నిహారిక -ప్రవళికఏంటి కొత్త చేప పడింద లేదా ఇంకా ఎన్ని రోజులు నీకు డబ్బులు ఇచ్చి కూడా నెల రోజులు గడిచిపోయింది కాని ఇంకా ఒక కొత్త విడియో మాకు ఇవ్వలేదు..సాబ్ నాపై ఆగ్రహంగా ఉన్నాడు.నువ్వు ఎలాగైనా ఈ నెలలో కనీసం రెండు మూడు వీడియోస్ చేయకపోతే నిన్ను పనిలో నుండి తిసివేమన్నాడు..ఇక నీ ఇష్టం ఆలోచించుకో..అని పాన్ నములుతూ కిరణ్ తో చెప్పాడు సురేష్..

కిరణ్ అంతా మాట అనకు సురేష్ త్వరలోనే రెండు తాజా చేపలను మీకు అందిస్తా..అప్పటికి వరకు నేను మిమ్ములను డబ్బు అడగను.మీ ముందుకు రాను వెళ్తున్న త్వరలోనే విడియోలు తీసుకోని వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు..

**********************************####**********************************

కిరణ్ విస్సుగా రూమ్ కి వచ్చాడు ఎలాగైనా ఈ నెలలో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలిని అని ల్యాప్ టాబ్ ఓపెన్ చేసి ఫేస్ బుక్ ఓపెన్ చేస్తాడు..తన ఫ్రెండ్ లిస్టు లో ఉన్న నిహారిక కి మెసేజ్ చేస్తాడు..

కిరణ్ :- హాయ్

నిహారిక:-హాయ్ హౌ అర్ యూ కిరణ్

కిరణ్:-యా ఐ యాం ఫైన్ హోప్ యు టు

నిహారిక :- థాంక్స్ ఐ యాం ఫైన్

కిరణ్ :-మీ డాడితో మాట్లాడవా నా విషయం

నిహారిక :- హ మాట్లాడను

కిరణ్ :- ఏమ్మనారు

నిహారిక :- ఓకే అన్నారు రేపటి నుండి నువ్వు రావచ్చు

కిరణ్ :- హో అవునా చాల థాంక్స్

నిహారిక :-హే ఇట్స్ ఓకే

కిరణ్ :- బై

నిహారిక :- బై సి యూ సూన్

******************************************####**********************

కిరణ్ ఆనందానికి అవధులు లేవు ఎలాగైనా తన ప్లాన్ సక్సెస్ అవ్వాలి అని మనసులో అనుకుంటాడు..ప్రొద్దునే చక్కగా రెడి అయ్యి నిహారిక ఇంటికి వెళ్తాడు..కాలింగ్ బెల్ కొట్టగానే ఒక పదిహేడు సంవత్సరాల అమ్మాయి డోర్ ఓపెన్ చేసింది ఆ అమ్మాయి బ్లూ స్కిన్ జీన్స్, వైట్ టాప్ వేసుకొని ఉంది తెల్లని రంగు ఎర్రని పెదవులు గాఢమైన కురులు అలా వదిలేసింది కిరణ్ ఆ అమ్మాయిని అలానే చూస్తూ ఉండిపోయాడు..

హలో హలో ఎవరు మీరు అని కిరణ్ ని అడుగుతుంది..

కిరణ్ తన ఉహ లోకంలో నుండి తేరుకొని .. నా పేరు కిరణ్ నేను నిహారిక ఫ్రెండ్ ని అని చెప్పగానే..

ఆ అమ్మాయి హో మీరా రండి రండి లోపలి రండి నా పేరు ప్రవళిక నేను నిహారిక చెల్లిని మీరు నాకే ఫిసిక్స్ క్లాస్ చెప్పడానికి వచ్చారు అని పరిచయం చేసుకుంటుంది..!

అంతలోనే లోపలి నుండి తల తుడుచుకుంటు..నిహారిక షార్ట్ మరియు టి షర్టు వేసుకొని చాల హాట్ గా ఉంటుంది..నిహారిక చాల ఫాస్ట్ వ్యక్తి ఏది పూర్తిగా ఆలోచించదు అందరిని తొందరగా నమ్మేస్తుంది తను హైదెరాబాద్ లో బి.టెక్ రెండవ సంవత్సరం చదువుతా ఉంది.

హాయ్ కిరణ్ వచ్చావ డాడి రెడి అవుతున్నారు కూర్చో అంటుంది..

అక్కడే ఉన్న సోఫా లో ముగ్గరు కూర్చుంటారు..

ప్రవళిక అక్కయ్య నేను కిరణ్ గారిని పరిచయం చేసుకున్న అంటుంది..

