దినేష్ అంత కోపంగా కొట్టడాన్ని చూసి ఆ డ్రైవర్ వణికిపోయాడు.!

ఇక తన కంపెనీ మనుషులు మారుమాట్లాడకుండా నేరుగా వెళ్ళి కార్ లో కూర్చున్నారు.!

దినేష్ డ్రైవర్ దగ్గరికెళ్ళి “ఈ రోజు ఇక నీకు బోర్ కొట్టదులే.. ఈ థ్రిల్ నుంచి తేరుకోవడానికి వారంరోజులైనా పట్టుద్ది..” అన్నాడు.

గడచిన అయిదు నిమిషాలు ఆ రౌడీలకు కలలా ఉంది..!!!

********************************

ఆ ముగ్గురినీ ఆఫీసుకు తీసుకెళ్ళి అన్న ముందు నిలబెట్టాడు దినేష్.!

అక్కడున్న బోర్డ్ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా పైకి లేచారు.!!

“ఇక వీళ్ళనేం చేస్తారో మీ ఇష్టం.” అనేసి బయటకు వెళ్ళాడు.

మొబైల్ తీసి యుగంధర్ కు డయల్ చేసాడు.!

అక్కడ యుగంధర్ జరిగింది తెలుసుకొని కోపంతో రగిలిపోతున్నాడు.!

దినేష్ యుగంధర్ తో “ఇక దీనిగురించి మాట్లాడి టైమ్ వేస్ట్.ఒకే ఒక మాట .. నువ్వు మాత్రం చాలా లక్కీ...! హావ్ ఎ నైస్ డే.!!” అనేసి ఫోన్ కట్ చేశాడు.

ఈ మాటలన్నీ వింటున్న డ్రైవర్ “సర్..నాకో చిన్న డౌట్..” అన్నాడు.

“ఏంటి..?”

“ మీరు ఆ రౌడీలని మెల్లగా చితగ్గొట్టి ఉండొచ్చు కదా.మరీ ఇంత వేగంగానా..? ఇంత టెన్షన్ ఎందుకు..? ఇంత రిస్క్ ఎందుకు..?”

దినేష్ ఆ మాటలకు చిరునవ్వుతో “నా వయసెంతో తెలుసా?” అని అడిగాడు

“ఓ ఇరవై రెండు..అలా ఉండొచ్చేమో..” అన్నాడా డ్రైవర్. 'అయినా ఇపుడు అసందర్భంగా ఈప్రశ్నెందుకడిగాడు?' అనుకున్నాడు మనసులో

“ ఇరవై నాలుగు.ఇక మహా అయితే ఓ నలభయ్యేళ్ళు.., మరీ అదృష్టం ఉంటే యాభైయేళ్ళు బ్రతుకుతానేమో.ఇంతచిన్న లైఫ్ లో ఎవడో గొట్టం గాడి కోసం నా టైమ్ వేస్ట్ చేసుకోవాలా.?! అందుకే చక చకా ముగించేశా.!! అది టెన్షన్ కాదు.అదో రకమైన కిక్.ఇక రిస్క్ సంగతా..ఇంతకంటే రిస్కులెన్నో చేశాం ఇదో పెద్ద లెక్కా..?” అన్నాడు దినేష్.

డ్రైవర్ దినేష్ వైపు ఆశ్చర్యంగా చూశాడు...

రెండు రోజుల తర్వాత నీలకంఠ వచ్చాడు.దినేష్ బాధ్యతలనుండి తప్పుకున్నాడు.! జరిగిన విషయం గురించి నాన్నకు ఏమీ చెప్పలేదు.!!

********************************

మరుసటిరోజు ...

ఫ్రెండ్స్ తో ఉన్నాడు దినేష్.

“బోర్ కొడుతోంది రా.” అన్నాడు.

దానికి హరీష్ “ఎందుకు కొట్టదు..? తమరు అడ్వెంచర్ చేసి చాలా రోజులైందిగా..?” అన్నాడు వెటకారంగా

“అవును..అడ్వెంచర్ అంటే గుర్తొచ్చింది.కొడైకెనాల్ కి వెళ్ళాలనుకున్నా..! సరైన టైమ్ లో గుర్తు చేశావ్..” అంటూ పైకి లేవబోయాడు దినేష్...!దాంతో హరీష్ తలపట్టుక్కూర్చున్నాడు.

“వీడికి అనవసరంగా గుర్తు చేశాను.” అనుకున్నాడు మనసులో.

“రేయ్..ఇప్పుడే కదరా అనుకున్నావ్? అప్పుడే బయలుదేరితే ఎలా?” అన్నారు మిగతా ఫ్రెండ్స్

“మరి ఇదేమైనా పెళ్ళా.., ముహూర్తాలు చూసుకోవడానికి?” అన్నాడు.! అలా అనేసి ఇంటికెళ్ళాడు.

ఇంట్లో అమ్మ మాత్రమే ఉంది. “అమ్మా..కొడైకెనాల్ కి వెళ్దామనుకుంటున్నాను.” అన్నాడు.

పార్వతమ్మ పెద్దగా షాకవ్వలేదు.ఆమెకిది అలవాటే...! “మళ్ళీ ఎప్పుడొస్తావ్..?” అంది.

“రెండు రోజుల్లో...నాన్నకి చెప్పేయ్..” అనేసి రెడీ అవ్వసాగాడు దినేష్.

గంట తర్వాత ...

విశాఖపట్నం రైల్వే స్టేషన్ ....

ట్రైన్ కదలడానికి సిద్ధంగా ఉంది .....

ట్రైన్ లో ఎక్కి కూర్చోగానే ఎదురుగా హన్విత కనబడింది.దాంతో దినేష్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు.

ఇంతలో హన్విత కూడా ఎదురుగా ఉన్న దినేష్ ను చూసి ఆశ్చర్యపోయింది.

'వామ్మో..! ఆరోజు బీచ్ లో కనిపించిన అతను ఇక్కడికి కూడా వచ్చేశాడేంటి?' అనుకుంది.

కొద్దిసేపు ఇద్దరిమధ్యా నిశ్శబ్దం రాజ్యమేలింది.ముందుగా దినేష్ పలకరించాడు.

“ఆరోజు బీచ్ లో ఉన్న అమ్మాయి మీరే కదా?” అన్నాడు.హన్విత అవునన్నట్లు తలూపింది.

“హాయ్.. అయామ్ దినేష్..” అంటూ చెయ్యందించాడు. “హన్విత..” అంటూ ఆమె సైలెంట్ గా ఉండిపోయింది.

“ఎక్కడిదాకా వెళ్తున్నారు?” అడిగాడు.

“కొడైకెనాల్ కి..” ఆమె చెప్పింది.

“అరే..నేను కూడా అక్కడికే..” అన్నాడు.

“మీ ఫ్రెండ్సెవరూ కనిపించట్లేదు..?” అన్నాడు.

“వాళ్ళు ట్రైన్ మిస్సయ్యారు.తర్వాత స్టేషన్ లో కలుసుకుంటామన్నారు.”

ఆమె ఇబ్బందిగా ఫీల్ అవుతోందని ఆమె మొహాన్ని చూస్తూనే అర్థమైంది దినేష్ కి.అందుకే ఆమె ను ఎక్కువగా మాట్లాడించలేదు.

ట్రైన్ తర్వాత స్టేషన్ లో ఆగింది.

ఇంతలో హన్విత ఫ్రెండ్సందరూ వచ్చి ట్రైన్ లో కూర్చున్నారు.వాళ్ళందరూ ట్రైన్ లో దినేష్ ను చూడగానే ఖంగుతిన్నారు.!!

“మీరేంటి ఇక్కడ?” అన్నారు సీరియస్ గా.

“మరి మీకు ప్రొటెక్షన్ ఇవ్వద్దా..?” అన్నాడు దినేష్ కొంటెగా.

“మాకేం అక్కర్లేదు.. మేం కొడైకెనాల్ కి వెళ్తున్నాం.అక్కడ ఉన్న ఎత్తైన గుడి దగ్గరికి.కాబట్టి మాకు దేవుడి సప్పోర్ట్ ఉంటుంది!” అన్నారు. “ఎక్కడికెళ్తున్నారూ..?” మరోసారి రెట్టించి అడిగాడు దినేష్.

“కొండపైకి..” అనేసి “మీరెక్కడికి..?” అడిగారు.

“అక్కడినుండి దూకుదామని వెళ్తున్నాను!” అన్నాడు.

ఇప్పుడు ఒక్కసారిగా అందరూ షాకయ్యారు.., హన్వితతో సహా... !

వారి ఆశ్చర్యాన్ని అర్థం చేసుకున్న దినేష్ చాలా మామూలుగా చెప్పాడు “ ఇలాంటి అడ్వెంచర్స్ అంటే నాకిష్టం.ఆరోజు అలా పైనుండి దూకడం కూడా పెద్ద విషయమేమీ కాదు.ఎన్నో సార్లు దూకి అలవాటే కాబట్టి సింపుల్ గా దూకేశా..” అన్నాడు దినేష్.

అందరూ దినేష్ చెబుతుంటే చిత్రంగా చూస్తూ కూర్చున్నారు.

కొడైకెనాల్ లో చలి విపరీతంగా ఉంది ...

ముందుగా హన్విత,ఆమె స్నేహితురాళ్ళ అభ్యర్థన మేరకు గుడికి వెళ్ళాడు దినేష్.ఓ రెండు గంటలు అక్కడ గడిపి ఆ తర్వాత తన పని మీద దృష్టి పెట్టాడు.

తనలాగే చాలా మంది బంగీ జంప్ కోసం రెడీగా ఉన్నారు.ఎందుకో కొండ పైనునుండి కిందకు చూడగానే హన్విత,ఆమె స్నేహితురాళ్ళకి భయం వేసింది.

“రిస్క్ తీసుకోవడం ఎందుకు దినేష్..? వెళ్ళిపోదాం పదా..” అన్నారు.

“రిస్క్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెయ్యగలం..? ఏం చెయ్యలన్నా ఇప్పుడే చెయ్యాలి..” అంటూ తన సూట్ మొత్తం సరి చూసుకున్నాడు.

హన్విత టెన్షన్ టెన్షన్ గా చూస్తోంది.

ఒక్కసారిగా కిందకు దూకాడు దినేష్.!

ఏమాత్రం భయం లేకుండా అతనలా దూకడాన్ని చూసి అందరికీ ఆశ్చర్యం వేసింది.కొద్ది దూరం వెళ్ళగానే ప్యారాచూట్ ఓపెన్ చేశాడు దినేష్.

కానీ చిత్రంగా అది ఓపెన్ కాలేదు.!! పైనున్న హన్విత, ఆమె స్నేహితురాళ్ళకు జరుగుతోంది అర్థమవుతోంది.

దినేష్ కంట్రోల్ తప్పుతున్నాడు.ప్యారాచూట్ ఎంతకీ ఓపెన్ కావట్లేదు.!

చాలా సేపటి తర్వాత ప్యారాచూట్ ఓపెన్ అయ్యింది.అందరూ 'హమ్మయ్య..!' అని ఊపిరి పీల్చుకున్నారు.

“మొత్తానికి సాధించాడు..” అని పక్కకి చూసిన వాళ్ళకి హన్విత కనబడలేదు.స్నేహితురాళ్ళకు మధ్యగా కింద పడిపోయి కనిపించింది.!

ఆమెకు స్పృహ తప్పి అప్పటికే నిమిషమైంది.!!

********************************

హన్విత కళ్ళు తెరచి చూసేటప్పటికి హాస్పిటల్ లో ఉంది.

ఎదురుగా దినేష్ ఉన్నాడు.అది కాదు హన్విత గమనిస్తోంది..., దినేష్ నవ్వుతున్నాడు.!

“నాకు తెలియక అడుగుతాను..? పై నుంచి దూకిన నాకు కళ్ళు తిరగాలి గానీ నీకు కళ్ళు తిరగడమేంటి..”? అన్నాడు.హన్విత సైలెంట్ గా ఉండిపోయింది.

“తను చిన్నప్పట్నించీ అంతే.. కొద్దిగా సెన్సిటివ్..” అన్నారు ఆమె ఫ్రెండ్స్.

దినేష్ ఆమె వైపు సూటిగా చూశాడు.

“ఇలా ఐతే కష్టం హన్వితా.. ఒకవేళ నేను కింద పడిపోయుంటే..?! అంటే నా ఉద్దేశ్యం వేరెవరైనా సరే కిందపడిపోతే..? నువ్వు మరీ ఇంత సెన్సిటీవ్ అయితే అప్పుడు చాలా కష్టమవుతుంది.” అన్నాడు.

కొద్దిసేపటి తర్వాత అందరూ తిరిగి వైజాగ్ కు బయలుదేరారు.

ట్రైన్ వేగంగా గమ్యాన్ని చేరింది.

********************************

రైల్వేస్టేషన్ నుండి బయటకు వెళ్ళబోతోంటే హన్వితను దినేష్ అడిగాడు “మీది ఏ లొకాలిటీ..?”

ఆమె చెప్పింది

“అవునా..నేనుండేదీ అక్కడే”అన్నాడు దినేష్.ఈసారి హన్విత ఆశ్చర్యపోయింది.

“నేను రోజూ అదే రూట్ లో స్కూటీ మీద వెళ్తాను.మరి నువ్వు నాకెప్పుడూ కనబడలేదే..?” అంది.

“నాకు చాలాసార్లు కనబడ్డావ్” అన్నాడు.

“మీ నాన్నగారిపేరు..?” అడిగింది హన్విత.

“నీలకంఠ..” అన్నాడు దినేష్.

హన్విత క్షణం పాటు అప్రతిభురాలైంది.!

“అంటే 'నీలకంఠ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్' చైర్మన్ నీలకంఠ గారి అబ్బాయివా..?” అంది కళ్ళు పెద్దవి చేస్తూ.

“ఎందుకు ప్రతిదానికీ అలా ఆశ్చర్యపోతావ్..?” అన్నాడు దినేష్.

ఇంతలో హన్విత ఫ్రెండ్స్ “ఇక బయలుదేరుదామా?” అన్నారు

“ఓ.కే.మీ ఫ్రెండ్స్ కి చాలా పనులున్నట్లున్నాయ్.సీ.యూ..” అనేసి రైల్వేస్టేషన్ బయటకు నడిచాడు.

బయట డ్రైవర్ కార్ తో రెడీగా ఉన్నాడు.కార్ ఇంటి వైపుబయలుదేరింది.

“ఎలా ఉంది సర్..కొడైకెనాల్?” మాటల మధ్యలో అడిగాడు డ్రైవర్.

“చాలా అందంగా ఉంది..!” అనేసి సైలెంట్ అయ్యాడు.ఆ అడ్వెంచర్ నుంచి తేరుకోవడానికి దినేష్ కు రెండు రోజులు పట్టింది.!!

********************************

రెండు రోజుల తర్వాత యథాఫలంగా దినేష్ తన ఫ్రెండ్స్ తో పాటూ కూర్చుని ఉన్నాడు.

ఇంతలో హన్విత స్కూటీ మీదుగా అటుగా వచ్చింది.

అయితే ఈసారి ఇంతకుముందులా కాకుండా దినేష్ ను చూసింది(చూసింది.చూస్తుంది..చూడాలి బాబూ..! లేకపోతే స్టోరీ కంటిన్యూ అవ్వడం కష్టం.!!).

ఆమెను చూడగానే దినేష్ లేచి నిలబడ్డాడు.

దినేష్ లేవడాన్ని చూసిన హరీష్ “ఏంట్రా.? ఆకలేస్తోందా..? ఏమైనా తెమ్మంటావా..?!” అన్నాడు.

దినేష్ హరీష్ వైపు విచిత్రంగా చూశాడు.!

