వైద్యశాలనమస్తే! వైద్యశాల పదానికి బదులు ఆసుపత్రి అనెడి పడికట్టు పదం ప్రసార మాధ్యమాలలో విపరీతంగ ప్రచారంలోనికి వచ్చింది. వైద్యులు, రచయితలు, భాషా నిపుణులు, ప్రభుత్వ అధికారులు కూడ గుడ్డిగ అనుకరిస్తున్నరు. ఆసుపత్రి అసలైన తెలుగు పదమైనట్లు భావిస్తున్నరు. పాశ్చాత్య పాలనలో క్రిస్టియన్ మిషనరీలు ప్రజల లోనికి చొచ్చుక పోయెటానికి కొన్ని విదేశి పదాలను దేశి పదాల వలె మార్పు చేసినయి. అందులో హాస్పిటల్ ఒకటి! ఉత్తరాదిన 'ఆస్పతాల్' అని, దక్షిణాదిన 'ఆసుపత్రి' అని మార్పు చేసిండ్రు. మన భాషలో సరియైన పదాలు లేనప్పుడు, అన్యదేశ్యాలను స్వీకరించవచ్చు. కాని, స్వచ్ఛమైన పదం 'వైద్యశాల' ఉండంగ ఈ విచిత్ర పద ప్రయోగంలో, స్వీకారంలో ఔచిత్యం ఎంత మాత్రం లేదు. 'వైద్య కళాశాల' ను వ్రాస్తున్నట్లె, 'వైద్యశాల' ను వ్రాయాలె. హాస్పిటల్ నాలుక తిరుగని కఠిన పదమేమి కాదు. కనుక, యధాతథంగ 'హాస్పిటల్' అని కూడ ఉచ్ఛరించ వచ్చు; లిప్యంతరీకరణ చేయవచ్చు. కమ్యూనిజం ప్రభావిత వైద్యులు, డెంటిస్ట్ లు మాత్రం హాస్పిటల్ లకు 'ప్రజా వైద్యశాల', 'దంత వైద్యశాల' అని పేరు పెట్టుకొంటున్నరు. ప్రజల మీద రుద్దబడిన అవకర పదం ఆసుపత్రి ని పరిహరించాలె. అచ్చమైన పదం 'వైద్యశాల' మాత్రమే వ్యవహారంలో ఉండెడి విధంగ ప్రత్యేక శ్రద్ధ తీసికోవాలె. వైద్యశాల, హాస్పిటల్, దవాఖాన ఉపయోగించ దగిన సరియైన పదాలు!

~డా.రాపోలు సత్యనారాయణ, పాలకుర్తి, జనగామ జిల్లా, తెలంగాణ

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.