మూర్ఖులకు హితము చెప్పరాదు!అనగనగా ఒక అడవి. అందులోని ఒక చెట్టుపైన ఒక చిన్న పక్షి నివసిస్తుండేది.

ఆ చుట్టుప్రక్కల చెట్లపైన కోతులు నివసిస్తుండేవి.

చలికాలం వచ్చి చలి బాగా ఎక్కువైంది .

చలి బాధకి తట్టుకోలేక చలి మంట వేసుకుందామనుకున్నాయి కోతులు. అప్పుడు వాటికి అక్కడంతా బోలెడన్ని మిణుగురు పురుగులు (Fire Flies) ఎగురుతూ కనిపించాయి.

వాటిని చూసి నిప్పురవ్వలు అని భ్రమ పడిన కోతులు వాటి చుట్టూ కూర్చుని చలి కాచుకోసాగాయి.

అది చూసిన చిన్న పక్షి, కోతుల తెలివి తక్కువతనానికి నవ్వుకుని, వాటి వద్దకు వెళ్ళి ‘ మిత్రులారా ! అవి మిణుగురు పురుగులు అంతేకానీ మీరనుకుంటున్నట్లు నిప్పు రవ్వలు కావు . వాటివల్ల చలి తీరదు. సరిగ్గా నిప్పు వెలిగించుకుని చలికాచుకోండి’ అంటూ సలహా ఇచ్చింది.

ఆ మాటలు విన్న కోతులకు కోపం వచ్చింది.

‘నోరుమూసుకో! చూడడానికి వేలెడంత లేవు నువ్వు మాకు సలహాలు ఇచ్చేటంతదానివా? ఆ పాటి బుద్ధి మాకు లేదనుకున్నావా? మరీ అంత పొగరా?’ అంటూ ఆ చిన్న పక్షి మెడని ఒడిసి పట్టుకుని దూరంగా విసిరేశాయి.

ఆ పట్టుకు చిన్నపక్షి గిలగిలా కొట్టుకుని విసురు వేగానికి అల్లంత దూరాన వెళ్ళి పడి ‘బుద్ధిహీనులకి సలహా చెప్పాలనుకున్నాను చూడు అదే నా పొరపాటు’ అనుకుని చాలా సేపు బాధతో మూలుగుతూ ఉండిపోయి బాధ కొంత ఉపశమించగానే నెమ్మదిగా డేక్కుంటూ అక్కడినుండి వెళ్ళిపోయింది.


నీతి: మూర్ఖులకి సలహా చెప్పాలని చూస్తే చెప్పినవాళ్ళకే నష్టం వాటిల్లుతుంది.


*****సమాప్తం*****
telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.