ఇంతలో హన్విత దినేష్ దగ్గరకు వచ్చింది. “నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్..?” అంది.

“మనకి ఎప్పుడూ ఇక్కడే పని.ఇదిగో వీళ్ళే నా ఫ్రెండ్స్..” అంటూ అందరినీ పరిచయం చేశాడు.

ఆ తర్వాత కాసేపు చాలా క్యాజువల్ గా మాట్లాడి “సరే..నేను వెళ్ళొస్తా..” అంటూ వెళ్లిపోయింది.

ఈ తతంగాన్నంతా చూస్తున్న హరీష్ ఉన్నట్టుండి ఒక్కసారిగా “మేరా జాన్స్..!” అన్నాడు.

ఆ మాటకు దినేష్ ఉలిక్కిపడి “ఏంట్రోయ్..? నా డైలాగ్స్ వాడుతున్నావ్..?” అన్నాడు.

“మరి వాడకపోతే ఎలా సర్.? డైలాగ్ సంగతి పక్కనుంచు.అసలా అమ్మాయి ఎవరు..? నీతో ఇంత క్లోజ్ గా మాట్లాడుతోందంటే నీకు చాలా కాలం నుండి పరిచయం ఉన్నట్లుందే..?” అన్నాడు

“అంత లేదులేరా..” అని బీచ్ లో ఆమె పరిచయం దగ్గరనుంచీకొడైకెనాల్ లో ఆమె కళ్ళు తిరిగి పడిపోయేదాకా మొత్తం గడగడా చెప్పేశాడు.

“నువ్వు మారిపోయావ్ బాబాయ్..! నువ్వు మారిపోయావ్..” అన్నాడు హరిష్.

“ఏంట్రా..? నా డైలాగ్స్ వాడుతున్నావ్..? నేను మారిపోవడం ఏంటి...?” అన్నాడు దినేష్...

మిగతా ఫ్రెండ్స్ కూడా “అవున్రా నువ్వు చాలా మారిపోయావ్..” అన్నారు.

“ఎహేయ్..! ముందు ఏం మారిపోయానో చెప్పి చావండి..!!” అన్నాడు దినేష్.

ఇక హరీష్ మొదలు పెట్టాడు.”కొడైకెనాల్ విశేషాలు చెప్పమంటే..ట్రైన్ లో అరటి పండ్లు అమ్మిన ఆవిడ గురించి చెప్పావ్.., కామెడీ T.C.గురించి చెప్పావ్.., పక్క సీట్లో ఉన్న చిన్న పాప గురించి చెప్పావ్.., కొడైకెనాల్ లో చలి గురించి చెప్పావ్.., అక్కడనుండి నువ్వు దూకడాన్ని చెప్పావ్.., ఆ తర్వాత ప్యారాచూట్ ఓపెన్ కాకపోవడాన్ని చెప్పావ్..కానీ ఈ అమ్మాయి గురించి చెప్పలేదే...! ఏ..? ఎందుకు?” అన్నాడు.

వామ్మో వీడేంటి డైలాగ్ కింగ్ సాయికుమార్ లా రెచ్చిపోతున్నాడనుకొని “అదేం లేదు మిత్రమా...!

మనమధ్య ఆ టాపిక్ రాలేదంతే..” అన్నాడు దినేష్.

“ఎందుకో ఈసారి నీ మాటలు నమ్మబుధ్ధి కావట్లేదు మిత్రమా!” అన్నాడు హరీష్.

'ఇక్కడే ఉంటే వీడు ఎలాగైనా మనతో నిజం చెప్పించేలా ఉన్నాడు' అనుకొని “డాడీ ఈ రోజు ఇంటికి తొందరగా రమ్మన్నాడు!” అనేసి దినేష్ అక్కడనుండి ఉడాయించాడు.

********************************

ఆరోజు రాత్రి ఎందుకో నిద్రపట్టక దినేష్ బాల్కనీ లోకి వచ్చాడు.అలా క్యాజువల్ గా వచ్చిన దినేష్ కు తమ ఇంటి గేటు దగ్గర కొంత మంది మనుషులు తచ్చాడుతుండటం కనిపించింది.!!

'ఈ టైమ్ లో ఎవరబ్బా..?' అనుకొని ఏమీ తెలియని వాడిలా మెల్లగా కిందకు వచ్చాడు.కొద్దిసేపు అక్కడే అలా ఇలా తిరిగిన వాళ్ళు దినేష్ కిందకు రావడాన్ని గమనించారు.దినేష్ వేగంగా బయటకు వచ్చాడుగానీ అప్పటికే వాళ్ళు దినేష్ ను చూసి ఉడాయించారు.!!

దినేష్ పరిగెత్తుకుంటూ బయటకు వాచ్చాడు.

'ఏదో చేద్దామనివచ్చారు.కానీ తనను చూసి పారిపోయారు..' అనుకుని పక్కకి చూశాడు.పక్కన వాచ్ మెన్ స్పృహతప్పి పడిపోయి ఉన్నాడు.!

దినేష్ మెదడు ఇక్కడే పాదరసంలా పని చేసింది.వెంటనే బైక్ స్టార్ట్ చేసి ఆ రౌడీ లను వెంబడించాడు.

అందరూ ఒకే సుమోలో వేగంగా వెళుతుండటం వలన అంత సులభంగా ఎవరూ దొరకలేదు.

బైక్ మీద వెళుతూనే రోడ్డుకు అడ్డంగా పడ్ది ఉన్న ఒక కొయ్యను చేతిలోకి తీసుకున్నాడు.వేగంగా ఆ కొయ్యను సుమో వైపు విసిరాడు.!

అది సుమోకు తగల్లేదుగానీ.., సుమో ముందుగా పడటంతో ఆ సుమో డ్రైవర్ కాస్త దారి తప్పి సుమోను అటూఇటూ కదిలించాడు దాంతో సుమోలో నుంచి కొన్ని కాగితాలు బయటపడ్డాయి.!!

అయితే ఆ సుమో డ్రైవర్ వేగంగా వెళ్ళిపోయాడు.దినేష్ బైక్ ను ఆపి నేరుగా ఆ కాగితాల దగ్గరకు వెళ్ళాడు.అవి 'యుగంధర్ ఫార్మా కంపెనీ' విజిటింగ్ కార్డ్స్...!!

ఆ కార్డులను చూసి కోపంగా కిందపడిఉన్న కొయ్యను తీసికుని ఛ... అంటూ విసిరేశాడు.!

బైక్ ను తిరిగి స్టార్ట్ చెయ్యబోతుండగా.. ఎదురుగా ఒక కారు ఐస్ క్రీమ్ పార్లర్ ముందు ఆగి కనిపించింది.బైక్ లో వెళుతూనే లోపల ఎవరున్నారో గమనిస్తూ వెళ్ళాడు దినేష్.అతని ఊహ నిజమైంది....

కారులో ఉన్నది యుగంధర్....

దినేష్ మొహంమీద చిరునవ్వుతో ఇంటివైపు దూసుకుపోయాడు

ఇంటి దగ్గరకు రాగానే అప్పటికే ఆ వాచ్ మెన్ పైకి లేచి ఉన్నాడు.

“సర్..కొంతమంది..” అంటూ ఏదో చెప్పబోయాడు. “ష్...! ఇప్పుడు జరిగిన విషయం ఎవరికీ తెలియకూడదు..” అన్నాడు దినేష్.

ఆ వాచ్ మెన్ 'సరే' అన్నట్లు తలూపాడు.

ఆ రాత్రి అలా గడచిపోయింది.

********************************

' యుగంధర్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ .'

బైక్ స్టార్ట్ చేసి దాదాపు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వచ్చి ఆఫీస్ ముందు ఆగాడు దినేష్.!

ఈసారి రిసెప్షనిష్టు అతడ్ని అడ్డగించలేదు.నేరుగా ఛైర్మన్ చాంబర్ లోకి దూసుకెళ్లాడు.యుగంధర్ దినేష్ ను చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు.!

“కంగారు పడకు... మొన్న సీన్స్ రిపీట్ చేయను..!” అన్నాడు దినేష్.యుగంధర్ రక్తం సలసలా మరిగింది.!

“ఎందుకొచ్చావ్..?” అన్నాడు.

“ఏమీ లేదు..., నిన్న రాత్రి ఎవరో మా ఇంటిమీద ఎటాక్ చేయాలని చూశారు.తిరిగి నేను ఎటాక్ చేయడంతో భయపడి పారిపోయారు.! వారి గుడ్ లక్ ఏంటంటే ఎవడూ దొరకలేదు..., నీ బ్యాడ్ లక్ ఏంటంటే కార్ నుంచి ఇవి దొరికాయ్..” అని తన చేతిలో ఉన్న కార్డ్స్ యుగంధర్ ముందుంచాడు.

యుగంధర్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు...! తన కంపెనీ విజిటింగ్ కార్డ్స్ అవి.!!

“అంటే ఏంటి నీ ఉధ్ధేశ్యం..? ఆ మనుషుల్ని నేను పంపించాననుకుంటున్నావా..?” అన్నాడు యుగంధర్ కోపంగా...

“వాళ్ళు నీమనుషులు కాదని నాక్కూడా తెలుసు.! ఏ వెధవా తన రౌడీలకు విజిటింగ్ కార్డ్ లు ఇచ్చి పంపడు...! పైగా ఇన్ని విజిటింగ్ కార్డ్స్.అదేదో పెళ్ళిపత్రికలైనట్లు..,!! నువ్వు పంపలేదని నాకు రాత్రే అర్థమైంది...” అంటూ చెప్పడం ఆపి పైకి లేచాడు దినేష్.

“మేటర్ ఏంటంటే... ఎవరో మన రెండు కంపెనీల మధ్య గొడవ పెట్టాలని ట్రై చేస్తున్నాడు.వాడెవడో కనుక్కునేందుకు ప్రయత్నిస్తే మనిద్దరికీ చాలా మంచిది.ఇక్కడ హైలైట్ ఏంటంటే..,ఒక పెద్ద ఫార్మా కంపెనీ చైర్మన్ అయిన యుగంధర్ గారు అర్ధరాత్రి దాటాక ఐస్ క్రీమ్ పార్లర్ ముందు ఉండాల్సిన అవసరమేముంది...? ఒకవేళ పొరపాటున ఆ మనుష్యులను నువ్వే పంపించుంటే మాత్రం..., చెప్పానుగా.., నేను మా అన్నంత మంచివాడ్నైతే కాదు...!! ఈ సారి మాటలుండవు...ఆటలే..!!” అనేసి వెనక్కు తిరిగాడు.

అప్పుడే తలుపు తెరుచుకుంటూ హన్విత లోపలికి ప్రవేశించింది.!!

ఎందుకో దినేష్ వైపు కోపంగా చూస్తోంది.!!!

'నువ్వేంటి ఇక్కడ..?' అని మొదట ఆశ్చర్యపోయినా ఆ తర్వాత త్వరగా తేరుకొని.., “నిన్న రాత్రి రోడ్డు మీద బైక్ లో ఏదో రాడ్ పట్టుకొని తిరుగుతూ కనిపించావ్..? అంత రాత్రిపూట నీకు ఒంటరిగా ఏం పని?” అంది..

ఆమె కోపంగా మాట్లాడుతోందని మొహాన్ని చూస్తూనే అర్థమవుతోంది.యుగంధర్ షాకయ్యి వీరి సంభాషణను వింటున్నాడు.!

దినేష్ హన్విత మాటలనువిని.. “నేను రాత్రి బయట ఉన్న విషయం నీకెలా తెలుసు?” అన్నాడు దినేష్.

“రాత్రి నేనూ..,, అన్నయ్యా ఐస్ క్రీమ్ తిందామని పార్లర్ కి వచ్చాము.అప్పుడు చూశాను నిన్ను..” అంది హన్విత.

“అంటే యుగంధర్..,”

“ మా అన్నయ్య..” అంది హన్విత.!

దినేష్ ఆశ్చర్యంగా యుగంధర్ వైపు తిరిగాడు.యుగంధర్ అప్పటికే ఇద్దరినీ షాకయ్యి చూస్తున్నాడు.!!

దినేష్ యుగంధర్ ని చూసి నవ్వుతూ “గాడ్ మస్ట్ బి క్రేజీ యార్..” అనేసి వెనక్కు తిరిగాడు.హన్విత ఇంకా దినేష్ వైపు కోపంగానే చూస్తోంది...!

“చూడూ.., అర్ధరాత్రి బైక్ తీసే ప్రతివాడూ.., అరాచకం సృష్టించేవాడు కాడు.” అనేసి బయటకు నడిచాడు.

బైక్ స్టార్ట్ చేసి వేగంగా ఇంటివైపు దూసుకెళ్ళాడు.

********************************

ఆరోజు రాత్రి హన్విత దినేష్ కు కాల్ చేసింది.

క్యాజువల్ గా కాల్ లిఫ్ట్ చేసి 'హలో..' అన్నాడు దినేష్.

“సారీ..” అంది హన్విత.

“ఇట్స్ ఓ.కే.. నేను అర్థం చేసుకోగలను.” అన్నాడు దినేష్

“థాంక్స్.నన్ను అర్థం చేసుకున్నందుకు..” అని ఇంకా చాలా సేపు మాట్లాడింది.

దినేష్ కాసేపు మాట్లాడాక ఎందుకో టైమ్ ఎంతైందో అని చూశాడు.

'మైగాడ్..ఒంటి గంట దాటింది' అనుకొని ఇక కాల్ కట్ చేద్దామనుకున్నాడు.

అయితే అప్పుడే దినేష్ రూమ్ వైపుగా వచ్చిన ఈశ్వర్.., “ఏంట్రా ఇంకా పడుకోలేదా..?” అన్నాడు....!

ఇక దినేష్ సంగతి చెప్పాలా..! అన్నకి ఏదైనా వ్యతిరేకంగా చేయాల్సిందే..!! “ఆ.. చెప్పు.., పర్లేదు..,! వింటున్నా..!!” అని ఫోన్ లో మాట్లాడటం కంటిన్యూ చేశాడు.!

ఈశ్వర్ 'వీడు ఈ జన్మలో మారడు' అనుకుని వెళ్ళిపోయాడు.!!

అలా ఒక పక్క దినేష్,హన్విత ల మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది.

మరో పక్క యుగంధర్ కి దినేష్ ఇంటిమీద ఎటాక్ చేసినవారెవరో తెలియలేదు.అకారణంగా తన మీద నింద పడటాన్ని అతను సహించలేకపోతున్నాడు.పైగా ఈ మధ్య దినేష్ తో పాటూ హన్విత సన్నిహితంగా తిరగటం అతనికి అస్సలు నచ్చలేదు.!

ఒకరోజు ఫ్రెండ్స్ తో పాటూ బీచ్ కి వచ్చింది హన్విత.

ఈ మధ్య హన్విత తమతో కలవకపోవడంతో ఆమె స్నేహితురాళ్ళు ఆమెమీద గుర్రుగా ఉన్నారు. “ఏంటి హన్వితా..? ఈ మధ్య మాతో కలవడమే మానేశావ్...” అంది ఓ స్నేహితురాలు.

“అదేంలేదు...జస్ట్ అలా జరిగిపోయిందంతే..,” అంది హన్విత.

“మేము ఓ విషయాన్ని గమనించాం” అన్నారు..

“ఏంటి..?”

“నీకూ,దినేష్ కు చనువు బాగా పెరిగినట్లుంది..?” ఆ మాటలకు హన్విత అదిరిపడింది.!

“ఛ..ఛ..అదేం లేదు...,అతను బాగా మాట్లాడుతాడు,చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు.అంతే..” అంది హన్విత.

“అంటే కేవలం ఫ్రెండే అంటావా..?” అడిగారు..

