ప్రియా.. ప్రియతమా..

ప్రియాతి ప్రియమైన ప్రియకు

ప్రేమతో నీ ప్రాణనాధుడు,వ్రాయునది ఏమనగా

నేను క్షేమముగా ఉన్నాను అని చెప్పలేను, నీవు క్షేమము అని తలుస్తూ..నీవు క్షేమముగా ఉండాలని ప్రతి హృదయ స్పందనలో,ప్రతి శ్వాస నిచ్ఛ్వాసలో కోరుతున్నా...!!!!!!!!!!

నీవు చేసే సోషల్ సర్విస్ కోర్స్ ఎంత వరకు వచ్చింది..! నీవు వెళ్ళి ఆరు నెలలే అయినా నాకు ఆరు యుగాలుగా ఉన్నది. ముక్కోటి దేవతలకు మ్రొక్కుతునే ఉన్నా.. నీవు వచ్చే తేదికి కాలాన్ని ముందుకు జరపమని..! కాని వినరే ఈ దేవుళ్ళు నా మాట ..!!క్షణ క్షణము నిను తలుస్తు ప్రతిక్షణము నీ ఊహలో బ్రతుకుతూ.. నీవు వచ్చే క్షణము కోసం ఎదురుచూస్తున్నా ఓ అఖిలనేత్రి ..!!

నీవు నాకు దూరంగా ఉండినా..!! ప్రతి ఘడియ నీ రూపాన్ని ఊహించుకుంటూ బ్రతికేస్తున్నా..!!కాని నా శ్రవణేంద్రియములు జగత్తులోనే మధురమైన నీ స్వర సంగీత పలుకులు వినాలని కోరుతున్నాయి..!!నా దృగింద్రియములు ఛాయాపట గ్రహణయంత్రము వలె నీ చిత్రాన్ని చిత్రించాలని ఉవ్విలురుతున్నాయి..!!

నా అధరోష్ఠములు నీ అధరములతో నర్తించాలని తహతహలాడూతున్నయి..!!నా జడద్రవ్యము విరహం తాలలేక నీకై నిరీక్షిస్తున్నది ఓ ప్రియా..!! నేను వాటిని సముదాయిస్తూనే ఉన్నా.. ప్రియ త్వరలోనే వస్తుంది మీ ఆకలి తీరుస్తుంది అని..!! నేను వేచి చూస్తున్న కదా..!!మీరు కూడా వేచి చూడండి అని చెప్తునే ఉన్నా.. కాని అవి నా మాటలు వినడం లేదు..!! ఒక్కసారి నీవు వచ్చి ఒక వాలు చూపు వాల్చి.. వాటి ఆకలి తీర్చి జో కొట్టాలని కోరుతున్నా ఓ సహధర్మచారిణి..!!!

నీ రాకకై ఎదురుచూస్తు నా ఊహలో నిను తలుచుకుంటూ కారు మబ్బులు లాంటి నీ శిరోజాలపై శ్రిమన్ నారాయణుడినినై పవళించాలని ..!! నీకో విషయం చెప్పాలి ..మన ఇంట ఉన్న గోరింట తరువు నీ పెదవులలో ఊరే ఎర్ర దనాన్ని అరువు అడిగింది సుమా..!! మన పెరటిలో ఉన్న సిరిమల్లె చెట్టు పుష్పాలు పుష్పవతులు అయ్యి నీ శిగలో శింగరంలా ఒదగాలని నీరిక్షిస్తున్నాయి..!!మన గృహ లోగిలి దిగాలు చెందుతూ ఉంది ప్రియా.. నీవు వచ్చి రంగవల్లులతో సింగరించాలి అంటా..!! మన ఇంటి గడప గడియారం వైపు చూస్తు నీవు వచ్చే క్షణం కోసం వేచి చూస్తున్నది పాపం.. పసుపు కుంకుమతో,మామిడి తోరణాలతో నీవు వచ్చి ఎప్పుడు అలంకరిస్తావా అని దాని ఆశ..!!

నీకు గుర్తు ఉన్నదా... మనము సోముడు వికసించే వేళ విరహలు తాలలేక ఒక్కటై విరహ గీతలు పాడుకొని సోమాస్తమయం అయ్యే వరకు రతి క్రీడలు ఆడాము ...ఆ మధురక్షణాలు తలుచుకుంటూ ఉంటే మదిలో వీణాలు మ్రోగుతున్నాయి ప్రియ సఖి ..!!!

నా కళ్ళల్లో సూర్య మెరుపులతో,పెదవులలో తీపి మకరందంతో,మాటలలో చిన్న పిల్లల మాటలతొ,నా మనసులో నీ రూపముతో..!!నువ్వే నా స్వర్గం,నువ్వే నా జీవితం,నువ్వే నా కోరిక,నిన్నే నేను కోరుతున్న,ఇకా మీదట నన్ను వదిలి నీవు వెల్లకు నీవు లేనిదే క్షణమైన గడపలేకున్న ప్రియ..!!

