ఐ యామ్ వసంత్

ఐ యామ్ వసంత్

అందమైన అనంతపురం జిల్లాలోని కొండాపురం అనే పల్లెటూరు. అంతే అందమైన దంపతులు రామయ్య, సంజమ్మలకు ఒక కుమారుడు. వాడి పేరు వసంత్. ఆ దంపతులు గంపలు, పొట్టుజల్లలు, బుట్టలు, తడకలు అల్లి జీవనం సాగిస్తూ ఉంటారు.

వసంత్ తమలా ఉండకూడదని పెద్ద పెద్ద చదువులు చదివించారు. పెరిగి పెద్దయ్యాడు. ఉద్యోగాల వేటలో ఉన్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే వసంత్ కి ఇంటర్వ్యూకి వెళ్లినచోట ఓ అందమైన అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయిని చూసిన వసంత్ ఇంత అందమైన అమ్మాయిని ఎలాగైనా పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాడు.

అంతలోనే వర్షిణి ఎవరమ్మా? సర్ పిలుస్తున్నాడు రండి అని ప్యూన్ పిలవగా తన పేరుని మనసులో మననం చేసుకుంటున్నాడు. వసంత్ వర్షిణి పేర్లు బాగా కలిసిపోయాయి. ఇక మా మనసులు కూడా కలవాలి దేవుడా అని స్మరించుకుంటుండగా వసంత్ ఎవరిక్కడ రండి అన్నాడు ప్యూన్. వసంత్ కు సాప్ట్ వేర్ డౌవ్లప్పర్ ఉద్యోగం వచ్చేసింది. నెలకు పాతికవేలు జీతం.

ఉద్యోగం వచ్చిన విషయం అమ్మ నాన్నలకు చెప్పాడు చాలా సంతోషించారు.

మొదటి రోజు ఆఫీస్ కు వెళ్లాడు. ఆఫీస్ లో అందరికీ స్వీట్స్ తీసుకెళ్ళాడు. అందరికీ ఇచ్చి ఒక క్యాబిన్ దగ్గర ఆగిపోయాడు. తన దగ్గరకు ఎవరో వచ్చారు అని గమనించిన వర్షిణీ ఓ..హాయ్ ఐ యామ్ వర్షిణీ అంది. స్వీట్ తీసుకోమని ఐయామ్ వసంత్ అన్నాడు. నైస్ టు మీట్ యు అని వర్షిణీ అన్నది. వసంత్ ది వర్షీణీది పక్క పక్క క్యాబిన్స్ చాలా సంతోషించాడు వసంత్. థ్యాంక్స్ గాడ్ నా కోరిక తీర్చావు అన్నాడు.

సాయంత్రం ఆఫీస్ ముగించుకొని వసంత్ నడుచుకుంటూ రూమ్ కి వెళ్తుండగా వెనుక నుండి ఎవరో దూరం నుంచి హారన్ కొడుతున్నారు. రోడ్డుకు సైడ్ గా నడుస్తున్న వసంత్ వెనక్కి చూడలేదు. బైక్ వచ్చి వసంత్ పక్కన ఆగింది. ఎవరా? అని తల పైకి ఎత్తి చూశాడు. తన కనుల ఎదుట వర్షిణీ ఉంది. ఆశ్చర్యంగా తననే చూస్తున్నాడు. హేయ్! వసంత్ రా నేను డ్రాప్ చేస్తా అని వర్షిణి తన స్కూటీ ఎక్కించుకొని ఎక్కడ మీ ఇల్లు అన్నది. ఇల్లు కాదు నేను పి.జి లో ఉన్నా అన్నాడు. సరే ఎక్కడో చెప్పు అక్కడే దిగబెడతా అన్నాది. ఇలానే స్ట్రైట్ గా వెళ్లి రైట్ కార్నర్ లో అన్నాడు. నీకు బైక్ లేదా అన్నాడు.లేదు అన్నాడు. మేము చాలా పూర్ అన్నాడు. ఓహ్ సారీ అని వసంత్ ని డ్రాప్ చేసి వర్షిణీ ఇంటికి వెళ్లిపోయింది.

