మురిపానికి వయస్సు అడ్డమా? ( వేలన్ టైన్ డే స్పెషల్ )


షాట్ 1
కట్ చేసి ఓపెన్ చేయ్యగానే
ముసలి హీరో దొడ్లో కాకరపాదును తెగవెదుకుతూ
హా! దొరికాయి మొత్తాఇకి నాలుగే నాలుగు కాకరకాయలు
ఇక పంచుకోడానికి పోట్లాట అక్కర్లేదు ముసలిదానికి రెండు నాకు రెండు ఇదిగో నిన్నే ఓసారిల్లారా
హీరోయిన్ ముసలావిడే వస్తుంది
ఎందుకయ్యా అంత గావుకేకలు
చూడవే చివరికి సాధించాను నాలుగు కాకరకాయలు దొరికాయి
ఊ బడాయి. బజార్లోకి వెళ్ళి కొనొచ్చుగా
బజార్లో కొంటే మజా ఏముందే. మనం కష్టపడి పెంచిన కాకరపాదు వుండగా
ఏమయ్యా ఆపాదు ఎండిపోయేటట్టు వుంది. ఇంకా దాన్ని కాకరకాయలు కాస్తాయని ఆశేనా? అయినా కాసినా అవి కుక్కమూతిపిందిలే
ఏమిటి? కుక్కమూతిపిందెలా చూడు ఎంత చక్కగా నవనవలాడుతూవున్నాయొ. అదిసరేగాని ఈ నాలుగు కాకరకాయలు వుల్లిఖారంపెట్టి వండు. అలాగే వేడిచేయకుండావుంటుంది పెసరకట్టు కాచు
అబ్బో ఇంతోటి నాలుగు కాకరకాయలు వేడిచేస్తుందిట
పోనీ నాక్కావాలి సరేనా
అల్లగే. కరణంగారు పిలిచారుట మీరువెళ్ళి వచ్చెయ్యండి. ఈలోగా కూర మీరు ఉబలాటపడే పెసరకట్టు కాచి సిద్ధంచేస్తాను
అన్నట్టు ఈవేళ శనివారం కదూ. అమెరికానుంచి చిన్నాడు పిలుస్తాడేమో తొరగారండి

కట్ చేస్తే రెండో షాట్
మన ముసలిహీరో గబగబా వస్తూ ఏమే ఇదిగో ఎక్కడవున్నావ్
లోపలనుంచి వస్తూ అబ్బ ఆగావుకేకలు వద్దన్నానా?
నేను స్నానంచేసి మడికట్టుకు వచ్చేస్తా. ఈలోగా నాకు కాకరకాయ కూర అన్నం వడ్డించు
(నసుగుతూ) కాకరకాయ కూరా మరి మరి
మరేమిటే ఏంజరిగింది. కొంపతీసి మాడబెట్టావేమిటి
అదికాదండి. వుల్లి ఖారంవేసి నాలుగు కాయలు వండా. కాని కాని
కాని ఏమిటే? కుక్కగాని వచ్చిందా?
కాదండి ఒక్క కాయేమిగిలింది
ఒక్క కాయా అదేమిటి? నేను ఇచ్చింది నాలుగు కదా అన్నీ వండలేదా
వండానండి.
మరి
మూడుకాయలు నేనుతిన్నాను
వుట్టికూర తిన్నావా? నీచోద్యంకూలా ఎందుకు తిన్నావే? కడుపులో మండదూ?
అదికాదండి వుడికిందోలేదో అని ఒకటి తిన్నా

వుల్లిపాయకూడావుడికీందోలేదో అని మరొకటి తిన్నా
అహా
వుప్పువేసానోలేదో అని అనుమానం వచ్చి మూడోది తిన్నా
నేను నమ్మను నువ్వు తిన్నావంటే ..... ఏది ఆకూరగిన్నె చూపించు
(లోపలికి వెళి) ఇదిగో చూడండి ఒక్క కాయేవుంది
ఓసి నీఆబ బంగారంగానూ వట్టికూర ఎలాతిన్నావే
ఇదిగోనండి ఇలా
ఆ ఆ ఇదీ తినేసావు
ముసిముసి నవ్వులు నవ్వుతుంది
వెంటనే హీరో ఆమెను అమాంతం వాటేసుకుని ఓ ముద్దు ...
అయ్యో అయ్యో నామడికాస్తా పాఛిపడేసారు. అయినా ఈ వయస్సులో మీకీ పాడు బుద్ధులేమిటి? నేను తిన్నానని కోపగించుకుంటారేమొ అనుకుంటే అవ్వ!
అదికాదే నువ్వు ముసుముసి నవ్వు నవుతూ చెప్తూవుంటే మనపెళ్ళిలో బిందెలో వుంగరం నాకు దొరికితే నాచెయ్యి గిల్లి నువ్వు వుంగరం కాస్త లాక్కొని ముసిముసినవ్వులు నవ్వావు గుర్తుందా? అదిగుర్తుకువచ్చిందే. పోనిలే వెధవకాకరకాయకూర. పెసరకట్టు, వుల్లావకాయ పెరుగు చాలు
అయ్యొ నాపిచ్చిమొగుడా. నేను నిజంగా తిన్నాననుకున్నారా? లోపల బేసినులో వుల్లిఖారంపెట్టిన నాలుగు కాకరకాయలు కూర అల్లగేవుంది
మరీప్పుడు నువ్వుతిన్నదెక్కడిది?
మీరువెళ్ళాక నేను మళ్ళీ పాదంతా ఎండిపోతోందని పీకేసా. అందులో మరొకటి దొరికింది
అవునా అయితే నువ్వు ఒకటి తినేసావుగనుక మూడు నాకు ఒకటినీకు
అన్యాయం నాకు రెండు మీకు రెండు
కట్ చేస్తే
శుభం కార్డు పడుతుంది

ఆలుమగల మురిపానికి వయస్సు అడ్డమా?
(ఇంతులో కొంత కధ నేను విన్నది. దానికి నాస్వంత పైత్యంకొంత)
షరా: టైపింగు తప్పులుండవచ్చు. కొంచెం సర్దుకుచదవండి

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.