“కేవలం ఫ్రెండేనా..అంటే..అంతే అని కాదు..! ఫ్రెండ్ కన్నా కొంచెం ఎక్కువే..!! అలా అని మరీ క్లోజ్ ఏమీ కాదు.., ఏమోలే దాని సంగతి వదిలేయండి..” అంటూ టాపిక్ డైవర్ట్ చేసింది హన్విత.

ఆమె ఫ్రెండ్స్ కు విషయం అర్థమైంది.

తర్వాతిరోజు బీచ్ కు దినేష్ కూడా వచ్చాడు.

బీచ్ లో నడుస్తుంటే ఎందుకో ఏదో కాలికి బలంగా గుచ్చుకోవడంతో 'అమ్మా..!' అంటూకాలు పైకి తీశాడు.చిన్న పెంకు దినేష్ కాలి చివరన గుచ్చుకుంది.దాన్ని అతికష్టంమీద తీసేశాడు దినేష్.

అయితే దినేష్ 'అమ్మా..!' అనగానే హన్విత చాలా కంగారుపడింది.

ఇక ఆ రక్తాన్ని చూడగానే ఆమెకు నోటమాట రాలేదు. “ఏమైంది.చూసుకోవచ్చుగా..,? నీకస్సలు బుధ్ధిలేదు..,! ఇంకాస్త లోతుకు దిగుంటే...,నీకు ముందు నుంచీ కేర్ లెస్.., ఎవరూ పట్టించుకోరనేగా..,? ఇంత రక్తమా..,? ఇడియట్..,! స్టుపిడ్..!! అసలు నిన్ను..” అంటూ కంగారు పడసాగింది.

“స్టాప్..స్టాప్..,! ఏమీ కాలేదు మేడమ్! మళ్ళీ నువ్వు కంగారుపడి కళ్ళుతిరిగి పడొద్దు.” అన్నాడు కొడైకెనాల్ సంఘటనని గుర్తుచేసుకుంటూ.

హన్విత కోపంగా దినేష్ వైపు చూసింది.

“సరే నేనిక వెళ్తాను.” అంటూ దినేష్ అక్కడనుంచి వెళ్ళిపోయాడు.

అయితే రెండు నిమిషాలపాటూ హన్విత దినేష్ కు దెబ్బ తగలగానే విలవిల్లాడిపోయిన తీరు చూసిన ఆమె స్నేహితురాళ్ళకు దినేష్ అంటే హన్వితకు ఎంత ఇష్టమో అర్థమైంది.

“నువ్వు అతడ్ని ప్రేమిస్తున్నావా..?” సూటిగా అదిగింది ఓ స్నేహితురాలు.అంతసడెన్ గా ఈ ప్రశ్న అడగటంతో హన్వితకు నోట మాట రాలేదు.

“ నువ్వు సెన్సిటివ్ అని తెలుసుగానీ., అతనికి దెబ్బ తగిలితే నీ ప్రాణం పోయినట్లు విలవిల్లాడిపోయావ్..., దీన్నేమంటారు....”

హన్విత కాసేపు సైలెంట్ గా ఉండిపోయింది.ఆ తర్వాత చెప్పింది. “ఎంతైనా నేనూ ఓ ఆడపిల్లనే..ధైర్యంగా అతనంటే ఇష్టమని ఎలా చెప్పగలను..?” అంది. హన్విత స్నేహితురాళ్ళకు ఆమె చెప్పింది నిజమే అన్పించింది.

“కాలంమారింది హన్వితా.., ముందులా ఇప్పుడు ఏదీ స్థిరంగా ఉండట్లేదు.మనసు కూడా అందుకు మినహాయింపు కాదు.ముందు అతని అభిప్రాయం కనుక్కో.., ఆ తర్వాత అనవసంగా బాధపడటాలు లాంటివి పెట్టుకోకు..” అంటూ అందరూ వెళ్ళిపోయారు.

********************************

“మిత్రమా దినేష్..”అన్నాడు హరీష్.

“చెప్పు మిత్రమా..” అన్నాడు దినేష్ అదే స్టయిల్లో...

“మనిషిలో మార్పొచ్చింది మిత్రమా..” అన్నాడు.

“అవును నిజమే మిత్రమా.., నువ్వు కాస్త నల్లబడ్డావ్..ఎండలో తిరగడం తగ్గించు” అన్నాడు దినేష్..,

“రేయ్..నేను చెప్పేది నా గురించి కాదు నీగురించి.., నువ్వు ఈ మధ్య కలరొచ్చావ్..” అన్నాడు హరీష్.

“దాందేముంది మేరా జాన్స్.. ఎండన పడితే నల్లబడతాం.., నీడన ఉంటే తెల్లబడతాం ఏమంటారు..?” అన్నాడు

మిగతావాళ్ళు “నీతో మేం మాట్లాడలేం రా.., నీకు ఆ హరీష్ గాడే కరెక్ట్!” అన్నారు.

ఇంతలో హరీష్ అందుకొని “నిజమే మిత్రమా.. నీడన పడితే తెల్లబడతాం..కానీ ప్రేమలో పడినా కలరొచ్చేస్తామంటా..” అన్నాడు హరీష్.

“ఏంట్రా నువ్వనేది?” అన్నాడు దినేష్.

“మరి కాక..., ఐదురోజులైంది మమ్మల్ని కలిసి.. ఈ అయిదు రోజుల్లో ఎప్పుడుఫోన్ చేసినా బిజీ బిజీ.. ఎంతసేపు ఫోన్ లో మాట్లాడతావ్ రా..?” అన్నాడు ఆవేశంగా..

“ఆవేశపడకు మిత్రమా ఇందులో వింతేముంది.ఈ రాజాగారికి తగిన రాణి దొరికేసింది.ఇందులో దాచడానికేముంది?” అన్నాడు దినేష్.!

ఆ మాట విని అందరూ అవాక్కయ్యారు. “అదేంట్రా మేమేదో సరదాకి అంటే..నువ్వు అంత దూరం వెళ్ళిపోయావ్..” అన్నాడు హరీష్.

“సరదాకేంటి మిత్రమా.., మీరు చెప్పింది నిజమే.. హన్వితంటే నాకు చాలా ఇష్టం..”

“మరి ఆ అమ్మాయికి..

“ఇష్టమే..”

“అని నీతో చెప్పిందా..?”

“పిచ్చివాడా.. మధ్యాహ్నమైతే అన్నంతినాలని మనకెవరైనా చెప్పలా..ఆటోమెటిగ్గా ఆకలేస్తుంది.ఇదీ అంతే..” అన్నాడు దినేష్.

“అదేం పోలికరా విచిత్రంగా.ఇంతకీ నువ్వు ప్రేమిస్తున్నట్లైనా చెప్పావా..?”

“చెప్పలేదు.., చెప్పను" అన్నాడు దినేష

హరీష్ ఉలిక్కిపడ్డాడు. “ఇదేంట్రోయ్ కొత్తగా..,”

“మరి..ప్రతి లవ్ స్టోరీలో జరిగేదేగా.., అబ్బాయి వెళ్ళి ఐలవ్ యూ చెప్పేదాకా అమ్మాయికి ఇష్టమున్నా సరే నోరు విప్పదు.ఈ ట్రెండ్ మారాలి.భారతదేశంలో స్త్రీలను గౌరవించడం సాంప్రదాయం కాబట్టి ముందుగా వారినే చెప్పనిద్దాం...!” అన్నాడు.

“ఆపుతావా నీ పూరి జగన్నాధ్ డైలాగులు..,! అయినా ఆ అమ్మాయి నువ్వు చెప్పకపోతే ఇంకెవర్నైనా చూసుకుంటే..,”

“అంత సీన్ లేదు.ఒకమ్మాయి నిజంగా ప్రేమిస్తే.., ఆమెకి పరిస్థితులు అనుకూలంగా ఉంటే చచ్చినా సరే తను ప్రేమించిన వాడ్ని వదులుకోదు.మనం అనవసరంగా అమ్మాయిలమీద పడి ఏడుస్తుంటాంగానీ.., అమ్మాయిలూ ఈ మధ్య ఆలోచిస్తున్నార్రా.!” అన్నాడు దినేష్.!

ఆరోజు రాత్రి

హన్విత దినేష్ గురించి తీవ్రంగా ఆలోచిస్తోంది.

ఇలా అయితే లాభంలేదనుకొని దినేష్ కు ఫోన్ చేసింది...

“హలో..ఏంటి విశేషాలు..?” అన్నాడు దినేష్

“ఏంలేదు.రేపు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి.సాయంత్రం ఐదు గంటలకి బీచ్ దగ్గరకు రా...” అంది.

“తప్పకుండా..” అన్నాడు దినేష్.

హన్విత ఫోన్ కట్ చేసింది.

'ఈరోజేంటి ఇంత తొందరగా ఫోన్ పెట్టేసింది.., సరేలే..ఈ రోజైనా తొందరగా నిద్రపోదాం' అని పడుకున్నాడు దినేష్.!

********************************

తర్వాతిరోజు ...

బీచ్ దగ్గర నడుస్తున్నాడు దినేష్.'హన్విత తననెందుకు రమ్మంది?' అనే ఆలోచిస్తున్నాడు.

హన్విత తనను ప్రేమిస్తోందన్న విషయం దినేష్ కు తెలుసు.కానీ ఇప్పుడు చెప్తుందని ఎందుకో అతడికి అనిపించట్లేదు.'చూద్దాం ఏం జరుగుతుందో' అని మెల్లగా నడుస్తున్నాడు దినేష్

ఇంతలో “దినేష్..!” అన్న పిలుపు వినిపించింది.వెనక్కు తిరిగి చూశాడు.

హన్విత ఎందుకో చాలా సంతోషంగా కనబడింది.

ఇద్దరి మధ్యా దాదాపు యాభై మీటర్ల దూరం ఉంది.హన్విత పరిగెత్తుకుంటూ దినేష్ దగ్గరకు రాసాగింది.దినేష్ కు పరిస్థితి అర్థమైంది.

'అంటే మనం అనుకున్నదే కరెక్ట్.అరే దినేషూ..,నువ్వు సూపర్!' అనుకున్నాడు మనసులో..,

'మనం ప్రేమించిన అమ్మాయి మనకెదురుగా మనకోసం పరిగెత్తుకుంటూ వస్తుంటే ముందడుగెయ్యకుండా కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం.

దినేష్ ఇప్పుడు ఆ పరిస్థితిలోనే ఉన్నాడు.హన్విత కళ్ళల్లో మెరుపును చాలా దూరం నుండే గమనిస్తున్నాడు దినేష్.అయితే ఏమీ తెలియనివాడిలా నిలబడ్డాడు.!

హన్విత పరిగెత్తుకుంటూ వచ్చి సరిగ్గా అయిదుమీటర్ల దగ్గర ఆగిపోయింది.!

అలసిపోయిందనుకున్నాడు దినేష్.

నిజమే..! అలసిపోయింది.!!

ఎంతలా అంటే ఇక నిలబడలేనంతలా.! అందుకేనేమో స్పృహతప్పి కింద పడిపోయింది.!!

ఊహించని ఈ పరిణామానికి దినేష్ షాక్ కు గురయ్యాడు.అరక్షణం కూడా ఆలస్యం చెయ్యలేదు దినేష్.వేగంగా వెళ్ళి.., 'హన్వితా.., హన్వితా' అంటూ ఆమెను లేపడానికి ప్రయత్నించాడు.

********************************

ఓరెండు రోజులపాటు 'నీలకంఠ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్' మేనేజింగ్ డైరెక్టర్ గా ఏ ఇబ్బందీ లేకుండా బాధ్యతలు నిర్వర్తించాడు.

అయితే మూడో రోజుకి దినేష్ కు విసుగొచ్చింది.!

నేరుగా అన్న క్యాబిన్ లోకి వెళ్ళాడు.ఎప్పుడూ లేనిది తమ్ముడు తన క్యాబిన్ లోకి రావడంతో ఈశ్వర్ ఆశ్చర్యపోయాడు.!

“తమ్ముడూ..నువ్వేంటి నా క్యాబిన్ లోకి...?, సరే..వచ్చి కూర్చో..” అన్నాడు.

దినేష్ వచ్చి కూర్చొని “నాకు బోర్ కొడుతోంది.నేను ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్తాను.ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్.” అన్నాడు.

ఈశ్వర్ చాలా సహజంగా “సరే నీ ఇష్టం..” అన్నాడు.

దినేష్ అలా ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్ళాడు.

********************************

అరగంట తర్వాత ...

SMG హాస్పిటల్స్ ...

డాక్టర్ కోసం ఎదురుచూస్తున్నాడు దినేష్.

డాక్టర్ మొహమ్మద్ బయటకు వచ్చాడు.ఇండియాలోని ది బెస్ట్ డాక్టర్స్ లో ఆయన ఒకడు

“డాక్టర్ ఎలా ఉంది..?” అని అడిగాడు.డాక్టర్ మొహమ్మద్ మొహం చాలా సీరియస్ గా ఉంది.

ఆస్తమా అన్న దాని గురించి మీరు వినే ఉంటారు దినేష్..” అన్నాడాయన.

“ఆ ..తెలుసు..శ్వాస తీసుకోవడానికి కష్టమవుతుంది.. అదేగా..,?” అన్నాడు దినేష్.

“ఆ..అదే..మామూలు ఆస్తమా కేసుల్ని చాలా ఈజీగా క్యూర్ చేయొచ్చు గానీ.ఇది డిఫరెంట్ కేస్...” అంటూ చెప్పడానికి కాస్త సంకోచించాడు డాక్టర్ మొహమ్మద్.

“ఫర్లేదు డాక్టర్..ఏ విషయమైనా నాకు చెప్పండి...నేను అర్థం చేసుకోగలను..” అన్నాడు.

“ఆ అమ్మాయి మీకు ఏమవుతుంది..?” అడిగాడు డాక్టర్.

ఇప్పటిదాకా ఎవ్వరికీ చెప్పని మాట...., ఎన్నో సార్లు చెప్పాలనుకున్న మాట.., గుండె లోతుల్లోనుంచి తన్నుకొచ్చిన మాట.., కనీసం తన ఫ్రెండ్స్ దగ్గర కూడా చెప్పని మాట...ఎందుకో డాక్టర్ ముందు చెప్పాలనుకున్నాడు గానీ చెప్పలేకపోయాడు.!

డాక్టర్ల దగ్గర.., లాయర్ల దగ్గర నిజాలే చెప్పాలంటారు.అందుకే.., అబధ్ధం కాని అబధ్ధం.., నిజానికి చాలా దగ్గరైన నిజాన్ని చెప్పాడు. "చాలా దగ్గరి పరిచయం సర్.” అని.

“నెర్వ్ ఆస్తమా అని ఇది ఒక డిఫరెంట్ ఆస్తమా.మామూలు ఆస్తమా కి జస్ట్ అప్పటికప్పుడు బ్రీతింగ్ తీసుకోవడానికి చాలా పరికరాలు ఉన్నాయి.కానీ ఈ నెర్వ్ ఆస్తమా ఒకేసారి వస్తుంది.వచ్చినప్పుడు మనిషి డీప్ కోమాలోకి వెళ్ళిపోతాడు..” అన్నాడు డాక్టర్ మొహమ్మద్.

ఆ చివరి మాటకి దినేష్ అదిరిపడ్డాడు.

“అంటే ..”

“యస్..ఆ అమ్మాయి ఇప్పుడు కోమాలో ఉంది.” స్పష్టంగా అన్నాడు డాక్టర్ మొహమ్మద్.