అమ్మ నాన్నలకు ఫోన్ చేసి అమ్మా...నాన్నా.! నేను ఇక్కడో అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాను అన్నాడు. సరే నాన్నా నీ ఇష్టాన్ని మేము ఎప్పుడు కాదన్నాము. ఆ అమ్మాయికి నవ్వంటే ఇష్టమేనా అన్నారు. లేదమ్మా ఆ అమ్మాయికి ఇంకా చెప్పలేదు అన్నాడు. సరే వసంత్ ముందు ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకో తరువాత కబురు చెప్పు నాన్న అన్నది వసంత్ అమ్మ.

రోజూ ఆఫీస్, క్యాంటీన్ లలో వసంత్, వర్షిణీలు కలుసుకునే వారు. ప్రేమ గురించి ఏరోజు చర్చించుకోలేదు.

మూడు నెలలు గడిచిన తరువాత!

ఆ రోజు వసంత్ పుట్టినరోజు వసంత్ కు తెలియకుండా ఆఫీస్ లో బర్త్ డే పార్టీకి అరేంజ్ చేసింది వర్షిణి. వసంత్ ఆఫీస్ లో అడుగు పెట్టాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది. లోనికి రాగానే బెలూన్స్ మోగాయి. సౌండ్ సిస్టమ్ లో హ్యాపీ బర్త్ డే టూ యూ అంటూ వస్తోంది. ఆఫీసులో అందరూ వసంత్ ను విష్ చేశారు. కేక్ కట్ చేపించారు. వర్షిణీ కేక్ పీస్ వసంత్ కు తినిపించింది. వసంత్ కూడా అలాగే ఆఫీస్ లో ఉన్న అందరూ కేక్ వసంత్ మొహానికి పూసేశారు.

సాయంత్రం ఆఫీస్ ఐపోగానే వసంత్ ఓ కాఫీ బార్ కు వెల్దాము అన్నాడు. ఎందకు అని వర్షిణీ అన్నది. ఇంత గ్రాండుగా నా బర్త్ డే సెలబ్రేట్ చేశావు. నీకు కనీసం నా స్థోమతలో కాఫీ ఐనా ఇప్పిస్తాను అన్నాడు. పర్లేదు వసంత్ అన్నది. లేదు కాఫీ బార్ వెల్దాము అన్నాడు. సరే అని ఇద్దరూ వెళ్లారు. కాఫీ ఆర్డర్ చేశాడు. వసంత్ ఇదే మంచి సమయం అనుకొని తను వర్షిణీ తో టేబుల్ పై ఉన్న రోజ్ తీసుకుకొని ఐ లవ్ యూ వర్షిణీ అన్నాడు. వర్షిణీ మరో మాట మాట్లాడకుండా వెంటనే తన చేతికున్న రింగ్ తీసి వసంత్ వేలుకు తొడుగుతూ ఐ లవ్ యూ టూ వసంత్ నీ ఈ మాట కోసమే నేను వేచి ఉన్నా అన్నది. నేను మా ఫ్యామిలీ గురించి చెప్పాలి వర్షిణీ నీకు అనగా వద్దు వసంత్ నాకు నువ్వు నచ్చావు. నీ ఫ్యామిలీ ఎలా ఉన్నా ఎంత పూర్ గా ఉన్నా మనిద్దరం ఉద్యోగాలు చేస్తున్నాము కదా అత్త, మామలను బాగా చూసుకుందాములే అన్నది. కాఫీ తాగుతూ ఇంకా మరెన్నో కబుర్లు మాట్లాడుకున్నారు. వర్షిణీ మరి మీ అమ్మ మన ప్రేమను ఒప్పుకుంటుందా? ఆ...అవును వసంత్ ఒప్పుకుంటుంది. నాన్న లేడు. నా చిన్నప్పుడే చనిపోయాడు. అమ్మ నాన్నలది కూడా ప్రేమ వివాహం. సో అమ్మ నా ఇష్టాన్ని కాదనదు. సరే మా అమ్మ నాన్నలకు చెప్తానని ఫోన్ చేశాడు. హలో అమ్మా వర్షిణీ నా ప్రేమను అంగీకరించింది అమ్మా! సంతోషం నాన్నా ముహూర్తాలు పెట్టించి కబురు చేస్తాము. మీరందరూ వచ్చేయమంది. సరేఅమ్మా ఉంటాను.

