ఎదురు చూస్తున్న నీ కోసం .....

ఎదురు చూస్తున్న నీ కోసంఎద లోతులు చీల్చి

రుధిరంపు గుండెను చేతబట్టి

అలపిస్తున్నా సప్త స్వర సురాగాలు

కరుణిస్తావు నీవు కాలం కలసి వస్తే

వరమిస్తావు నీవు దేవుడు దయ తలిస్తే

ప్రేమిస్తావు నీవు నీ మది స్పందిస్తే

లాలిస్తావు నీవు నా ప్రేమను గుర్తిస్తే

ఊపిరిలో ఊపిరిగా శ్వాసిస్తా నిన్నే కడవరకు

ఉసురు కోల్పోయినా, ఉనికి లేక పోయినా

ఆస్థి పంజరంగా మిగిలి అయినా

నా హృదయ రాగం వినిపిస్తా

మరుజన్మ కయినా మరలి వస్తావని

స రి గ మ ప ద ని సా అంటూ

ప్రణయ గీతం ఆలపిస్తూ

ఎన్నాళ్లయినా, ఎన్నేళ్ళయినా

ఎదురు చూస్తా నీ కోసం
telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.