ఓ నిమిషంపాటు అక్కడ నిశ్శబ్దం తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

“మీ నాన్నగారు నాకు బాగా తెలుసు కాబట్టి చెబుతున్నాను.దీనికి స్పెషల్ మెడిసిన్ ఏదీ ఇప్పటిదాకా తయారు చేయలేదు.కొన్ని మెడిసిన్స్ తో దాదాపు ఓ సంవత్సరంపాటూ మేనేజ్ చెయ్యొచ్చుగానీ ఆ తర్వాత చాలా కష్టం.మామూలు మెడిసిన్స్ వాడితే మాత్రం చాలా ప్రమాదం..!: అన్నాడు డాక్టర్ మొహమ్మద్.

“ ప్రమాదమా..

“అవును.డోసేజ్ ఎక్కువైతె అమ్నీషియా కి దారితీయొచ్చు.ఇక అమ్నీషియా గురించి మీకు తెలిసిందేగా? గతం మరిచిపోయి నాడీవ్యవస్థ దెబ్బతిని కనీసం సంవత్సరం కూడా బతకటం జరగదు..” అన్నాడు డాక్టర్ మొహమ్మద్.

“సరే..డాక్టర్.. నేను ఫ్యామిలీకి ఇన్ ఫామ్ చేస్తాను.” అనేసి బయటకు నడిచాడు దినేష్.

సరిగ్గా అప్పుడే యుగంధర్ దగ్గరనుండి దినేష్ కు కాల్ వచ్చింది

“దినేష్..ఆ రోజు మీ ఇంటిమీద అటాక్ చేసినవాడెవడో తెలిసింది.” అన్నాడు యుగంధర్.

అయితే దినేష్ అవేవీ వినే స్థితిలో లేడు.

“SMG హాస్పిటల్స్ దగ్గరికి రా..” అన్నాడు

“ఎందుకు?” అన్నాడు యుగంధర్. “రమ్మన్నప్పుడు..రా...!” అన్నాడు దినేష్ స్పష్టంగా.

“ఓ.కే.ఐదు నిమిషాల్లో అక్కడుంటాను.” అన్నాడు.

ఐదు నిమిషాల తర్వాత దినేష్ ముందున్నాడు యుగంధర్.

“మీ నాన్నగారు ఎక్కడ?” అన్నాడు దినేష్.

“ఏ..ఏమైంది..?” అన్నాడు యుగంధర్.

దినేష్ హాస్పిటల్ వైపు వేలుని చూపించాడు. “అక్కడ డాక్టర్ మొహమ్మద్ గారు ఉంటారు వెళ్ళు.” అన్నాడు.

“ఎందుకు?” అన్నాడు యుగంధర్.

“నీతో ఏదో మాట్లాడాలంటా..” అన్నాడు.

“సరే నువ్వూ రా వెళ్దాం..” అన్నాడు.

“నేను..అక్కడికి..కష్టం..” అన్నాడు దినేష్

యుగంధర్ కు ఏమీ అర్థంకాక లోపలికి వెళ్ళాడు.

పది నిమిషాల తర్వాత బయటకు వచ్చాడు యుగంధర్.దినేష్ మొహంలో ఏ భావం లేదు

యుగంధర్ మొహంలో మాత్రం ఆశ్చర్యం,షాక్ ఆవేదన ఇలా చాలా భావాలు కనబడుతున్నాయి.

“తనకు నువ్వంటే చాలా ఇష్టం..” అన్నాడు యుగంధర్.ఓ జీవం లేని నవ్వునవ్వి అక్కడినుండి వెళ్ళిపోయాడు దినేష్.

********************************

ఆరోజు రాత్రి నాన్నతో పాటు కూర్చొని ఉన్నాడు దినేష్ .

ఈశ్వర్ కూడా అక్కడే ఉన్నాడు.

“ఆ అమ్మాయికి నీకు ఎలా పరిచయం?” అడిగాడు నీలకంఠ.

“మంచి ఫ్రెండ్ నాన్నా..” అన్నాడు దినేష్ తడబడకుండా.

“సాయంత్రమే పరమేశ్వరం కలిశాడు.చాలా బాధలో ఉన్నాడు.వాళ్ల కంపెనీలోనే కాదు,మన కంపెనీలో కూడా నెర్వ్ ఆస్తమాకి మెడిసిన్స్ లేవు..” అన్నాడు నీలకంఠ.

“అవునూ...., మన రీసెర్చ్ టీమ్ ఎక్కడ?” అడిగాడు నీలకంఠ.

“వాళ్లతో కూడా మాట్లాడి చూశాం డాడీ.., అందుకు మెడిసిన్స్ ఇప్పటిదాకా ఏ దేశంలోనూ తయారు చేయలేదు.కాకపోతే ఇక్కడే వైజాగ్ లో కంబాలకొండ ఫారెస్ట్ లో గిరిజనులు ఏదో ఉమ్మెత్తపువ్వుతో చేసే నాటువైద్యానికి ఇది దగ్గరగా ఉంటుందని ఒక రూమర్ ఉంది” అన్నాడు ఈశ్వర్.

“ఈ పుకార్లను నమ్మి మనుషుల మీద ప్రయోగించకూడదు..” అన్నాడు నీలకంఠ

“పాపం పరమేశ్వరం.వాడిప్పుడెలా ఉన్నాడో..” అనుకున్నాడు నీలకంఠ.

ఆ తర్వాత దినేష్ తన గదిలోకి వెళ్ళిపోయాడు.

పావుగంట తర్వాత దినేష్ దగ్గరకు వచ్చాడు ఈశ్వర్.

“నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావని నాకు తెలుసు” అన్నాడు.

“ఎవర్ని..?” అన్నాడు దినేష్ ఆశ్చర్యాన్ని దాచేస్తూ

“అదే.. హన్వితను.,” అన్నాడు ఈశ్వర్.

“అంత సీన్ లేదు.” అన్నాడు దినేష్.

“నన్ను మోసం చేసినా పర్లేదు.నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు.నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావని నాకెప్పుడో తెలుసు.పోతే నువ్వెంత మొండిఘటానివో నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను.ఆరోజు రాత్రి మన ఇంటి మీద అటాక్ చేసింది అజయ్.” అన్నాడు.

ఆ మాటలకు ఒక్కసారిగా దిగ్భ్రాంతికిలోనయ్యాడు దినేష్.

'అజయ్' అంటే మాఫియాతో సంబంధం ఉన్న ఓ బిజినెస్ మ్యాన్.చాలా సార్లు తమ కంపెనీతో గొడవ పెట్టుకోవడానికొచ్చి ఈశ్వర్ చేతిలో దెబ్బలు తిని వెళ్ళిపోయాడు.! అంటే యుగంధర్ కీ, తమ కంపెనీకి గొడవ పెట్టి మధ్యలో తను ఎదగాలనుకున్నాడు అజయ్

'వావ్..వాట్ ఎ ప్లాన్!' అనుకున్నాడు దినేష్.

“అజయ్ అని నీకెలా తెలుసు?” అడిగాడు.

“సాయంత్రమే యుగంధర్ మాట్లాడాడు. ఆ అజయ్ ఇప్పుడు ఆ 'నెర్వ్ ఆస్తమా' కి మెడిసిన్ తయారు చేసి ఇంటర్నేషనల్ లెవల్లో ఎదగాలని చూస్తున్నాడు కానీ అది జరగనిపని అని నీకూ తెలుసు.., నాకూ తెలుసు.నేను చెప్పొచ్చేదేమిటంటే నువ్వు ఆ అమ్మాయికోసం ఎలాంటి అడ్వెంచర్లూ చెయ్యొద్దు.మనం కంపెనీ తరఫున నేను,యుగంధర్ కలిసి ట్రై చేస్తాం.” అన్నాడు ఈశ్వర్.

దినేష్ ఒక్కసారిగా పైకి లేచాడు.!

“ఆ అమ్మాయికోసం ఎవరూ ఇక్కడ ఆలోచించట్లేదు.నువ్వనుకున్నట్లు నేను ఆ అమ్మాయిని ప్రేమించలేదు.నేను ప్రేమించనప్పుడు అడ్వెంచర్లు చెయ్యాల్సిన అవసరం అస్సలు లేదు.నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకోకు..” అన్నాడు.

ఈశ్వర్ ఇక తన పనేమీ లేదన్నట్లుగా వెళ్లిపోయాడు.

మరుసటిరోజు పొద్దున్నే నిద్రలేచాడు ఈశ్వర్.

ఆఫీస్ కు బయలుదేరబోతూ దినేష్ ను పిలిచాడు

అయితే దినేష్ రూమ్ నుండి ఏ సమాధానం లేదు.

“ఏం చేస్తున్నాడు వీడు..?” అనుకొని రూమ్ లోకి వెళ్ళాడు.

లోపల కంప్యూటర్ ఆన్ లోనే ఉంది.కంప్యూటర్ లో రాత్రంతా దినేష్ 'నెర్వ్ ఆస్తమా' గురించి ఇంటర్నెట్లో వెతికిన హిస్టరీ కనిపించింది.

పక్కన ఒక లెటర్ ని గమనించాడు.

అందులో ఇలా ఉంది.

'Going to Kambalakonda. Don't search for me.'!!

'ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది.., షిట్ !' అనుకున్నాడు ఈశ్వర్.!

సరిగ్గా ఇదే సమయానికి ..........

అడవిలో కాలుపెట్టాడు దినేష్. ! ! !

Search Begins

నీలకంఠ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ...

ఈశ్వర్,యుగంధర్ ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు.

“మా తమ్ముడు ఈ రోజు కంబాలకొండ ఫారెస్ట్ కు బయలుదేరాడు.”అన్నాడు ఈశ్వర్.

అదిరిపడ్డాడు యుగంధర్. “వ్వాట్..! ఏంటి నువ్వనేది..?”

“పట్టపగలే ఎవరికీ చెప్పకుండా బయలుదేరాడు.నెర్వ్ ఆస్తమా గురించి మా రీసెర్చ్ టీమ్ కి కూడా తెలియనంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాడు.!” అన్నాడు.

“కానీ ఒక్కడే వెళ్ళడం రిస్క్ కదా..” అన్నాడు యుగంధర్

“ వాడి గురించి నీకు తెలియదు.., వాడు అనుకున్నదానికోసం ఎంతకైనా తెగిస్తాడు..,”

“అయ్యో..నీకు అసలు విషయం అర్థం కావట్లేదు.., మీ తమ్ముడు ఏదైనా చేయగలడు.కానీ ఆల్రెడీ ఆ మెడిసిన్ కోసం అజయ్ రంగంలోకి దిగాడు.” అన్నాడు.

ఆ మాటలు వినగానే మొదటిసారి ఈశ్వర్ టెన్షన్ పడ్డాడు. “అవును.అదీ నిజమే.వాడు నా దగ్గర ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా వాడికి ఇంకా బలుపు తగ్గలేదు.పైగా నామీద ఉన్న కోపాన్నంతా దినేష్ మీద చూపిస్తాడేమో..,” అంటూ పైకిలేచి అటూ ఇటూ తిరగసాగాడు.

“నేను బయలుదేరుతున్నాను.” స్పష్టంగా అన్నాడు ఈశ్వర్.

“నేనూ నీకదే చెప్పాలనుకున్నాను.” అన్నాడు యుగంధర్. “నువ్వెందుకు..నేను నా తమ్ముడి జాగ్రత్త కోసం వెళ్తున్నాను ఎంతైనా వాడికి నేను అన్న.” అన్నాడు ఈశ్వర్.

“నేను కూడా ఒక అమ్మాయికి అన్ననే.'అన్న' అనే పదానికి ఉన్న బాధ్యత గురించి నాక్కూడా తెలుసు.నేను ఆరోజే వెళ్దామనుకున్నానుగానీ నాన్నే ఆపేశాడు.! ఇక ఎవరు ఆపినా నేను ఆగను.” అన్నాడు యుగంధర్.

“మనం రెండు టీమ్స్ గా విడిపోదాం.నేను మా తమ్ముడిని వెతుక్కుంటూ వెళ్తాను.మీరు వేరే వైపుగా రండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అజయ్ గాడు మనకంటే ముందు ఆ మెడిసిన్ ని సాధించకూడదు.”తిరిగి యుగంధరే అన్నాడు .

ఈశ్వర్ యుగంధర్ నే చూస్తున్నాడు.రెండు వారాల క్రితం ఎంతో క్రూరంగా ఆలోచించిన వ్యక్తి ఇతను.కానీ 'అన్న' అనే సంబంధం ఇతడ్ని మనిషిలా మార్చేసింది అనుకున్నాడు.

హన్వితను చూసుకోమని అమ్మానాన్నలకు చెప్పేసి ఈశ్వర్, యుగంధర్ లు తమ వేట మొదలుపెట్టారు. అయితే ఇద్దరికీ తెలియని విషయం ఏంటంటే......

అజయ్ అప్పటికే అడవిలో ఉన్నాడు. !!

********************************

కంబాలకొండ ఫారెస్ట్ .....

చాలా దూరం నడిచాడు ఈశ్వర్.తనతో పాటు నలుగురు రీసెర్చ్ కమిటీ మెంబర్స్ వచ్చారు.

రాత్రి కాగానే ఓ మంచి ప్రదేశం చూసి నిద్రకుపక్రమించారందరూ..,

సరిగ్గా పదిగంటల సమయంలో ఏదో పెద్ద జంతువు అరుపు వినబడింది.అందరూఒక్కసారిగా నిద్రలేచి ఏంటా అని అటూ ఇటూ చూసి ఏమీ లేకపోయే సరికి తిరిగిపడుకున్నారు.!

ఇంతలో మళ్ళీ వినపడింది.!

అందరికీ ఒక్కసారిగా భయంవేసింది.

ఈశ్వర్ కి కూడా భయం వేసినా “అరే..! అడవన్నాక ఏవో అడవి పిల్లులూ, నక్కలూ లాంటివి ఉంటాయ్.అంతమాత్రాన.., అంత మాత్రానా...! భయపడాలా?!” అన్నాడు .

“సార్..నాకెందుకో అనుమానంగా ఉంది సార్.. ఆ అరుపు చూస్తుంటే ఏదో పులి గాండ్రింపులా ఉంది!” అన్నాడు ఆ రీసెర్చ్ కమిటీ మెంబర్.

“నీ పేరేంటయ్యా..?” అడిగాడు ఈశ్వర్.

“ఆంజనేయప్రసాద్...”

“ఎవడయ్యా నీకు ఆ పేరుపెట్టింది? అంత ధైర్యవంతమైన హనుమంతుని పేరు పెట్టుకొని భయపడుతున్నావేంటి.. పడుకో..!” అన్నాడు.

ఈసారి అరుపు మరింత బిగ్గరగా దిక్కులు పిక్కటిల్లేలా వినిపించింది.

“ఏంటబ్బా..” అని టార్చ్ లైట్ ఆన్ చేసి చూసారు అందరూ.., ఎదురుగా రెండు పెద్దపులులు కనిపించాయి

ఇక ఒక్కరుకూడా అక్కడ ఉండకుండా ఎవరిదారిన వారు పరిగెత్తారు.!!

“ఏంటయ్యా..ఇండియాలో పులులు అంతరించిపోతున్నాయని చెప్పారు.ఇదేంటి మనం పిలవకుండానే ఇలా ఒకటికి రెండు పులులొచ్చాయ్..?” పరిగెడుతూనే ఆంజనేయప్రసాద్ ను అడిగాడు ఈశ్వర్..!

“ఏమో సార్... ముందు పరిగెత్తండి..” అని చాలా దూరం ఆ అడవిలో దారి కనబడినంత మేర పరిగెత్తారు.చివరికి ఒక చెట్టు కనబడితే ఎలాగోలా ఆ చెట్టునెక్కి కూర్చున్నారు ఇద్దరూ.!!

ఇక ఆ రాత్రంతా నిద్ర లేకుండా అక్కడే కూర్చున్నారు.!

