ఎదో రాయాలని ఎదో చేద్దాం అని..

కవితవేశం తో కాలం పట్టుకున్నా..

అయినా నా కలం నాపై కనికరం చూపట్లేదు..

నా ఆలోచనలు అగమిస్తున్నాయ్..


కోరికలకు కొదవ లేదు..

కానీ కలం కదాలట్లేదు..

కానీ రాయాలనే ప్రయత్నం..

ఫలించిదని తేలిసిన ముగించని మూర్ఖత్వం..


సమయం సవాలు చేస్తూ..

పగలు పరిహాసం చేస్తూ..

చీకట్లు చిందరవందర చేస్తూ..

అలుపేరుగని ఆలోచనలు చేస్తూ...


పూర్తిగా ప్రకృతి నన్ను పరిభ్రమించేలా చేసిన వేళా..

నా మాటలు కూడా మౌనాని దాటినా వేళ..

ఈ ప్రపంచంలో ప్రతిదీ నాకు శూన్యంగా మిగిలిన వేళా..

నాలో ప్రజ్వలించేసే కవిత్వాలు నన్ను

ఏనాడూ ఒడి చేర్చుకుంటాయో


telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.