వలపన్న తీపి తొలిసారి చూపి తెల్లని నా హ్రుదయం పై రంగుల హరివిల్లై చిగురు తొడిగింది.. ప్రేమ సరికొత్త ఆశలతో కురిసే వెన్నెలలో పరవశాలు పంచే పాల సంద్రంపై ఊసులెన్నో పంచుకున్నాను... నా కళ్ళలో నిలిచిన నీ రూపంతో ఎగిసి పడుతుంది.. మనసు కలల అలలపై గిలిగింతలు పెట్టే నీ చిలిపి తలపులతో..ఓ ప్రియా..!!

ఒంటరి తనంతో చెంపమీద జారే నీటి చుక్క ఆరడానికి గాలి కూడా సహకరించడం లేదు ప్రియ..!! నీ జ్ఞాపకాల పూదోటలో నా ఆలోచనల తుమ్మెదలెన్నో నా నీలాకాశపు గడియారంలో తలచిన క్షణాలను లెక్కించిన తారలెన్న.. నీ నన్ను తాకు క్షణంలో ప్రతీ నిమిషానికి ఎదురుచూసే యుగాలెన్నో... నువ్వు దూరమైన వేళలో నిన్ను చేరలేని నా కన్నీటి సంద్రంలో ఎగసిపడే అలలెన్నో..!!

ఇల్లంతా చిన్నపోయింది.. నవ్వుల పువ్వుల రవ్వలు ,పాటల గువ్వలు, అల్లరి పాటలు... మాటలు... ఆటలు....ఇవన్ని లేవు..! పక్కింటి పంకజం గారు అడిగాను అని చెప్పమన్నారు ... చాల సన్నగా అయిపోయాను.. నీ వంట లేక నీవు చేసే వంకాయ కూర ,ముద్ద పప్పు , కాకరకాయ వేపుడు ఎప్పుడు రుచి చూస్తానో ఎమో..?

నీ తెల్ల తెల్లని చర్మం వల్లనే కదా తెలుపు రంగు జన్మించినది,నీ నల్ల నల్లని కురుల వల్లే కదా రాత్రి జన్మించినది.!! నీ ఎర్ర ఎర్రని పెదవుల వల్లె కదా..అగ్ని జన్మించినది.!!నీ తియ్య తియ్యని పలుకులు వినాలని నా మనసు కోరుతున్నది..!!!

నీ అందెల రాగాలు,మువ్వల సవ్వడి లేక ఇంట్లో నిశబ్దం అక్రమించింది నీవు వచ్చి దాన్ని తరిమి తరిమి కొట్టాలి సుమా..నాకు విలైనంతా వరకు ఇంటిని శుభ్రముగానే ఉంచుతున్న ,మొక్కలకు క్రమం తప్పకుండా నీరు వెస్తున్న అన్నటు రోజ చెట్టుకు పువ్వులు పూస్తున్నయి..! ప్రియ..!

ఒంటరితనాన్ని భరించలేకున్న.. ఇంకా ఎన్ని రోజులు నీ కోసం.. త్వరగా రా..బంగారు.. మొగుడి సేవ చేయకుండా సమాజ సేవ చేయటం ఎలా అని నేర్చుకోవడానికి వెళ్లావా...భయపడకు.. చమత్కరించాను. అంటే.. నేను రాస్తూ ఉంటే కలంలో సిర ,పేపర్లు అయిపోతూనే ఉంటాయి కాని.. ఉంటాను ఇంకా...!!!!!జాగ్రత్తగా ఉండు.. వేళకు భోజనం చెయ్యి.. సిగ్గులని కాస్త నా కోసం దాచి ఉంచు.. నా మీద బెంగ పెట్టుకోకు.. క్షేమముగా లేను అని ఊరికే అన్నాను.. నీతో గడిపిన మధుర క్షణాలు నా మదిలో పదిలంగా దాాచాను.. అవి గుర్తు చేసుకుంటూ అనందంగా ఉంటాను. నీవు కోర్సు కంప్లిట్ చేసాక మనము ఊటి వెళ్దాము.. ఎందుకు అని అడగకు అర్థం చెసుకో.. అమ్మా ఉంటా అని చెప్పి మళ్ళి ఇంతా మట్లాడేసా ఉంటాను.............!!!!! ఎదురుచూస్తూ ఉంటాను నీ లేఖ కోసం ఓ ప్రియా ..!!!

ప్రియ...ప్రియా ...ప్రియా ఐ లవ్ యు .....!!!!

ఇట్లు నీ ప్రియ సఖుడు,

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.