పేరు : కట్ల శ్రీనివాస్..

కవిత సంఖ్య : 151...

శీర్షిక : ప్రేమ మాదుర్యం...


అందమైన ఊహలతో రాస్తున్నాను ప్రేమ కవిత,

మదిలో మెదిలిన భావాలను అక్షరాలుగా మలిచి నా ప్రేమను తెలుపుతున్నాను..

నా మనసులో నీఆలోచనలు చెరిపివేయలేను,

అందుకే నిను మరవలేను.

నా గుండె గదులలో నిన్ను దాచుకుంటాను ప్రియా..!!!

యుగాలు మారినా నీ ద్యానాన్ని మరవలేకుండా ఉంటాను.

ప్రేమకి అర్ధమే మనము,

ఆ ప్రేమకి ప్రతిరూపం మనము,

ప్రేమకి నిలువెత్తు నిదర్శనం మనము,

ప్రేమని విడవలేము ఏతరుణము..

నా గుండెలో దాగి ఉన్న నీ గురుతులు,

ఇవే మన ప్రేమ స్మృతులు..!!

నీ హృదయంతో నా మది ఊసులాడుతుంది.

నా మదికి నీ మది చెప్పిన అందమైన మాట ఏమిటో చెప్పనా ప్రియా..!!!

" నేను నిన్ను ప్రేమిస్తున్నాను "
telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.