నిహారిక చెల్లి నువ్వు కిరణ్ ని పేరు పెట్టి పిలువకూడదు ఓకే నా సార్ అని పిలువు కిరణ్ నాకు ఫ్రెండ్ నీకు క్లాసెస్ చెప్పడానికి వచ్చిన సార్ ఓకే నా అంటుంది..

కిరణ్ లేదు లేదు అవసరం లేదు తను నన్ను కిరణ్ అని పిలిస్తే నాకు పర్వాలేదు సార్ అని పెద్దవాడిని చేయద్దు అని అంటాడు..

అవును నేను కిరణ్ గారిని కిరణ్ అని పిలుస్తాను అదే బాగుంటుంది.

సరే సరే మీ ఇష్టం అని అంటుంది నిహారిక

*****************************************####************************

నిహారిక డాడి ఒక పోలీస్ అధికారి తన భార్య పది సంవత్సరాల క్రితం చనిపోయింది..కాని ఇద్దరి పిల్లలును అల్లరి ముద్దుగా చాల గారాబంగా పెంచుకుంటు ఉంటాడు.నిహారిక తండ్రికి కిరణ్ ని పరిచయం చేస్తుంది..ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు సరే నువ్వు క్లాసెస్ చెప్పు నాకు స్టేషన్ వెళ్తున్న..అని వెళ్ళిపోతాడు..సరే అయితే నేను కాలేజ్ కి వెళ్ళాలి రేపటి నుండి సాయంత్రం ఆరు గంటలకి రా అని చప్పి వెళ్ళిపోతుంది నిహారిక..

కిరణ్ కూడా నాకు కాలేజ్ కి టైం అయింది వెళ్తాను అని చెప్పి రూమ్ కి వస్తాడు. ప్రవళిక కూడా రెడి అయ్యి కాలేజీకి వెళ్ళిపోతుంది..

**********************####***********************

నిహారికకు కిరణ్ ఫేస్ బుక్ లో ఫ్రెండ్..కిరణ్ నేను బి.టెక్ చేస్తున్న కాని నాది చాల పూర్ ఫ్యామిలీ అని చెప్తాడు..నిహారిక కిరణ్ బాధను చూసి సరే అయితే మా చెల్లి ప్రవళిక ఉంది తనకు ఫిసిక్స్ రాదు నువ్వు తనకి క్లాసెస్ చెప్పు మా డాడి నీ ఖర్చులకు డబ్బులు ఇస్తాడు అని చెప్తుంది..!!

అలా రోజు కిరణ్ ప్రవళిక కు క్లాసెస్ చెప్తూ ఉంటాడు..సాయంత్రం ఆరు గంటలకి మొదలు పెట్టి తొమ్మిది వరకు చెప్పేవాడు..అప్పుడప్పుడు నిహారిక,ప్రవళిక,కిరణ్ కలిసి సినిమాలకు,పార్కులకు వెళ్ళేవారు..అలా నిహారిక కిరణ్ ఒకే వయస్సు వారు కావడంతో బాగా దగ్గర అవుతారు.ఒక రోజు కిరణ్ నిహరికకు ప్రొపొస్ చేస్తాడు.నిహారికకు కిరణ్ మంచి మనస్సు నచ్చి తను కూడా ఓకే చెప్తుంది..అలా వారు ప్రేమించుకుంటు ఉంటారు.

*****************************************######****************************

కిరణ్ తన పుట్టినరోజు అని చెప్పి నిహరికకు ఫోన్ చేసి తన రూమ్ కి రా పార్టీ ఉంది అని చెప్తాడు..తను సరే వస్తాను అని చెప్తుంది..రెడి అయ్యి కిరణ్ రూమ్ కి వస్తుంది కాని రూమ్ లో ఎవరు ఉండారు నిహారిక ఏంటి ఇంకా ఎవరు రాలేదా నేనే ముందే వచ్చాన లేదంటే పార్టీ అయిపోయిందా అని అడుగుతుంది..

కిరణ్ ఈ పార్టీ నీకు మాత్రమె అని చెప్తాడు..అవునా ఓకే ఓకే త్వరగా కేకు కట్ చెయ్యి డాడి వస్తారు నేను ఇంటికి వెళ్ళాలి అంటుంది.సరే అని ఇద్దరు కలిసి కేకు కట్ చేస్తారు..ఒక్కరికొక్కరు తినిపించుకుంటారు..

నాకు గిఫ్ట్ తీసుకురాలేదా అని అడుగుతాడు..హ తీసుకువచ్చాను అని ఒక డైమండ్ రింగ్ ఇస్తుంది..కిరణ్ నాకు ఇలాంటివి వద్దు అంటాడు.

