సహాయం

అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో నెమలి, కోకిల మరియు గుడ్లగూబ నివశిస్తూ ఉంటాయి.

నెమలి పున్నమి వెన్నల్లో నాట్యం చేస్తూ చూపరులను ఆకట్టుకుంటూ ఉంటుంది.

కోకిల తన గానంతో శ్రోతులను ఉర్రూతలూగిస్తూ ఉంటుంది.

కానీ గుడ్లగూబ మాత్రం బాటసారులను భయబ్రాంతులకు గురిచేస్తూ ఉంటుంది. అరే...! అందరూ నెమలి,కోకిలనే అభినందిస్తారు.

గుడ్లగూబ నన్నుమాత్రం ఎవరూ పట్టించుకోరు. అని దిగులు పడుతూ ఒకరోజు గుడ్లగూబ నెమలి, కోకిలతో గొడవకు దిగుతుంది. మీతో నేను కలిసున్నా నన్ను ఎవరూ మెచ్చుకోరు.

ఈ అడవిలో నేను ఒక్కదాన్నే ఉంటా మిమ్మల్ని చంపేస్తా అని గొడవపడుతుంది.

నెమలి, కోకిల గుడ్లగూబ మాటలకు భయపడి ఇద్ధరం ఒకే చోటుంటే మనం ఇద్ధరం దొరికిపోతాం కాబట్టి చేరో దిక్కుకు పోయి ప్రాణాలు రక్షించుకుందాం అని వెళ్లిపోతాయి.

గుడ్లగూబ ఎలాగైనా నెమలిని కోకిలని చంపాలనుకుని ఎలా? అని ఆలోచిస్తుండగా ఒక ఆలోచన గుడ్లగూబకి తట్టింది. ఎలా? అంటే..? గుడ్లగూబ తన నోటితో నెమలిని పొడిచి పొడిచి చంపోచ్చు అని వెలుతుంది.

అడవిలో వెతుకుతూ పోతోంది గుడ్లగూబ.

అడవిలో ఒక చెట్టుకింద నెమలి ఉందని గ్రహించిన గుడ్లగూబ ఆకాశం నుంచి ఒక్కసారిగా నెమలి వైపుకు దూసుకెల్లింది.

కానీ నెమలి మాత్రం గుడ్లగూబ వచ్చిన ప్రతిసారీ నెమలి తోకను పురివిప్పి అడ్డుగా తనని తాను కాపాడుకునేది.

విసుగు చెందిన గుడ్లగూబ కోకిలను చంపాలని నెమలి దగ్గర నుంచి వెల్లిపోయింది.

గుడ్లగూబ ఆకాశంలో ఎగురుతూ వెతుకుతూ పోతుండగా కోకిల ఒక చెట్టు పైన కూర్చుని ఉన్నది చూసి ఒక్కసారిగా కోకిల వైపు వెళ్తుండగా గుడ్లగూబ రావడం గమనించిన కోకిల అమ్మో...నన్ను చంపడానికే వస్తోంది కబోలని ఆకాశంలోకి అందనంత దూరంగా పైకి ఎగిరిపోతూ కోకిల తన ప్రాణాలను రక్షించుకొంది.

అడవిలో ఒకరోజు వేటగాడు తన వేట ముగించుకొని ఇంటి వెలుతుండగా వేటగానికి ఒక చెట్టు పైన గుడ్లగూబ కనిపించింది.

ఈ అడవి దారిలో వచ్చి పోయే బాటసారులను భయబ్రాంతులకు గురిచేస్తోందని ఆ వేటగాడు గుడ్లగూబను చంపాలనుకుంటాడు.

ఆ వేటగాడు గుడ్లగూబకు విల్లు ఎక్కుపెడతాడు. విల్లుఎక్కుపెట్టిన ఆ వేటగాన్ని చూసిన నెమలి,కోకిలలు ఒక్క సారిగా అరవడంతో అప్రమత్తమైన గుడ్లగూబ ఆవేటగాని విల్లుకి బలి కాకుండా ఆకాశంలోకి ఎగిరిపోయి తన ప్రాణాలను రక్షించుకుంది.

గుడ్లగూబ మళ్లీ తిరిగొచ్చి తనని వేటగాడు నుండి రక్షించినందుకు నెమలికి, కోకిలకి కృతజ్ఞతలు చెప్పింది. ఎప్పటిలాగే మళ్లీ నెమలి, కోకిల, గుడ్లగూబ కలసి మెలసి జీవించసాగాయి.

రచన:-కుంచె చింతా.లక్ష్మీనారాయణ. ఆర్ట్:- కుంచె చింతా.లక్ష్మీనారాయణ.

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.