“అవునూ.., ఇంతకూ మిగతా ముగ్గురూ ఏమయ్యారు..?” మెల్లగా అడిగాడు ఈశ్వర్.

“వాళ్ళు దారి తప్పినట్లున్నారు సార్” అన్నాడు ఆంజనేయప్రసాద్.

'పోనీలే నువ్వైనా ఉన్నావ్' అనుకున్నాడు.!

ఈశ్వర్ కు ఎందుకో దినేష్ గుర్తొచ్చాడు. 'పాపంవాడెన్ని కష్టాలు పడుతున్నాడో' అనుకొన్నాడు.

అతికష్టం మీద ఇద్దరూ ఆ రాత్రి నిద్రను ఆపుకొని కూర్చున్నారు.

సరిగ్గా ఇదే సమయానికి ....

అక్కడ దినేష్ రాత్రిని కూడా లెక్కచేయకుండా ముందుకు దూసుకుపోతున్నాడు..!

యుగంధర్ తన ఇరవైమంది మనుషులతో కలిసి ఆ రాత్రిపూటకూడా నడుస్తున్నాడు...!!

అందరూ తమ కర్తవ్యం వైపే దృష్టి సారిస్తున్నారు..అజయ్ తో సహా...!

అవును మరి.నిజానికి ఈశ్వర్ ను తరిమింది నిజమైన పులులు కావు.! పులి వేషంలో ఉన్న అజయ్ మనుషులు.!

వాళ్ళు మిగతా రీసెర్చ్ కమిటీ మెంబర్స్ ని పట్టుకున్నారు.!!

అలా దినేష్,ఈశ్వర్,యుగంధర్ ల చుట్టూ వారికి తెలియకుండానే ఉచ్చు బిగుసుకుంటోంది.

********************************

నిన్న రాత్రి జరిగిన సంఘటనలో ఈశ్వర్ మొబైల్ ఎక్కడో పడిపోయింది.!

ఇక ఆంజనేయప్రసాద్ మొబైల్ లో సిగ్నల్స్ లేవు.!!

ఎలాగైనా సరే దినేష్ ను వీలైనంత తొందరగా చేరుకోవాలని ఈశ్వర్ చాలా వేగంగా ముందుకు కదులుతున్నాడు

కంబాలకొండ మరీ దట్టమైన అడవేమీ కాదు..! కాకపోతే సరైన దారిలేకపోవడంవలన చాలా ఇబ్బంది పడుతున్నాడు ఈశ్వర్.

ఇటుపక్క యుగంధర్ తన చెల్లెలి పరిస్థితి గురించే ఆలోచిస్తున్నాడు.

పైకి ఇలా ధైర్యంగా ఉన్నాడేగానీ హన్విత కోమాలోకి వెళ్ళిపోయిందన్న విషయం తెలియగానే యుగంధర్ సగం జీవంకోల్పోయినవాడిలా తయారయ్యాడు.

అయితే ఇరవైమంది మనుషులు ఉండటం వలన యుగంధర్ ముందుకు సాఫీగా సాగిపోవడానికి అది చాలా హెల్ప్ అవుతోంది.

ఇంకొద్ది దూరం వెళ్లగానే చిన్న గుడిసెలు కనిపించాయి.!

యుగంధర్ కి తెలుసు.కంబాలకొండ అడవిమొత్తానికి ఒకే గ్రామం ఉంది.ఆ గ్రామంలోనే 'నెర్వ్ ఆస్తమా' ను నయం చేయగల ఉమ్మెత్త పూలు ఉన్నాయని.

కానీ ఇక్కడ గల రెండు మూడు గుడిసెలు యుగంధర్ ను అయోమయానికి గురిచేశాయి

ముందుగా తన మనుషులను ఆ గుడిసెల వైపు పంపించాడు యుగంధర్.

యుగంధర్ మనుష్యులు నెమ్మదిగా ఆ గుడిసెల వైపు నడుచుకుంటూ వెళ్ళారు.

ఒక్కసారిగా గుడిసె ద్వారాలను తెరచి చూశారు.అయితే చిత్రంగా అక్కడెవ్వరూ లేరు.!

ఆ గుడిసెలను దాటుకున్నాక చాలా స్పష్టంగా ఓ దారి కనబడింది.

బహుశా ఈ దారిలోనే వెళ్ళాలేమో అనుకొని ఆ దారి లోనే నడక కొనసాగించాడు యుగంధర్.

********************************

దినేష్ అస్సలు విశ్రాంతి అనేది లేకుండా ముందుకు దూసుకుపోతున్నాడు.

అయితే అదే అతనిపాలిట శాపమవుతుందని అతడు ఊహించలేదు.!

కొద్ది దూరం వెళ్ళాక ఎవరో కొంతమంది మనుషులు ఎదురుగా వస్తూ కనబడ్డారు.

ఆ మనుష్యుల సంఖ్య దగ్గరయ్యే కొద్దీ పెరుగుతోంది.!!

ఐదు..పది..ఇరవై..నలభై...యాభై మంది దాకా మనుషులు ఎదురుగా నిలబడ్డారు.....!

'అసలెవరు వీరు?' అని ఆలోచించాడు దినేష్.

ఇంతలో “హల్లో మిస్టర్ దినేష్...వెల్ కమ్...” అంటూ ఓ గొంతు వినబడింది.!ముందున్న మనుష్యుల మధ్యగా అజయ్ బయటకు వచ్చాడు.!!

అసలే దినేష్ కు ఓపిక తక్కువ.!

అలాంటిది తను వెళ్ళేదారిలో అడ్డంగా నిలబడటంతో దినేష్ కు కోపమొచ్చింది.

అజయ్ కర్కశంగా ఓ నవ్వు నవ్వి.. “ఎప్పటికైనా ఆ మెడిసిన్ నా...” అంటూ ఏదో చెప్పబోయాడు

అయితే ఇంతలోనే దినేష్ “ఆపు...” అన్నాడు.!!

“నీతో ముచ్చట్లు పెట్టుకోవడానికి నాకు టైమ్ లేదు.వచ్చిన పనేంటి..? నన్ను ఆపడానికేగా? మరి రా...” అంటూ ముందుకు దూసుకెళ్ళాడు.!

ఒక్కసారిగా అలా దినేష్ ముందుకు రావడంతో అజయ్ కంగారుపడ్డాడు.

దినేష్ నేరుగా ముందుకు దూసుకెళ్లి దొరికిన వారిని దొరికినట్లు చితగ్గొట్టసాగాడు

ఒకటి..రెండు.. మూడు..ఇలా ఓ ఎనిమిది మందిని కొట్టగలిగాడు గానీ అసలే అలసిపోయిన శరీరం కావడంతో దినేష్ ఇక తనవళ్ళ కానట్లు కింద కూర్చుండిపోయాడు.!!

ఈసారి అజయ్ కు నిజంగానే మెంటలెక్కింది

'ఎవడ్రా వీడు మాటైనా వినకుండా మీదపడ్డాడు..,ఇప్పుడేమో ఇక శక్తి లేనట్లు కిందపడిపోయాడు' అనుకున్నాడు మనస్సులో...

దినేష్ కు నీరసంతో స్పృహ తప్పింది.!

********************************

కొద్ది దూరం వెళ్లగానే యుగంధర్ తను వెళ్తున్న దారి తప్పని గ్రహించాడు.

ఎవరో తమని ట్రాప్ చేయడానికి ఆ దారిని క్రియేట్ చేసినట్లు యుగంధర్ కు అర్థమైంది.

ఇక అక్కడినుండి ఎంత వేగంగా వచ్చాడో అంతే వేగంగా ముందు గుడిసెలున్న ప్రాంతానికి వచ్చాడు.

అయితే చిత్రంగా..అక్కడ ఇప్పుడు గుడిసెలు లేవు.!

గుడిసెలే కాదు.అక్కడ గుడిసెలున్నట్లు కనీసం ఆనవాళ్ళు కూడా లేవు.!!

మరేం ఆలోచించకుండా వేరే దారిలో ముందుకు సాగిపోయాడు యుగంధర్.అతని మెదడులో ఆలోచనలు గిర్రున తిరుగుతున్నాయి.

********************************

ఇటువైపు ఈశ్వర్ చాలా వేగంగా దినేష్ ను సమీపిస్తున్నాడు.

అయితే ఈశ్వర్ కి తెలియని విషయం ఏంటంటే ఈశ్వర్ కు తెలియకుండా ఓ పదిమంది అజయ్ మనుషులు రహస్యంగా ఈశ్వర్ నువెంబడిస్తున్నారు.!!

కొద్దిదూరం వెళ్ళగానే ఎవరో తమని ఫాలో అవుతున్నట్లు ఈశ్వర్ గ్రహించాడు.!

ఇప్పుడు అక్కడ ఈశ్వర్ తో పాటూ కేవలం ఆంజనేయప్రసాద్ మాత్రమే ఉన్నాడు. అందుకే ఈశ్వర్ రిస్క్ చేయదలుచుకోలేదు.

మెల్లగా అటూ ఇటూ తిరగడం మొదలెట్టాడు.!

ఆంజనేయప్రసాద్ కు ఈశ్వర్ ఏంచేస్తున్నాడో అర్థం కావట్లేదు.!

అటుతిప్పీ.., ఇటుతిప్పీ చివరికి అజయ్ మనుషులను దారి తప్పేట్లు చేశాడు ఈశ్వర్.!!

********************************

అక్కడ యుగంధర్ తాను సరైన దారిలోనే వెళ్తున్నాడని గ్రహించాడు.!

వీలైనంత తొందరగా ఆ గ్రామాన్ని చేరుకోవాలని ముందుకు సాగిపోయాడు యుగంధర్.

అతడి మెదడులో ఒకే ఆలోచన గిర్రున తిరుగుతోంది.'తన ప్రాణంపోయినా పర్లేదు.హన్విత ప్రాణాలతో ఉండాలి.'

అందుకే 'విశ్రాంతి' అనే మాటకి అర్థం తెలియకుండా ముందుకెళ్ళిపోతున్నాడు యుగంధర్.

********************************

ఇక్కడ దినేష్ కళ్లు తిరిగి కిందపడిపోవడంతో అజయ్ కంగారుపడ్డాడు.

అయితే అక్కడున్న ఎవరికీ తెలియని విషయం ఏంటంటే...దినేష్ విశ్రాంతి తీసుకుంటున్నాడు.!

ఇక దినేష్ ను అలాగే ఉంచితే తిరిగి లేచిన తర్వాత అతడ్ని ఆపడం కష్టం అని భావించిన అజయ్ దినేష్ ను తాళ్ళతో కట్టివేయమని తన అనుచరులకు చెప్పాడు.!

వాళ్ళు దినేష్ ను బంధించడానికి ముందుకు రాసాగారు..

దినేష్ లో ఏ చలనమూ లేదు..

********************************

అజయ్ అనుచరులు దినేష్ కు చాలా దగ్గరగా వచ్చారు.

అప్పుడు జరిగిందా సంఘటన.ఎవరూ ఊహించని రీతిలో..!

అప్పటిదాకా శవంలా పడున్న దినేష్ ఒక్కసారిగా పైకి లేచి తనవైపుగా వచ్చిన ఇద్దరు మనుషులను చెరో దెబ్బతో మట్టికరిపించాడు.!

దాంతో అజయ్ కోపం తారాస్థాయికి చేరింది.!!

“చంపేయండ్రా వీడ్ని...” అని మిగతా అనుచరులకు సైగ చేశాడు.

అందరూ ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చారు.

దినేష్ బెదరలేదు.తెగించి ముందడుగేశాడు.!

తనవలన సాధ్యమైనంత వరకు వచ్చిన వారందరిమీదా తన బలాన్నంతా ప్రయోగించి చితగ్గొట్టడం మొదలుపెట్టాడు.

ఫలితం..కొన్ని క్షణాల్లోనే పన్నెండు మంది నేలకూలారు...!!

అజయ్‌కు అప్పుడర్థమైంది.'ఈ దినేష్ అన్నింటికీ తెగించే వచ్చాడని'.

కానీ మొత్తం మనం అనుకున్నట్లే జరిగితే అది జీవితం ఎలా అవుతుంది.. ? !

********************************

ఈశ్వర్ దృష్టంతా తన తమ్ముడి మీదే ఉంది.! అతని ఆలోచనంతా ఇప్పుడు తన తమ్ముడికి ఏమీ జరగకుండా చూసుకోవాలనే ఉంది.

ఇటుపక్క యుగంధర్ పరిస్థితి కూడా అంతే...ఎలాగైనా సరే తన చెల్లెలిని కాపాడుకోవాలి.

ఇద్దరూ 'అన్న' అనే పదానికి ఉన్న బాధ్యతను భుజాలపై వేసుకున్నారు కాబట్టే తమ తమ దారుల్లో వేగంగా దూసుకుపోతున్నారు.

ఓ గంటపాటు నిర్విరామంగా ఆంజనేయప్రసాద్ తో పాటు ముందుకు సాగిపోయిన ఈశ్వర్ కొద్ది దూరంలో ఏవో శబ్దాలు రావడంతో తన నడక వేగాన్ని హెచ్చించాడు.

ఇటు యుగంధర్ కూడా అతి వేగంగా ముందుకు సాగిపోయాడు.

ఇంకొద్ది దూరం వెళ్లగానే ఏవో ఆర్తనాదాలు వినబడటంతో నడక వేగాన్ని పెంచాడు యుగంధర్.

********************************

ఈశ్వర్ దృష్టంతా తన తమ్ముడి మీదే ఉంది.! అతని ఆలోచనంతా ఇప్పుడు తన తమ్ముడికి ఏమీ జరగకుండా చూసుకోవాలనే ఉంది.

ఇటుపక్క యుగంధర్ పరిస్థితి కూడా అంతే...ఎలాగైనా సరే తన చెల్లెలిని కాపాడుకోవాలి.

ఇద్దరూ 'అన్న' అనే పదానికి ఉన్న బాధ్యతను భుజాలపై వేసుకున్నారు కాబట్టే తమ తమ దారుల్లో వేగంగా దూసుకుపోతున్నారు.

ఓ గంటపాటు నిర్విరామంగా ఆంజనేయప్రసాద్ తో పాటు ముందుకు సాగిపోయిన ఈశ్వర్ కొద్ది దూరంలో ఏవో శబ్దాలు రావడంతో తన నడక వేగాన్ని హెచ్చించాడు.

ఇటు యుగంధర్ కూడా అతి వేగంగా ముందుకు సాగిపోయాడు.

ఇంకొద్ది దూరం వెళ్లగానే ఏవో ఆర్తనాదాలు వినబడటంతో నడక వేగాన్ని పెంచాడు యుగంధర్.

********************************

ఈశ్వర్ దృష్టంతా తన తమ్ముడి మీదే ఉంది.! అతని ఆలోచనంతా ఇప్పుడు తన తమ్ముడికి ఏమీ జరగకుండా చూసుకోవాలనే ఉంది.

ఇటుపక్క యుగంధర్ పరిస్థితి కూడా అంతే...ఎలాగైనా సరే తన చెల్లెలిని కాపాడుకోవాలి.

ఇద్దరూ 'అన్న' అనే పదానికి ఉన్న బాధ్యతను భుజాలపై వేసుకున్నారు కాబట్టే తమ తమ దారుల్లో వేగంగా దూసుకుపోతున్నారు.

ఓ గంటపాటు నిర్విరామంగా ఆంజనేయప్రసాద్ తో పాటు ముందుకు సాగిపోయిన ఈశ్వర్ కొద్ది దూరంలో ఏవో శబ్దాలు రావడంతో తన నడక వేగాన్ని హెచ్చించాడు.

ఇటు యుగంధర్ కూడా అతి వేగంగా ముందుకు సాగిపోయాడు.