మరి ఇంకేం కావలి

నువ్వు కావలి

నేను ఉన్నాను కదా ని దగ్గరే

అలా కాదు నాకు ఒక ముద్దు కావలి

నో కిరణ్ అవన్నీ పెళ్ళికి తర్వాతే ఇప్పుడే కుదరదు అంటుంది

కిరణ్ మాత్రం ప్లీజ్ ఓకే ఒక ముద్దు అంటాడు

నిహారిక సరే అయితే ఒక ముద్దు అని ఒప్పుకుంటుంది.

కిరణ్ నిహరికను తన కౌగిలిలో బందించి తన లేత పెదవులను నలిపేస్తాడు..నిహారికకు ఎదో కొత్తగా అనిపిస్తుంది మత్తు వచ్చినట్లు పడిపోతుంది కిరణ్ తనని మానభాగం చేస్తాడు..

ప్రొద్దునే నిహారిక లేస్తుంది ఏమైంది నాకు అని అడుగుతుంది ఏమి లేదు నీకు నిదుర రావడం తో నువ్వు పడుకున్నావు అంతే అంటాడు.నిహారిక లేచి తన కార్ లో ఇంటికి వెళ్ళిపోతుంది..తనకు ఎదో జరిగింది అని అనుమానం వేస్తుంది కాని కిరణ్ అలాంటి వాడు అని నమ్మి దాని గురించి ఆలోచించదు..

*************************************#####****************************

కిరణ్ ఒక మోసగాడు తను బి.టెక్ డిస్ కంటిన్యూ అయ్యి ఉంటాడు.దొంగతనాలు దోపిడిలు చేసి జలసాగా బ్రతుకుతుంటాడు..అలా ఒక ఎం ఎం ఎస్ మాఫియ పరిచయంతో ఆడపిల్లలను ఫేస్ బుక్ లో పరిచయం చేసుకొని వారికి మాయ మాటలు చెప్పి బుట్టలో వేసుకొని వారి ఇంటికి చేరుతాడు అలా నిహరికను కూడా ఫేస్ బుక్ లో పరిచయం చేసుకొని ఇంటికి చేరి ప్రేమ పేరుతొ వచించి రూమ్ కి పిలిచి మత్తు మందు ఇచ్చి వారిని మానభాగం చేసి వారి వీడియోస్ తీసి అమ్ముకుంటు జలసాగా తిరుగుతూ ఉంటాడు..అలా నిహారికను కూడా పుట్టినరోజు పేరుతొ రూమ్ కి పిలిచి మత్తు మందు ఇచ్చి విడియో తీసి ఆ వీడియోను అమ్మేశాడు..ఇక తన తదుపరి బుట్టలో వేయాల్సిన వ్యక్తి ప్రవళిక..

***********************************#####***********************

ప్రవళికను నువ్వు అందంగా ఉంటావు మీ అక్క ఏమి బాగుండదు అని పొగుడుతూ ఉంటాడు..దానికి ప్రవళిక మురిసిపోతూ ఉంటుంది.. ప్రవళిక కాలేజ్ దగ్గరికి వెళ్లి తనను పిలుచుకొని వెళ్లి పబ్ కి పార్కులకి తీసుకోని వెళ్ళడం తనకు చిన్న చిన్న గిఫ్ట్ లు ఇవ్వడం ఇలా చేస్తూ వస్తాడు.అది గమనించిన నిహారిక ఏంటి నువ్వు నా చెల్లి తో చనువుగా తిరుగుతూ నన్ను పట్టించుకోవడం లేదు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తె తాట తీస్తా అని హెచ్చరిస్తుంది..

అలా ఏమి కాదు నిహ ఎదో చిన్న పిల్ల కదా అందుకే కాస్త బాగా చూసుకుంటున్న ఎంతైనా నా మరదలు కదా ఆ మాత్రం చనువుగా ఉండకూడదా..అని నిహరికను కూల్ చేస్తాడు..

****************************######****************************************

ఒక రోజు నిహారిక,నిహారిక తండ్రి ఇద్దరు కలిసి బంధువుల పెళ్ళికి వెళ్తారు అదే అదునుగా చేసుకొని ప్రవళికను ఎలాగైనా ఈరోజు లొంగ తిసుకుకోవాలి అని అనుకుంటాడు..సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది వరకు క్లాసెస్ చెప్పి నాకు కాస్త జ్వరం వచ్చినట్లు ఉంది నేను మీ నాన్న గారి రూమ్ లో పడుకుంటాను అని అడుగుతాడు.. ప్రవళిక సరే కిరణ్ నువ్వు అక్కడ పడుకో నేను నీకోసం కాఫీ చేసి ట్యబ్లేట్ తీసుకువస్తాను అని చెప్పి వెళ్తుంది..