ఆ రోజు నుండి ప్రేమలోకంలో బాగా రెక్కలొచ్చిన పక్షుల్లా సినిమాలు, పార్కులు తిరగని చోటంటూలేదనుకోండి!

మూడు నెలల తరువాత మాగమాసంలో పెళ్ళి ఫిక్స్ చేసి వసంత్ కి ఫోన్ చేసింది వసంత్ అమ్మ.
పెళ్ళి పల్లెటూర్లో ఐనా చాలా ఘనంగా జరిగింది. కోడల్ని చూసుకొని ఎంతో మురిసిపోయారు.

ఫస్ట్ నైట్ రోజే ఇంట్లో అసౌకర్యాల నడుమ ఇమడలేకపోయింది వర్షిణీ. ఎలాగోలా ఈ వారం రోజులు గడిపి బెంగుళూరు వెళ్లిపోవచ్చనుకొంది.

బెంగుళూరుకు తిరుగు ప్రయాణం అయ్యారు. అత్తమామల ఆశీర్వాదం తీసుకొని వచ్చేశారు. అమ్మ నేను ఆ పల్లెటూల్లో ఉండలేనమ్మా అన్నది. సరేలేమ్మా మీ అత్తమామల్ని ఇక్కడికే వచ్చే ఏర్పాటు చెయ్యమన్నది వర్షిణి అమ్మ.

ఆఫీస్ లో పనిలో ఉండగా వసంత్ కు అమ్మ నుండీ ఫోన్ వచ్చింది. ఒరేయ్ నాన్న మీ నాన్న బుట్టలు అల్లుతుండగా కత్తి తగిలి చేతికి నారాలు కట్ అయ్యాయి అన్నది. అమ్మా నేను ఇప్పుడే బయలుదేరుతున్న అమ్మ అన్నాడు. వర్షిణీకి విషయం చెప్పగా నేను ఆ పల్లెటూరికి రాలేను అని చెప్పగానే సరే నేను వెళ్తున్నాను అని వచ్చేశాడు. అప్పటికే అనంతపురంలో హాస్పిటల్ లో జాయిన్ చేశామని చెప్పగా హాస్పిటల్ కు వచ్చేశాడు. నాన్నను చూసి వసంత్ కన్నీరు కార్చాడు. అమ్మాయి రాలేదా? అని అడగ్గా లేదు ఆఫీస్ లో చాలా వర్క్ ఉంది నాన్నా అందుకే నేను ఒక్కడినే వచ్చాను అన్నాడు. ఇప్పుడెలా ఉంది అని అడిగాడు. ఆపరేషన్ చేసి నరాలు అతికించారు అని చెప్పాడు. రెండు రోజులు హాస్పిటల్ లో ఉండి అమ్మ నాన్నలను ఇంట్లో దిగబెట్టి బెంగుళూరు వెళ్లిపోయాడు వసంత్.