ఇంకొద్ది దూరం వెళ్లగానే ఏవో ఆర్తనాదాలు వినబడటంతో నడక వేగాన్ని పెంచాడు యుగంధర్.

********************************

దినేష్ ఆ పన్నెండుమందిని కొట్టగలిగాడు గానీ అజయ్ చేతిలో తిన్న ఆ దెబ్బ అతడ్ని దాదాపు శక్తి మొత్తం కోల్పోయేలా చేసింది.!

ఒక్కసారిగా అదుపుతప్పి దూరంగా పడ్డాడు దినేష్.

అతి కష్టం మీద లేచి నిలబలిగడిగాడు గానీ........... దినేష్ పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది.

అజయ్ ఏమాత్రం జాలి చూపించలేదు.తన చేతిలో ఉన్న కత్తి తీసి బలంగా దినేష్ కు గుచ్చబోయాడు.

అయితే ఓ దృఢమైన హస్తం అతని చేతిని ముందుకుపోనివ్వకుండా ఆపింది.!

ఏమైందో అర్థం కాక వెనుక చూశాడు అజయ్.ఈశ్వర్ కళ్ళు ఆవేశంతో ఎర్రబడి ఉన్నాయి.!!ఆ కత్తిని లాక్కొని దూరంగా విసిరిపారేశాడు ఈశ్వర్.!

“వాడి మీద చెయ్యి వేసేముందు వాడికి ఒక అన్న ఉన్నాడన్న విషయాన్ని ఎలా మరిచిపోయావ్ రా..?” చేతిని మెలిపెడుతూ కోపంగా అడిగాడు ఈశ్వర్.ఛాతీమీద బలంగా ఓ దెబ్బ వేశాడు.

దాంతో అజయ్ కిందపడ్డాడు.దినేష్ ఈ చర్యకి విస్తుపోయాడు.!

“నేను ముందే చెప్పాను కదరా నా జోలికి రావొద్దని...ఇక్కడ నేనంటే నేను మాత్రమే కాదు.., మా తమ్ముడు కూడా...” అని ఎదురుగా వచ్చిన ఇంకో ఇద్దరినీ తన బలంకొద్దీ బాదాడు.వాళ్ళు తిరిగి లేవలేదు.!

దినేష్ కు ఈశ్వర్ ఎందుకో ఈరోజు చాలా కొత్తగా కనబడుతున్నాడు

“వాడికి చిన్న దెబ్బ తగిలితే వాడు తట్టుకోగలడేమోగానీ వాడి అన్నను నేను తట్టుకోగలనని ఎలా అనుకున్నార్రా..?” అని వచ్చిన వారిని వచ్చినట్లు చితకబాదాడు.

“వాడిమీద చెయ్యివేయాలంటే ముందు ఈ గుండెలో చలనం ఆగిపోవాలి.” అంటూ అక్కడున్న మిగతావారిపై విరుచుకుపడ్డాడు.

ఈశ్వర్ ని చూడగానే ఎందుకో మిగతావారికి చాలా భయం వేసింది.!

అందుకే అజయ్ అనుచరులంతా అక్కడినుండి పరిగెత్తారు.!

అజయ్ కి కూడా ఇక అక్కడ ఉంటే ఈశ్వర్ చంపేస్తాడేమో అని భయం వేసింది.దాంతో అక్కడనుండి అతికష్టం మీద తప్పించుకున్నాడు

ఈశ్వర్ వచ్చి దినేష్ ను పైకి లేపాడు.

“ఇప్పుడెలా ఉంది..?” అడిగాడు.

“పర్లేదన్నయా...అంత నొప్పిగా ఏం లేదు..” అన్నాడు దినేష్.

చాలా నెమ్మదిగా ముందుకు నడకను కొనసాగించాడు.

ఎందుకో దినేష్ ఈశ్వర్ తో మాట్లాడలేకపోతున్నాడు.

తన మీద అన్నయ్య అధికారాన్ని చెలాయిస్తున్నాడనుకున్నాడేగానీ.., తనంటే ఇంత ఇష్టమని దినేష్ కు తెలియలేదు.

కొద్దిసేపు నిశ్శబ్దం గా ముందుకు సాగిపోయాడు.

ఉన్నట్లుండి “అన్నయ్యా సారీ..” అన్నాడు దినేష్.

ఈశ్వర్ కు అర్థం కాలేదు. “సారీ ఎందుకు.?”

“ ఇన్నాళ్లూ నిన్ను అనవసరంగా చాలా ఇబ్బంది పెట్టాను....” .అంటూ ఇంకేం చెప్పలేకపోయాడు.

ఈశ్వర్ దినేష్ భుజంపై చెయ్యి వేస్తూ “రేయ్..నువ్వు నా తమ్ముడివిరా.., నన్ను ఇబ్బంది పెట్టాలంటే నువ్వు..నిన్ను ఇబ్బంది పెట్టాలంటే నేను..మధ్యలో వాడెవడు గొట్టంగాడు... పదా..!” అన్నాడు చాలా నార్మల్ గా.

ఆంజనేయ ప్రసాద్ కు వీరి అనుబంధం చూసి ముచ్చటేసింది.

ఇంకొద్ది దూరం వెళ్ళగానే యుగంధర్ వీరితో పాటూ జాయినయ్యాడు.

“ఆ ఉమ్మెత్తపువ్వు సంగతి మాకొదిలేయండి. మీరు అర్జెంటుగా హాస్పిటల్ కు బయలుదేరండి.” అన్నాడు దినేష్.!

దినేష్ ఏం మాట్లాడుతున్నాడో అక్కడున్న ఎవ్వరికీ అర్థం కాలేదు.

“ఎందుకు..? హాస్పిటల్ దగ్గర అమ్మానాన్నా ఉన్నారు..” అన్నాడు యుగంధర్.

“నీకు అసలు విషయం అర్థం కావట్లేదు..,ఆ అజయ్ గాడు ఇక్కడినుండి తప్పించుకున్నాడు.అంటే ఖచ్చితంగా వాడిప్పుడు హాస్పిటల్ వెళ్ళుంటాడు.వాడిదసలే క్రిమినల్ బ్రెయిన్.

“ఈ టైమ్ లో మీరక్కడుండటం చాలా అవసరం...” అన్నాడు.

ఈశ్వర్ కూడా దినేష్ చెప్పింది సరైనదే అన్నాట్లు తలూపాడు.

యుగంధర్ దినేష్ చేతులు పట్టుకొని.. “ నిన్ను నమ్మి వెళ్తున్నాను.నా చెల్లిలి ప్రాణం..,నీ చేతుల్లో ఉంది.” అనేసి వెనక్కు తిరిగాడు.

ఈశ్వర్, దినేష్ లు ఆంజనేయప్రసాద్ ను కూడా యుగంధర్ తో పాటూ పంపించేశారు.

“సర్..మీరిద్దరే..” అంటూ ఏదో అనబోయిన ఆంజనేయ ప్రసాద్. “మేమిద్దరే కాదయ్యా.మేము ఇద్దరున్నాం..,” అన్న ఈశ్వర్ మాట తో మరో మాట మాట్లాడకుండా బయలుదేరాడు ఆంజనేయప్రసాద్.

ఆ రోజు రాత్రంతా నడకను కొనసాగించారు.

“నాకో విషయం చెప్పు.” అన్నాడు ఈశ్వర్.

“ఏంటన్నయ్యా..” అడిగాడు దినేష్.

“నీకు హన్వితంటే ఇష్టం కదా.. ఫ్రాంక్ గా చెప్పు..” అన్నాడు.

ఇప్పటిదాకా ఎవ్వరికీ చెప్పని మాట...., ఎన్నో సార్లు చెప్పాలనుకున్న మాట.., గుండె లోతుల్లోనుంచి తన్నుకొచ్చిన మాట.., కనీసం తన ఫ్రెండ్స్ దగ్గర కూడా చెప్పని మాట...

ఎందుకో అన్న ముందు చెప్పాలనుకున్నాడు.

“ఇష్టం కాదన్నయ్యా..ప్రాణం..” అన్నాడు.“నాకు తెలుసు..!” అంటూ దినేష్ భుజంపైన చెయ్యి వేసి ముందుకు కదిలాడు ఈశ్వర్.

ఓ పదకొండుగంటల ప్రాంతంలో నిద్రను ఆపుకోలేక ఓ చెట్టుకింద ఇద్దరూ నిద్రకుపక్రమించారు.అసలే అలసిపోయిన శరీరాలు కావడంతో తొందరగా నిద్ర పట్టేసింది.

మరుసటిరోజు పొద్దున కళ్ళు తెరచి చూసేటప్పటికి వొళ్ళంతా ఏదో అసౌకర్యంగా అనిపించింది.

ఎందుకో చేతులు పైకి లేవట్లేదు.కాళ్ళు కదిలించాలన్నా చాలా కష్టంగా ఉంది.!

తమని తాళ్ళతో బంధించారని తెలుసుకొనేసరికి ఈశ్వర్ , దినేష్ లకు చాలా సేపు పట్టింది. !!

********************************

ఎదురుగా గిరిజన ప్రజలంతా విచిత్రమైన హావభావాలతో కనబడ్డారు..!

దినేష్ ., ఈశ్వర్ లకు అంతా అయోమయంగా ఉంది.వాళ్ళను కూడా ఆ గిరిజనులు అయోమయంగానే చూస్తున్నారు.!

ఇంతలో ఒక పెద్దాయన వాళ్ళందరి ముందుగా వచ్చాడు.

'ఓహో ! బహుశా ఈయనే వీరి నాయకుడై ఉంటాడు' అనుకున్నాడు దినేష్.

“చెప్పండి..ఎవరు మీరు..?"అడిగాడా పెద్దాయన.

ఆయన భాష చాలా స్పష్టంగాఉండటం దినేష్ ను ఆశ్చర్యానికి గురి చేసింది.

వాళ్ళతో తాము ఎందుకొచ్చాము.., ఎలా వచ్చాము ఇలా ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్లు వివరించాడు దినేష్.

“మాకు ఆ పువ్వు కావాలి..అది లేకపోతే హన్విత బ్రతకదు..” అంటూ చెప్పడం పూర్తిచేశాడు దినేష్.

ఈశ్వర్‌కు దినేష్ మొహం చూడగానే చాలా బాధేసింది.

చిన్నప్పటి నుంచీ ఏ విషయానికీ దినేష్ ఇంతగా బాధపడి ఉండడు.అలాంటిది చిన్నపిల్లాడిలా ఇలా ఎమోషనల్ అవుతున్నాడంటే హన్వితను ఎంతగా ప్రేమించాడో ఈశ్వర్ కు అర్థమైంది

ఆ పెద్దాయన కాసేపు ఆలోచించి “అంటే మీరనేది ఆపువ్వు గురించేనా...?” అని ఎదురుగా ఉన్న తమ గ్రామ దేవత పాదాల దగ్గర ఉన్న పువ్వుని చూపించాడు ఆ పెద్దాయన.

దాన్ని చూడగానే దినేష్ కళ్ళు మెరిశాయి.!

ఓ ఒలింపిక్ రన్నర్ తన గమ్యాన్ని చేరినట్లు.., ఓ క్రికెటర్ సెంచరీ సాధించినట్లు.., ఓ హీరో తనసినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టినట్లు ఇలా ఏదో అద్భుతాన్ని సాధించిన్నట్లు అప్రతిభుడై ఉండిపోయాడు దినేష్.!

“ఆ.. అదే..! నేను ఇంటర్నెట్ లో చూశాను.అదే పువ్వు..” అదే ఆశ్చర్యంతో అన్నాడు దినేష్ ..

ఆ మాటలతో పెద్దాయన భృకుటి ముడిపడింది.!

“మేము ఇస్తాంసరే.., కానీ మీకెందుకు ఇవ్వాలి..?” అన్నాడాయన.

ఆయన మాటలు అన్నదమ్ములిద్దరికీఅర్థం కాలేదు.

తిరిగి ఆ పెద్దాయనే చెప్పడం కొనసాగించాడు. “ఇంతకుముందు కూడా చాలామంది మనుషులు ఇక్కడికి రావడానికి ప్రయత్నించారు.ఓ ఇద్దరు ముగ్గురు వచ్చారుకూడా.కానీమేమెవ్వరికీ ఆపువ్వు ఇక్కడ ఉందన్న విషయం కూడా చెప్పలేదు.ఎందుకో తెలుసా..?”

ఎందుకన్నట్లు చూశాడు దినేష్.

“మా జీవనాధారం ఆ ఉమ్మెత్తపువ్వులే కాబట్టి.” అన్నాడా పెద్దాయన.!

దినేష్ ఆ మాటలకు అదిరిపడ్డాడు

“మేము పూజించే దేవతకు ఈ పూలంటే చాలా ఇష్టం.రోజూ ఒక పువ్వుని ఆమె పాదాల వద్ద ఉంచే మేము ఏపనైనా మొదలుపెడతాము. అలాంటిది ఆ పుష్పాన్ని మీకివ్వాలంటే...” అని కాసేపు ఆగాడు.

తిరిగి ఆ పెద్దాయనే “మా దేవతకు ఎవర్నైనా బలివ్వాలి....” అంటూ చెప్పడం పూర్తి చేశాడు.!

కాసేపు దినేష్ కు ఏమీ అర్థం కాలేదు.!

“బలివ్వడమేంటి..?” అన్నాడు.

“అంతే.... పువ్వు కావాలంటే బలివ్వడం తప్పనిసరి” అన్నాడా పెద్దాయన.!

అన్నదమ్ములిద్దరికీ నోటమాటరాలేదు.!!

********************************

సరిగ్గాఇదేసమయానికి ...

SMG హాస్పిటల్స్ ...

మూడు సుమోలతో నేరుగా హాస్పిటల్ లోపలికి ప్రవేశించాడు అజయ్.! అయితే అతడూహించని దృశ్యం అక్కడ అతడ్ని షాక్ కు గురి చేసింది.!!

చేతిలో రాడ్ పట్టుకొని తల వంచుకొని అటూ ఇటూ తిరగసాగాడు యుగంధర్...! కోటను కాపలా కాసే సైనికుడిలా ఉన్నాడతను.!!

అజయ్ కారు నుంచి కిందకు దిగాలని ట్రై చేశాడుగానీ యుగంధర్ విసిరిన రాడ్ అజయ్ కారు అద్దాలను పగలగొట్టింది!

ఇక అక్కడ ఒక్క క్షణం ఉన్నా తనప్రాణం పోవడం ఖాయమని అజయ్ కు అర్థమైంది.! దాంతో వేగంగా కార్ ను వెనక్కు తిప్పాడు అజయ్.

అయితే యుగంధర్ అజయ్ ను వదిలిపెట్టదలుచుకోలేదు.

తన మనుష్యులతో అజయ్ కారుని వెంబడించమని పంపించాడు.!

ఫలితం..అజయ్ ప్రయాణిస్తున్న కారు తప్ప మిగతా సుమోల్లోని తన మనుష్యులందరూ యుగంధర్ మనుష్యుల చేతికి చిక్కారు.!!

ఈ ఓటమి ని అజయ్ అంత తొందరగా ఒప్పుకోలేకపోయాడు.

దీనంతటికీ కారణమైన ఆ హన్విత బ్రతక్కూడదని ఫిక్స్ అయ్యాడు.!!

ఎలాగైనా సరే దినేష్,ఈశ్వర్ లను అడ్డుకొని ఆ ఉమ్మెత్తపువ్వుని ఈ హాస్పిటల్ కి చేరకుండా చేయాలని అనుకున్నాడు.

వెంటనే తన మొబైల్ నుండి తన కంపెనీకి ఫోన్ చేశాడు.అవతలి నుండి “ చెప్పండి సర్..” అన్న గొంతు వినబడింది.