నిహారిక కిరణ్ రూమ్ కి వస్తుంది ఇద్దరు కలిసి కాఫీ తాగుతారు.కిరణ్ ట్యబ్లేట్ వేసుకుంటాడు.. ప్రవళిక నీకో విషయం చెప్పానా..

ఏంటో చెప్పు కిరణ్

నువ్వంటే నాకు చాల ఇష్టం..నీ అమాయకత్వం..నీ ముద్దు ముద్దు మాటలు వినాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను..

నా ప్రేమను అంగికరించు అంటాడు..

ఏంటి కిరణ్ నేను ని కన్న చిన్న దాని కదా అంటుంది

ఏమి కాదు ఎంత మంచి వయస్సు తేడా ఉన్న వారు పెళ్లి చేసుకోవడం లేదు అంటాడు

సరే నాకు కాస్త టైం ఇవ్వు నేను తర్వాత చెప్తాను అంటుంది

సరే నాకు ఏదైనా చల్లగా తాగాలని ఉంది ఫ్రిజ్ లో ఉన్న కూల్ డ్రింక్ తీసుకోని రా అంటాడు..

ప్రవళిక కూల్ డ్రింక్ తీసుకోని వస్తుంది కిరణ్ ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం అందులో మత్తు మందు కలిపాడు కూల్ డ్రింక్ తాగినట్లు నటిస్తాడు ప్రవళిక తాగి మత్తు ఎక్కి పడిపోతుంది కిరణ్ తన విడియో తీసి ఏమి తెలియనట్లు తన రూమ్ లో పడుకోబెడతాడు..అలా ఇద్దరిని మోసం చేసి విడియో తీసి అమ్మేస్తాడు..

****************************######*************************

ఒక రోజు నిహారిక ఫ్రెండ్ కాల్ చేసి ని విడియో అడల్ట్ వెబ్ సైట్ లో ఉంది చూడు అంటుంది..వెంటనే చూస్తుంది నిహారిక ఏమి చేయాలో అర్థం కాలేదు నిహరికకు అప్పుడు కిరణ్ ఎవరు అని వివరాలు తెలుడుకుంటుంది..తన చెల్లి కూడా మోసపాయింది అని తెలుసుకుంటుంది.తండ్రికి తెలిస్తే ఒక పోలిస్ అధికారి పిల్లలను ఇలా చేసాడు అని తనకు అవమానం జరుగుతుంది అని భయపడుతుంది..ఎలాగైనా వాడికి బుద్ధి చెప్పలి అని వాడి రూమ్ కి వెళ్తుంది.

కిరణ్ ఏంటి నిహ ఇలా వచ్చావు నేను గుర్తు వచ్చనా అంటాడు

ఆపు ఇంకా నీ పాపపు పని అంతా నాకు తెలిసిపోయింది నన్ను నా చెల్లిని మోసం చేస్తావ నిన్ను చంపి నేను జైలు కి వెళ్తాను అని చెప్పి తను తెచ్చుకున్న కత్తితో దాడి చేసి కడుపులో గుచ్చుతుంది..వెంటనే తేరుకొని నిహారిక చేతిలోని కత్తిని తీసుకోని నిహరికను ఇష్టం వచ్చినట్లు పొడిచి చంపేస్తాడు..

********************************************######******************************

ఏమి చేయాలో తెలియక పారిపోతాడు వారం రోజులు నిహారిక శరీరం ఆ రూమ్ లోనే ఉంటంది..పక్కన ఉన్నవారు ఏంటి ఈ వాసన అని తలుపులు బద్దలు కొట్టి చూస్తారు అక్కడే నిహారిక శరీరం కుళ్లిపోయి ఉంది..

నిహారిక తండ్రి ఐదు రోజుల నుండి గాలిస్తున్నారు కాని తను ఏంతో గారభంగా పెంచుకున్న కూతిరి ప్రాణం లేని దేహం చూసి గుండెపోటుతో ఆసుపత్రిలో చేరుతాడు..

రెండు రోజులలో కిరణ్ ని పట్టుకున్నారు పోలీసులు జీవిత ఖైదు వేసారు కాని ఇద్దరి అమాయకపు ఆడపిల్లలను మోసగించి ఇంకా ఎందరినో మానభాగం చేసి వారి జీవితాలతో ఆడుకున్న కిరణ్ కి కేవలం జీవిత ఖైదు సరిపోతుందా..

****************************************####*********************

ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష వేయాలి మన చట్టాలు ఇంతేనా

ఎన్ని చట్టాలు చేసిన మన ఆడపిల్లలకు రక్షణ లేదా

మీ అమూల్యమైన సలహాలు సూచనలు తెలుపగలరు

కలం పేరు :- అఖిలాశ

మీ

జాని.తక్కెడశిల

11-29-2016

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.