కోతి న్యాయంకోతి న్యాయం


‘’ఇదిగో ...ఏమండీ....మిమ్మల్నే ..........ఇళ్ళు ఊడ్చడానికి చీపురు అరిగిపోయిది....బజారు వెళ్ళినపుడు ఒక చీపురు కొనుక్కొని వస్తారా”” ..........దీర్ఘం తీస్తూ చెప్పింది సావిత్రమ్మ......

‘’అలాగేలే.””....బదులు పలికారు సావిత్రమ్మ భర్త సుందరయ్య గారు..

బజారు కెళ్ళినప్పుడు గుర్తు పెట్టుకొని చీపురు కొనుక్కొని వచ్చారు సుందరయ్య గారు.

చీపురు అటుత్రిప్పి ఇటు త్రిప్పి ఊపి ‘’అబ్బే .... ఏం బాగాలేదు.... ఇన్నేళ్ళు వచ్చినా చూచి తేవడం తెలియదు

ఎంతండీ”” .........అంది.

‘’6౦ రూపాయలు.””.........

‘’అమ్మో.... అంత రేటే... బేరం చేయవచ్చును కదా... ఎంత అంటే అంత ఇచ్చి రావడమే”.......

ఎండలో ఊసురుమంటూ వచ్చిన ఆయనకు మంచి నీరన్నా ఇవ్వకుండా సతాయిస్తుంటే ఏమనాలో తెలియక నిట్టూర్చాడు సుందరయ్య గారు.

  • * * * * *

మరురోజు వసారాలో కూర్చొని పేపెర్ చదువుతున్నారు సుందరయ్య గారు. సావితమ్మ వాకిట్లో ముగ్గు వేస్తుంది..........’’చీపుర్లో .......చీపుర్లు”.........అంటూ పోతున్న వృద్దున్ని చూచి పెలిచింది సావిత్రమ్మ.

‘’ఇప్పుడెందుకు నిన్ననే తెచ్చానుగా” .........అన్నారు సుందరయ్య గారు.

‘’అ...తెచ్చారులే........” అంటూ అతనితో బేరమాడ సాగింది.....

‘’ఎంత”...... ‘

’౩ చీపురులు 120 రుపాయలమ్మా “”............

‘’ఒక్క చీపురు 30 రూపాయలకు ఇవ్వు”” ఎలాగైనా తను భర్త తెచ్చిన దానికన్నా సగం రేటుకే కొన్నాను అనిపించుకోవాలని ఆమె ఆశ.

‘’నాలుగు తీసికుంటే ఇస్తానమ్మ“”...అతని ముఖం లో నిరాశ.

‘’ఇప్పుడు మనకు నాలుగు చీపుర్లెందుకు?..........ఉన్నది ఇద్దరం’’ సుందర రామయ్య గారి ప్రశ్న.

‘’మీరు ఊరుకొండి” దబాయించింది. చీపుర్లు ఏరటం మొదలెట్టింది..........’’ఎంతండీ”” ....దారేపోతున్న సుశీలమ్మ ఎంక్వయిరీ చేసింది. `120 కి 4 అండీ”...గర్వంగా జవాబు ఇచ్చింది.......ఎందుకండీ ......100 కు నాలుగు చొప్పున మొన్న మేము కొన్నాము’’ టపాకాయ పేల్చింది.........’’అవునా....... విన్నావా ముసలాయనా .........మరి 100 కు 4 ఇవ్వు....””

మరలా బేరం మొదలయ్యింది......

‘’లేదమ్మా..... ఎంతో కష్టపడి, అడవిలోకి వెళ్లి తెచ్చి, ఎండ బెట్టి ....చాలా పని ఉంటుందమ్మా ....బోణీ బేరం...110 ఇవ్వండి.....పిల్లలు గలవాన్ని”” ప్రాధేయ పడుతున్నాడు. తాను ధర పెడితే ఇంకేమైనా ఉందా..... సుశీలమ్మ ఊరువాడ ఏకం చేసి తనకు డబ్బు అంటే లెక్కలేదు...అని టాంటాం వెయ్యదూ.......తన రేటు మీదే భీష్మించుకొని కూర్చోన్నది సావిత్రమ్మ.

అ ముసలాయన్ను చూస్తుంటే సుందరయ్య గారి మనస్సు ద్రవించుకు పోయింది. చినిగిన బన్నీ, మురికి పట్టిన పంచే, తలమీద కండువ చుట్టుకుని బ్రతుకుదెరువు కోసం పోరాడే బక్కచిక్కిన బీదవానితో బేరాలు ఆడుతున్న సావిత్రమ్మను చూస్తుంటే ఎక్కడలేని కోపం వచ్చింది ఆయనకు.

ఇంతలో ‘’సరే తీసికో తల్లీ””...అన్నాడు ఆతను.

సావిత్రమ్మ ఏరుకొని ‘’డబ్బులివ్వండి’’ అని భర్తకు హుకుం జారీ చేసింది.

కోపంగా ఉన్నా మారు మాట్లాడకుండా జేబులోంచి 100 రూపాయల నోటు తీసి ఇచ్చాడు.

అతడు కట్ట నెత్తిన పెట్టుకొని ముందుకు సాగిపోయాడు......గోడ మీద నుంచి రాఘవమ్మ గారు ‘’ఏమిటి సావిత్రమ్మా!

చేపుర్లా....” ప్రశ్నించింది. విజయ గర్వంతో......’’అవునండీ.... 100 కు 4 ....మీరు తీసికుంటారా’’ అడిగింది.

‘’వద్దు.....వద్దు.......వీటిలో 4 చువ్వలే ఉంటాయి. పైన కలర్ పేపర్తో చుట్టి ఉంది, 4 రోజులు ఊడవగానే చేతి బరువుకు అన్ని ఊడి పోతాయి... 60 రూపాయలైనా షాప్ లో తెచ్చిన చీపురు 6 నెలలు వస్తుంది”” ....అంది రాఘవమ్మ.

ఇప్పుడేమంటావు....అన్నట్లుగా సావిత్రమ్మ వేపు చూచారు సుందరయ్య గారు....... చూచి చూడనట్లు చీపుర్లు చేటలోకి తీసికుంది సావిత్రమ్మ...


ఇంతలో లోపలి నుంచీ సావిత్రమ్మ కూతురు బేబీ........’’అమ్మా!..........పొయ్యి మీద పాలు పెట్టి వాకిట్లో బేరాలేమిటి.....గిన్నె కాలి మాడు వాసన వస్తుంటే చూచాను”” అని కేక వేసింది. ‘’అయ్యో..అయ్యో....లీటరు పాలు......అంటూ లోపలి పరుగెత్తింది సావిత్రమ్మ ............’’అత్తయ్యగారు.........కోతి.....పల్లి పాకెట్ తెచ్చి మా డాబా మీద ఆగం చేస్తున్నాయి ,.....మీవేనా””.......కేక వేసింది రాఘవమ్మ గారి కోడలు.


‘’1 కేజీ పల్లీ పాకెట్..........కోతి న్యాయం సరి అయినదే ...సావిత్రీ! సుందరయ్య గారు తీర్పు చెప్పారు..........

అవాక్క యి చూస్తూ ఉంది పోయింది సావిత్రమ్మ

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.