“ఓ హెలికాప్టర్ కావాలి.అరేంజ్ చేయండి..” అన్నాడు.!!!

********************************

“మీకు సాయంత్రం దాకా ఆలోచించుకునేందుకు సమయం ఉంది...అప్పటిలోగా మీ అభిప్రాయం చెప్పండి.బయటి వాళ్ళని ఎక్కువసేపు మాగ్రామంలో ఉంచటం మాకు ప్రమాదం..” అన్నాడు ఆ పెద్దాయన.

వాళ్ళిద్దరి కట్లూ విప్పదీసారు.

దినేష్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. !

ఈశ్వర్ అంతకంటే తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.!!

దినేష్ గురించి ఈశ్వర్ కి బాగా తెలుసు.! వాడిదసలే చాలా మొండి వైఖరి.ఏదైనా అనుకున్నాడంటే అది జరిగి తీరాల్సిందే.

ఈశ్వర్ మైండ్ లో ఆలోచనలు చాలా వేగంగా కదులుతున్నాయి.

'బలివ్వడం ఏంటి..?' అనుకున్నాడు మనస్సులో..

తమ్ముడి కోసం తానేం చేయడానికేనా సిద్ధమే..కానీ చావు ఎప్పుడూ చివరి ఆప్షనే...!! అన్ని దారులూ మూసుకుపోయి.., ఇక వేరే దారే లేదన్నప్పుడు.., తనకోసం ఎవరూ భూమిపైన బాధపడేవారు లేరు అని క్లారిటీ వచ్చినప్పుడు కూడా చావు ఆప్షన్ కాదు.!!

ఎందుకంటే చావుని మనం సెలెక్ట్ చేసుకోకూడదు...దానంతట అదే మనల్ని సెలెక్ట్ చేసుకోవాలి.!

కాబట్టి వేరే ఉపాయం ఏదైనా ఉందేమో అని ఆలోచిస్తున్నాడు ఈశ్వర్.

ఓ నిర్ణయానికి వచ్చాడన్నట్లుగా “నేను వెళతాను..” అన్నాడు ఈశ్వర్.

“ఎక్కడికి..?” అన్నాడు దినేష్

“ నువ్వు నన్నిక్కడ వదిలేసి ఆ ఉమ్మెత్తపువ్వుని తీసుకొని వెళ్ళు.నేను వీళ్ళని ఎలాగోలా హ్యాండిల్ చేస్తాను.” అన్నాడు.

ఆమాటలకు దినేష్ ఒప్పుకోలేదు.

“వద్దన్నయ్యా అది చాలా రిస్క్..నేను వెళ్ళగానే వాళ్ళు నిన్ను చంపేస్తారు.” అన్నాడు దినేష్

“నువ్వే చెబుతుంటావ్ గా రిస్క్ ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తీసుకుంటాం అని.” అన్నాడు ఈశ్వర్.

“అప్పుడు వేరు ఇప్పుడు వేరు.కావాలంటే నేను ఇక్కడే ఉంటా... నువ్వెళ్ళు.ఎందుకంటే రిస్క్ తీసుకోవడం నాకు అలావాటే కాబట్టి పెద్దగా టెన్షన్ ఏమీ ఉండదు.” అన్నాడు.

“జీవితంలో ఒక్కసారైనా ఈ అన్న మాట విను.నాకేం కాదన్నానుగా..నువ్వు ఆ ఉమ్మెత్తపువ్వు తీసుకెళ్ళు.” అన్నాడు ఈశ్వర్.

దినేష్ ఇంకేమీ మాట్లాడలేకపోయాడు.

'అన్న తనతోపాటూ ఉండేటప్పుడు అతని విలువ తెలియలేదు.ఇప్పుడు అన్న అనే పదానికున్న విలువ తెలిశాక అన్నయ్యే దూరమవుతున్నాడు.ఛ..' అనుకున్నాడు.

బయటి నుంచి వీరిని ఆ పెద్దాయన గమనిస్తున్నాడు.!!!

సాయంత్రమైంది ...

ఈశ్వర్ చాలా నిశ్శబ్దంగా ముందుకు కదిలాడు.

దినేష్ “అన్నయ్యా..ఇప్పటికైనా మించిపోయింది లేదు.నామాట విను” అంటున్నాడు.

ఈశ్వర్ ఇవేమీ వినే స్థితిలో లేడు.మెల్లగా ముందుకు కదిలాడు.

ఆ పెద్దాయిన ఈ అన్నదమ్ములనే కన్నార్పకుండా చూస్తున్నాడు. ఇంతలో ఏదో తుఫాను అలజడి రేగినట్లు చెట్లన్నీ గాలికి ఊగడం మొదలుపెట్టాయి. !

ఓ రెండు నిమిషాల అలజడి తర్వాత అంతా నిశ్శబ్దం గా మారింది.!!

“ అమ్మా..” అన్న అరుపు వెనువెంటనే రెండు సార్లు వినబడి ఆ నిశ్శబ్దానికి భంగం కలిగించింది.!

అజయ్ కాల్చిన బుల్లెట్లు ఆ గ్రామ ప్రజలిద్దరి గుండెల్లో దూసుకుపోవడంతో వారు నేలకొరిగారు.!!

ఊహించని ఈ పరిణామానికి ఏంచేయాలో అక్కడున్న పెద్దలకు పాలుపోలేదు. ఆ బుల్లెట్ల శబ్దం వినగానే ఆ గ్రామప్రజలందరూ ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళి తలుపేసుకున్నారు.!

అజయ్‌ను చూడగానే దినేష్ రక్తం సలసలా మరిగింది.

ఇక తన కళ్ళ ముందే ఇద్దరు అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోవడంతో ఆ అన్నదమ్ములిద్దరూ సహనం కోల్పోయారు.

అజయ్ తనతో పాటూ ఓ ఇరవై మందిమనుషులతో వచ్చాడు. !

'అక్కడెంతమంది ఉన్నారు..? వారి చేతిలో తుపాకులున్నాయా లేవా..?' ఇలాంటి విషయాలేవీ ఆలోచించలేదు ఆ అన్నదమ్ములు.

నేరుగా అందరిపై విరుచుకుపడ్డారు. ! దొరికినవాడిని దొరికినట్లు చితగ్గొట్టి అందరినీ ఇక లేవకుండా చేశారు.

ఆ అన్నదమ్ముల్లో ఒక్కర్ని హ్యాండిల్ చేయడమే కష్టం. అలాంటిది ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు అజయ్ కి తెలిసొచ్చింది..

అయినా ధైర్యం చేసి ఈశ్వర్ వైపు గురిపెట్టి తుపాకీతో కాల్చాడు అజయ్.

ఆ బుల్లెట్ ఈశ్వర్ చేతిని తాకింది.!!

దాంతో ఈశ్వర్ ఒక్కసారిగా కుదురుకోలేక కిందపడ్డాడు.

ఎప్పుడైతే ఈ దృశ్యాన్ని చూశాడో ఇక దినేష్ సహనం పూర్తిగా నశించింది.పరిగెత్తుకుంటూ ముందుకెళ్ళి నేరుగా ఆ అజయ్ చేతినుండి తుపాకీనీ లాక్కొని వెనక్కితిప్పి అలాగే నాలుగు సార్లు ట్రిగ్గర్ ని నొక్కాడు.!!

రెండో బుల్లెట్ గుండెల్లో దిగేటప్పటికే అజయ్ ప్రాణం గాల్లో కలిసిపోయింది. !

ఆ తర్వాత వెంటనే ఈశ్వర్ దగ్గరకు వచ్చి “అన్నయ్యా నీకేం కాలేదు కదా...” అన్నాడు.

“ఏంలేదు.చేతికి చిన్న దెబ్బ తగిలింది అంతే..” అన్నాడు.

ఇంతలో ఆ గ్రామ ప్రజలు తలుపులు తీసుకొని బయటకు వచ్చారు.

దినేష్ మొహం లో ఆవేశాన్ని గమనిస్తున్నారు అందరూ..

“ఇద్దరు చనిపోయారని బాధగా ఉందా...?” అన్నాడు దినేష్ ఆ ప్రజల్ని ఉద్దేశించి.

అందరూ దినేష్ వైపు చిత్రంగా చూశారు.

దినేష్ చెప్పడం కొనసాగించాడు. “ఇరవైమంది..ఈ వెధవతో కలిసి ఇరవై ఒకటి...పైగా ఒక్కొక్కడు గన్స్ పట్టుకొచ్చారు.వీళ్ళందరినీ ఎదుర్కోగలిగాం.. అలాంటిది మిమ్మల్ని ఎదుర్కోవడంమాకు కష్టమా..?” అన్నాడు.

ఆ గ్రామ ప్రజలంతా తల దించుకున్నారు.

దినేష్ కొనసాగించాడు “కానీ మా ఊహల్లో కూడా ఆ ఆలోచన రాలేదు.అలా ఆలోచిస్తే వాళ్లకి మాకూ తేడా ఏముంటుంది..? కానీ మీరున్నారే..మీకూ వాళ్ళకి పెద్ద తేడా ఏంలేదు” అన్నాడు.

ఆ ప్రజలు ఇక ఏమీ మాట్లాడలేకపోయారు.

దినేష్ చెప్పుకుపోతున్నాడు. “వాళ్ళు అనవసరంగా ఇద్దరు అమాయకుల్ని చంపారు.మీరు కూడా అనవసరంగా ఓ ప్రాణాన్ని తీయాలని చూశారు అంతే తేడా...! కేవలం చంపాలని చూసినందుకే ఇలా ఇద్దరు చనిపోయారు.ఇక నిజంగా చంపి ఉంటే...” అన్నాడు.

అందరూ దినేష్ వైపే కన్నార్పకుండా చూస్తున్నారు.

“ఇప్పుడు అర్థమైందా..? దేవుడెప్పుడూ బలిదానాలని కోరడు..అలా కోరినవారి అంతు చూడాలనే చూస్తాడు.” అన్నాడు.

“ఇప్పటికీ మీరు బలిదానాన్నే కోరుకుంటే నన్నూ మా అన్ననీ కలిపి చంపేయండి.కానీ హన్వితను బ్రతికించండి.! తనకేమీ తెలియదు.....” అంటూ మోకాళ్లమీద నిలబడ్డాడు.

మొదటిసారి దినేష్ లో ప్రేమ కోణాన్ని చూస్తున్నాడు ఈశ్వర్

“తను చాలా అమాయకురాలు.ఎంత అమాయకురాలంటే..,

చిన్న పాప ఏడుస్తుంటే తట్టుకోలేదు..,

ఒక పాప సంతోషం కోసం ముక్కూ మొహం తెలియని వాడికి ఐ లవ్యూ చెప్పడానికైనా సిద్ధపడుతుంది.!...!

తన వలన ఇతరులు సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది...

ఎవరైనా ప్రమాదంలో ఉన్నారని తెలిస్తేవారికన్నా ఎక్కువగా తనే కంగారుపడుతుంది....

తనకు ఇష్టమైన వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది.ఆ జాగ్రత్తలో అవసరమైతే తిడుతుంది, కొడుతుంది..కానీ అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తుంది..” అన్నాడు.

ఈశ్వర్ తమ్ముడివైపే కన్నార్పకుండా చూస్తున్నాడు.

దినేష్ చెప్పిన మాటలు ఆ గ్రామ ప్రజలపై చాలా ప్రభావాన్నే చూపాయి.

ఆ పెద్దాయన ముందుకొచ్చి “మమ్మల్ని క్షమించు బాబూ..ఈ పువ్వులు నిజంగా ఓ మనిషి ప్రాణాన్నే కాపాడతాయంటే అంతకన్నా కావాల్సిందేముంది మొత్తాన్ని పట్టుకుపో...నీ ప్రేమను కాపాడుకో..” అన్నాడు.!

దినేష్ ఆశ్చర్యంగా తల పైకెత్తాడు.

“వెళ్ళు బాబూ...నీకు ఇక ఏ అడ్డూ రాకుండా ఉండాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాం..వెళ్ళిరా..” అన్నాడు .

దినేష్ ఈశ్వర్ ను పైకి లేపి వారికి నమస్కరించాడు. “నాకు నా ప్రేమను గెలిపించుకోవాలన్న ఆశ ఉందిగానీ..., ఇంకేదో చెయ్యాలన్న అత్యాశ లేదు..నాకోసం మీరు మీ సాంప్రదాయాన్ని వదిలిపెట్టాల్సిన అవసరంలేదు..” అన్నాడు.

కేవలం రెండు పూలు మాత్రమే తీసుకుని అన్న చేతికి ప్రథమ చికిత్స చేసి తిరిగి బయలుదేరాడు దినేష్.

ఆ పెద్దాయన తన గ్రామస్తుల వైపు తిరిగి ఇలా అన్నాడు ”ఆ కుర్రాడు మనకు ఒక మంచి పాఠాన్ని నేర్పించి వెళ్ళాడు.”

ఏంటన్నట్లు చూశారు అందరూ.

“మనిషి తను అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగిస్తాడు.”

********************************

నీలకంఠ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ .

తన కంపెనీ రీసెర్చ్ కమిటీ మెంబర్స్ కూడా అక్కడే ఉన్నారు.

“అన్నకి బుల్లెట్ తగిలింది.ఫస్ట్ ఎయిడ్ చేశాను.ట్రీట్ మెంట్ స్టార్ట్ చెయ్యండి క్విక్..!” అన్నాడు.

ఆ తర్వాత డాక్టర్ మొహమ్మద్ కు ఫోన్ చేశాడు. “హలో డాక్టర్.ఒక్కసారి మా కంపెనీ దగ్గరకు రాగలరా.” అన్నాడు.

“తప్పకుండా..” అంటూ డాక్టర్ మొహమ్మద్ బయలుదేరాడు.

కేవలం పది నిమిషాల్లో యుగంధర్ తో పాటూ దినేష్ ముందున్నాడు డాక్టర్ మొహమ్మద్.

దినేష్ అవతారాన్ని చూసి డాక్టర్ మొహమ్మద్ ఆశ్చర్యపోయాడు.

వొళ్ళంతా రక్తం మరకలు.., అలసిపోయినట్లు నీరసించిపోయిన కళ్ళు.., చాలా వైవిధ్యంగా ఉన్నాడు దినేష్.

ఇంతలో తన కంపెనీ రీసెర్చ్ కమిటీ మెంబర్స్ కూడా వచ్చారు.

దినేష్ తను తెచ్చిన ఉమ్మెత్తపువ్వులను బయటకు తీశాడు.

“డాక్టర్ మీరు చెప్పిన పువ్వులు ఇవేగా..?” అన్నాడు. వాటిని చూడగానే డాక్టర్ మొహమ్మద్ షాక్ కు గురయ్యాడు.

“ఇవి..మీకు..ఎలా..?” అన్నాడు.

“ఎలాగోలా తీసుకొచ్చాం డాక్టర్..! మీరు దీనితో ఎంత తొందరగా మెడిసిన్ తయారు చేస్తే అంత మంచిది..” అన్నాడు.,“సరే నేను చూసుకుంటాను నువ్వు రెస్ట్ తీసుకో దినేష్..” అంటూ యుగంధర్ ఈశ్వర్ ని చూడటానికి వెళ్ళాడు.

ఈశ్వర్ చేతికున్న కట్టు చూడగానే యుగంధర్ కోపం తారా స్థాయికి చేరింది.!

“ఆ అజయ్ గాడ్ని ఇక వదిలిపెట్టి లాభంలేదు.వాడ్ని చంపేస్తాను..” అని పైకి లేవబోయాడు.

“ఆ కష్టం నీకు వద్దులే..మావాడు పూర్తి చేశాడు..” అన్నాడు ఈశ్వర్.యుగంధర్ కు అర్థం కాలేదు.

