ఆమె (కురచ కథ )

ఎడతెరిపి పనులతో విసిగిపోయి అలా కాసేపు తిరిగివద్దామని బైటికి అడుగు పెట్టాను  ఎండ  వంట్లోని నీరునంతా ఆవిరి చేస్తుంది ,ఇంత కన్నా లోపలే నయమనుకున్నాను .ఇంతలో కనుల ముందు నిండుగా చీర కట్టుకొని ,నుదుటున గుండ్రని బొట్టుతో తల్లో పూలతో నడుచుకుంటూ నా ముందుకొచ్చి నిలబడి,నావైపే ఆసక్తిగా చూస్తుంది .బహుశాఏదో అడగాలనుకుంటుంది ,

నువ్వు ...

నా పేరు ఈశ్వర్..అందించాను.

తన ముఖం వెలిగిపోయింది ,నేనెవరో తెలుసా? అడిగింది.

రెండు క్షణాలు ఆలోచన తర్వాత గుర్తుకువచ్చింది,తను నా క్లాస్మెట్ వెన్నెల, పేరుకు తగ్గ సౌందర్యం .కూడా ఒక పిల్లాడు కూడా ఉన్నాడు. ఈ ఆధునిక సమాజం లో మనుషులను గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అని అప్పుడు నాకు తెల్సింది ,ఎన్నో వేల కోట్లు ఇచ్చిన రాని ఆ అనుభూతి తనని చూస్తే కలుగుతుంది .

ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాక వెళ్ళొస్తానని చెప్పి ,పిల్లాడిని టాటా చెప్పమంది .వాడు ఆశగా నా వైపు తిరిగి బాయ్ అంకుల్ అన్నాడు .

నాన్న అని పిలవాల్సిన వాడు. కాలం కక్ష్య తో నన్ను వాడికి అంకుల్ ని చేసింది .అని అనుకుంటూ వాడి చేతిలో వంద రూపాయల నోటు పెట్టాను .వాడు ఆనందంగా వాడి అమ్మతో వెనుదిరిగాడు . వాళ్ళు కనుమరుగయ్యే దాక చూసి, నేనూ కన్నీళ్లు తుడుచుకుంటూ నా ఆఫీస్ వైపు అడుగులు వేసాను .
బై

ఎం.టి.ఎన్

{రాఘవ నాయక్}
telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.