ఆఫీస్ నుండి వచ్చిన వర్షిణి వసంత్ ను ఎప్పుడొచ్చారండీ? అంకుల్ బాగున్నాడా? ఇలా అడిగేబదులు రావచ్చు కదా నాతో పాటే... రానండీ! రాలేనండీ!! ఎందుకు వర్షిణీ? వసంత్ నేను మీ ఊరిలో ఆ అసౌకర్యాల నడుమ ఉండలేను. ఎప్పుడైనా వెళ్లాల్సిందేగా? లేదు పని ఉంటే నువ్వు వెళ్లి వచ్చేయ్ వసంత్ అన్నది. నేనొక్కడినే వెళ్లి నీ భార్య రాలేదంటే ఎన్నిసార్లు అబద్ధాలను నిజాలు చేయాలి?? తప్పదు వసంత్! ఏంటి నా మాట వినవా? వినను వసంత్ ఈ విషయంలో నేను ఎవరి మాట వినను అన్నది. ఏంటమ్మా అబ్బాయితో అలాగేనా మట్లాడేది.? అమ్మా నీకు తెలియదు నువ్వు ఊరుకో... ఇది నా జీవితం! నా కాపురం ఎలా మాట్లాడాలో నాకు తెలుసు అన్నది. వసంత్ కు కోపం ఎక్కువై చెంప చెల్లు మనిపించాడు. వర్షిణీ మాటలకు అమ్మ తల్లడిల్లిపోయింది. ఏ రోజూ ఏ మాట అనని నా కూతురు ఈ రోజు ఇలా అనిందని టెన్షన్ పడి మనోవేధనతో రోజూ బాధపడుతూ ఉండేది.
వసంత్ అత్త మంచాన పడటంతో కొన్ని రోజులు ఇక్కడికి రండి అమ్మా అని ఫోన్ చేశాడు. వెంటనే వసంత్ అమ్మ,నాన్నలు ట్రైన్ ఎక్కి బెంగుళూరు చేరుకున్నారు. వసంత్ స్టేషన్ నుండి ఇంటి తీసుకెళ్తున్నాడు. దారిలో అమ్మ క్యాబ్ ఆపి పండ్లు, పూలు తీసుకుని వెళ్లారు. వీళ్లని చూసిన ఆనందంలో వర్షిణి అమ్మ లేచి కూర్చొంది. మనశ్శాంతి తో త్వరగా మనోవేదనకు మందు మనసు ప్రశాంతంగా ఉండటమే...అలా రోజూ ఒకరికొకరు బాధలు పంచుకోవడంతో మనసు ప్రశాంతమై తన ఆరోగ్యం కుదుట పడింది. ఇక వెళ్లొస్తామని వర్షిణికి, వసంత్ కు చెప్పి బయలుదేరారు.

పశ్చాత్తాపంతో వర్షిణి మనసు మార్చుకొని ఎక్కడ ఉన్నామని ముఖ్యం కాదు. ఎంత ప్రశాంతవంతమైన జీవితం గడుపుతున్నామన్నది మఖ్యమని తెలుసుకొని అత్త,మామలకు పాదాభివందనం చేసి నన్ను క్షమించండి. నేను మీ పల్లెటూర్లో ఉండలేక మామ గారి చేయికి నరాలు కట్ ఐనప్పుడు రాలేక పోయాను. మీరు ఇప్పుడు మా అమ్మ కోసం ఇంత దూరం వచ్చి మా అమ్మను ఎంతో ప్రేమతో మాట్లాడించి, బాగోగులు చూసి మరలా మామూలు మనిషిని చేశారు. పర్లేదు అమ్మా ఇంత చిన్న దానికి క్షమించమనడమేంటి హాయిగా సుఖసంతోషాలతో కాపురం చేసుకోమని ఆశీర్వదించారు. వసంత్ అమ్మ నాన్నలను బెంగుళూరు రైల్వేస్టేషన్ లో ట్రైన్ ఎక్కించి ఇంటికి చేరుకున్నాడు.

ఇంటికి వచ్చిన వసంత్ ను నన్ను క్షమించు. నేను చేసింది తప్పు అని చెప్పగా తప్పు తెలుసుకొని మళ్ళీ ఆ తప్పు చేయకుంటే నువ్వు మారినట్టు సరే నా అని ఆ రోజునుండి వసంత్ వర్షిణి సంతోషంగా తమ కాపురంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రతి వేసవికి పల్లెటూరుకు పోయి సంతోషంగా కడిపేవారు!!

కలం పేరు:- కుంచె
పేరు:- చింతాలక్ష్మీనారాయణ
9908830477

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.