“అంటే....!”

“ఆ తార ఆకాశాన్ని చేరింది.” అంటూ చిరునవ్వు చిందించాడు ఈశ్వర్. !!

********************************

ఆ మెడిసిన్ తయారు కావడానికి దాదాపు రెండు రోజులు పట్టింది.

ఆ రెండు రోజులూ దినేష్ డాక్టర్ మొహమ్మద్ తో పాటే కనబడ్డాడు.

ప్రతి చిన్న విషయాన్నీ చాలా క్షుణ్ణంగా పరిశీలించాడు. తనని కలవడానికి వచ్చిన తన ఫ్రెండ్స్ ని కూడా తరువాత కలుస్తానని చెప్పి పంపించేశాడు.

అక్కడున్న యుగంధర్ కి ఓ విషయం ఆశ్చర్యం కలిగించింది.

అక్కడున్న రీసెర్చ్ కమిటీ మెంబర్స్ కంటే ఎక్కువగా 'నెర్వ్ ఆస్తమా' పైన రీసెర్చ్ చేశాడు దినేష్.

మొత్తం మెడిసిన్ తయారయ్యాక డాక్టర్ మొహమ్మద్ దినేష్ ను అడిగాడు “ఈ మెడిసిన్ కు ఒక్క పువ్వు సరిపోతుంది కదా.మరోటి ఎందుకు?” అన్నాడు.

దినేష్ చిరునవ్వుతో చెప్పాడు. “ఇందులో స్వార్థం ఏమీ లేదు.నా హన్విత కు వచ్చిన పరిస్థితి ఎవరికీ రాకూడదు. నేను తలుచుకుంటే మా రీసెర్చ్ కమిటీ మెంబర్స్ తో కలిసి 'నెర్వ్ ఆస్తమా' కి మెడిసిన్ తయారు చేసి క్యాష్ చేసుకోవచ్చు. కానీ నేను దీన్ని మీకెందుకిచ్చానంటే...ఇది మీదగ్గరుండటమే మంచిది!” అన్నాడు.

డాక్టర్ మొహమ్మద్ ఆశ్చర్యపోయి చూస్తూ నిలబడ్డాడు.

“ మీ హాస్పిటల్ తరఫున ఈ ఉమ్మెత్త పుష్పాన్ని జెనెటికల్ గా డెవలప్ చేయండి. డాక్టర్లు..మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు.ఆ ఒక్క పువ్వు చాలు దాని నుంచి వంద సృష్టించొచ్చు.ఇక 'నెర్వ్ ఆస్తమా' అన్న పదాన్ని ప్రపంచం మర్చిపోవాలి..” అన్నాడు

డాక్టర్ మొహమ్మద్ దినేష్ వైపు అభినందనాపూర్వకంగా చూశాడు.

ఆ రోజు సాయంత్రమే హన్వితకు ఆ మెడిసిన్ ను ఇంజెక్ట్ చేశారు.

*****************************

దాదాపు రెండు గంటల తర్వాత హన్విత కళ్ళు తెరచింది.!

ఆమెకంతా అయోమయంగా ఉంది.కళ్లు తెరవాలని చూసింది కానీ తన వలన కాలేదు.

అతి కష్టం మీద కళ్ళు తెరవగలిగింది.ఎదురుగా అమ్మా నాన్నా కనబడ్డారు.

“అమ్మా. నాన్నా..,” అంది.మెల్లగా..

హన్విత కళ్ళు తెరవడాన్ని చూశాక పరమేశ్వరం ఆనందానికి అవధుల్లేకుండాపోయింది.!

నేరుగా హన్విత దగ్గరకొచ్చి ఇన్నాళ్ళూ తాము పడిన బాధని హన్విత కు తెలియనివ్వకుండా “ఇప్పుడెలా ఉందమ్మా..?” అని అడిగాడు పరమేశ్వరం.

పర్వాలేదన్నట్లు తల మెల్లగా కదిలించింది.

ఇంతలో డాక్టర్ మొహమ్మద్.., యుగంధర్ లతో పాటూ దినేష్ కూడా వచ్చాడు.

“తను ఇప్పుడే కదా కళ్ళు తెరిచింది..కాస్త రెస్ట్ తీసుకోనివ్వండి..” అన్నాడు డాక్టర్.

'సరే' అని అందరూ బయటికి వెళ్ళారు.

డాక్టర్ మొహమ్మద్ బయటకు వచ్చి అందరితో ఇలా అన్నాడు. “చూడండి.తను ఇప్పుడే మెల్ల మెల్లగా కోలుకుంటోంది.కాబట్టి తనకు టెన్షన్ కలిగించే విషయాలు ఎక్కువగా ఆమె దగ్గర చర్చించకండి.ఎలా హ్యాండిల్ చేస్తారో నాకు తెలియదు.. బట్ చాలా కేర్ తీసుకోవాలి..” అన్నాడు.

“నేను చూసుకుంటాను డాక్టర్..” అన్నాడు దినేష్.

పరమేశ్వరం వచ్చి దినేష్ చేతులు పట్టుకున్నాడు. “నువ్వే లేకుంటే నా కూతురి పరిస్థితి ఏమయ్యేదో...” అన్నాడాయన.

“భలేవారంకుల్..తనని నేను కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు..?” అన్నాడు..!

ఆ మాటలకు అందరూ దినేష్ ను చిత్రంగా చూశారు.!!

ఆ తర్వాత తన మాటలకు తానే అదిరిపడి “అంటే నా ఉద్దేశ్యం.. మీరు ఎలా చూసుకుంటారో..నేనూ అలానే చూసుకున్నా.. అంతే..” అంటూ మెల్లగా అక్కడనుంచి జారుకున్నాడు దినేష్.

ఆరోజు రాత్రి ...

“ఇంతకీ నాకు ఏమైంది..?” అమ్మా నాన్నలను అడిగింది హన్విత.

“ఏమీ లేదు.జస్ట్ కళ్ళు తిరిగి కిందపడ్డావ్.. అంతే...” అన్నాడు దినేష్.

దినేష్ ను చూడగానే హన్వితలో ఎక్కడలేని హుషారొచ్చింది.!

“ఆరోజు అసలేమైంది.?” అని అడిగింది.

ఆమెకదే అర్థం కావట్లేదు. ! ఆ రోజు దినేష్ కోసం బీచ్ లో వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళింది.ఆ తర్వాత ఏం జరిగిందో హన్వితకు అస్సలు గుర్తుకులేదు.

'కోమాలోకి వెళ్ళొచ్చినా మెమొరీ పవర్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు...!ఎంతైనా అమ్మాయి కదా..,!!' మనసులో అనుకున్నాడు దినేష్.

హన్విత అమ్మానాన్నకు ఏం చెప్పాలో అర్థంకాక తడబడ్డారు.!

'వామ్మో..! ఇలానే ఉంటే ఈ మేధావి మొత్తం విషయాన్నంతా బయటకు లాగేలా ఉంది' అనుకొని “నేను చెప్తాను.” అన్నాడు.

ఆ మాటలకు దినేష్ వైపు చూసింది హన్విత

“ ఆ రోజు మామూలుగా పరిగెత్తుకుంటూ వచ్చావ్.కాకపోతే ఆ ఎండకి కళ్ళు తిరిగుంటాయ్. కిందపడిపోయావ్...! ఇదిగో..అప్పటినుండి ఇలా నిద్రపోతూనే ఉన్నావ్..!! అందుకే అనవసరంగా రిస్క్ చేయకూడదు..” అన్నాడు దినేష్.

హన్వితకు దినేష్ చెప్పింది నమ్మబుద్ధి కాలేదు.

“మరీ అయిదు రోజులెవరైనా నిద్రపోతారా? !” అంది ఆశ్చర్యంగా...

ఇంతలో హన్విత వాళ్ళ నాన్న పరమేశ్వరం కలుగజేసుకొని “హనీ..! నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి.ఎక్కువగా దేని గురించీ ఆలోచించకు..” అని చెప్పి బయటకు నడిచాడు.

దినేష్ హన్వితకు దగ్గరగా వచ్చి “జాగ్రత్త...” అనేసి వెళ్ళిపోయాడు.

ఎందుకో దినేష్ మాటతీరులో చాలా మార్పొచ్చింది....!

********************************

********************************

రెండు రోజుల్లో హన్వితను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు.

ఆ తర్వాత దినేష్ హన్వితను అస్సలు వదిలి ఉండలేదు.చిన్న పిల్లాడిలా రోజులో దాదాపు

ఎక్కువ భాగం హన్విత తోనే ఉండసాగాడు దినేష్.!

ఒకరోజు సాయంత్రం మామూలుగా రోడ్ పైన ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తున్నారు.

“ఆ రోజు నేను నీకు ఏమీ చెప్పలేదా..?” అంది హన్విత.

“ఏ విషయం హనీ..?” అన్నాడు దినేష్.దినేష్ అలా పిలుస్తుంటే హన్వితకు చాలా కొత్తగా

ఉంది.

“ఏమీలేదులే..” అంటూ సైలెంట్ గా ఉండిపోయింది.దినేష్ ఒకవైపు తన్నుకొస్తున్న నవ్వుని

బలవంతంగా ఆపుకుంటున్నాడు.

“అవునూ..., మెడ దగ్గర ఆ దెబ్బలేంటి?” అంది.

దినేష్ ఆ మాటలకు అదిరిపడి “అదా..., అదేం లేదు.ఆ రోజు కొడైకెనాల్ కి వెళ్ళినప్పుడు అక్కడ

ఏదో చిన్న యాక్సిడెంట్..” అన్నాడు.

హమ్మయ్య...! ఏదో చెప్పి తప్పించుకున్నాం కాబట్టి సరిపోయింది.లేకపోతే ఈ దెబ్బ ఆ ఫారెస్ట్

లో తగిలిందని తెలిస్తే ఏమయ్యేదో.. అనుకున్నాడు దినేష్.

ఇంతలో వారిద్దరి పక్కగా ఓ కారు వచ్చి ఆగింది.అందులో నుంచి ఈశ్వర్, యుగంధర్ లు

బయటకు దిగారు..

“డాడీ ఇంకో వారంలో నిన్ను M. D. గా ఫుల్ ఛార్జ్ తీసుకోమన్నారు..” అన్నాడు ఈశ్వర్.

“సరే అన్నా..” అన్నాడు దినేష్.

యుగంధర్ హన్వితవైపు చూసి “ఓ.కే. హనీ.., మాకు అర్జెంట్ పని ఉంది సీ.యూ..” అనేసి

కారెక్కి ఇద్దరూ వెళ్ళిపోయారు.

“నువ్వు మీ అన్నయ్యకి రెస్పెక్ట్ ఇవ్వడం ఎప్పటినుంచి మొదలుపెట్టావ్..?” అడిగింది హన్విత.

“కొంత మంది విలువ అంత తొందరగా తెలియదు.తెలిశాక వాళ్లని వదలాలి అనిపించదు..”

అన్నాడు.

“ఏమన్నావ్..?” అంది హన్విత.

“ఏమీ లేదు హనీ.., నువ్వు మీ అన్నకు బాగా రెస్పెక్ట్ ఇస్తావ్ కదా..,నిన్ను చూసే

నేర్చుకున్నా..!” అన్నాడు...

“ నమ్మేశాను లే ..! పదా..” అంటూ ముందుకు నడిచింది.

ఇంతలో ఓ న్యూస్ పేపర్ అటుగా కొట్టుకొచ్చింది.అది నేరుగా హన్విత మొహాన్ని తాకింది.

దాన్ని పడేద్దామనుకుంది హన్విత.కానీ అందులో ఉన్న న్యూస్ చూసి ఆగిపోయింది.!

ఆ పేపర్ లో ;నెర్వ్ ఆస్తమా ఇక లేనట్లే; అని డాక్టర్ మొహమ్మద్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఉంది.

“ఈ క్రెడిట్ మొత్తం నీది కదా..? ఆ డాక్టర్ పేరు ఉందేంటి..?” చాలా క్యాజువల్ గా

అడిగింది హన్విత.

“డాక్టర్ ఏంటి..?” అని ఆ పేపర్ చూసిన దినేష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

“ఇందులో నా క్రెడిట్.., ఏముంది...?” అంటూ ఏదో దాచాలని ప్రయత్నించాడు కానీ హన్విత

స్పష్టంగా చెప్పింది. “నాకంతా తెలుసు....! నా ఫ్రెండ్స్ చెప్పారు.”

దినేష్ ఇంకేమీ మాట్లాడలేకపోయాడు.

“ఎందుకింత రిస్క్ చేశావ్..? ప్రాణాలకు తెగించి నన్ను కాపాడాల్సిన అవసరమేముంది...?

మనసులో అంత ప్రేమ దాచుకొని ఎందుకు నా ముందు సైలెంట్ గా ఉన్నావ్..?” చొక్కా పట్టుకుని

నిలదీస్తున్నట్లు అడిగింది హన్విత.

దినేష్ ఏమీ బదులు చెప్పలేకపోయాడు.

“వద్దు... నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదు....నే చెబుతున్నా విను..ఐ లవ్ యూ..ఐ లవ్

యూ...” అని దినేష్ ను గట్టిగా వాటేసుకుంది హన్విత !!

అప్పుడే అటుగా వచ్చిన దినేష్ ఫ్రెండ్స్ ఈ దృశ్యాన్ని చూసి సంతోషించారు.

అందరికీ దినేష్ తమతో చెప్పిన మాటలే గుర్తొచ్చాయి.

“మరి..ప్రతి లవ్ స్టోరీలో జరిగేదేగా.., అబ్బాయి వెళ్ళి ఐలవ్ యూ చెప్పేదాకా

అమ్మాయికి ఇష్టమున్నా సరే నోరు విప్పదు.ఈ ట్రెండ్ మారాలి.భారతదేశంలో స్త్రీలను

గౌరవించడం సాంప్రదాయం కాబట్టి ముందుగా వారినే చెప్పనిద్దాం...!”.

“థాంక్ యూ..” అన్నాడు దినేష్.

“ఎందుకు.. ఒక్కసారి హగ్ ఇచ్చినందుకే..? !” అంది హన్విత.

“ కాదు.నీ వలన రెండు గొప్ప విషయాల విలువ తెలిసింది.

మొదటిది.అదెప్పుడూ అందరూ చెప్పేదే ప్రేమ...

ఇక రెండోది. అన్న; అనే పదానికుండే విలువ. ఇది చాలా సార్లు ఎవరూ చెప్పి

ఉండకపోవచ్చుగానీ.., నీ వలనే నాకు తెలిసింది.చాలా థాంక్స్..” అన్నాడు.

“ఏంటి నీ చెయ్యి వణుకుతోంది..?” మెల్లగా నడుస్తూ అడిగింది హన్విత.

“మనం ప్రేమించిన అమ్మాయి.., మనకన్నా ముందొచ్చి మనకు ఐ లవ్ యూ చెబితే ఎలా

ఉంటుందో తెలుసా..?”

“ఎలా ఉంటుంది...?”

“ఇలానే ఉంటుంది..!” అని హన్విత తో కలిసి ముందుకు కదిలాడు దినేష్.

******** సమాప్తం ********

A Story By...

Sudharshan Booduri

Special Thanks to

The 'Puri Jagannadh' Sir For Inspiring me to Create 'Theginpu'.

This Story is Dedicated to My Brother 'Eshwar'

(There is Nothing a disease like 'Nerve Aasthma' .It is fully fictional and created for this story only and a kind of flower 'Datura Stramonium' (ఉమ్మెత్తపువ్వు) is truely used in Aasthma Cure...)

Completed on :03-09-2015 A Sudharshan Booduri Creation

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.