కుందేలు తెలివి(కథ)

అడవిలో ఒక కుందేలు విప్పపూలను ఆదమరచి తింటుండగా హఠాత్తుగా వచ్చిన నక్కకు దొరికిపో యింది.కుందేలును ఒడిసిపట్టుకున్న నక్క"ఆహా! ఎన్నాళ్ళయింది,కుందేలు మాంసం రుచి చూసి" అని లొట్టలేయసాగింది.విప్పపూలమీది ప్రీతితో రానున్న ప్రమాదాన్ని గుర్తించని తన దురదృష్టానికి చింతించ సాగింది,కుందేలు.నక్క వికటంగా నవ్వి"ఏంటి ఆలోచి స్తున్నావు.ఎలా తప్పించుకోవాలనా?నాకు ఆహారం గాకుండా నిన్ను రక్షించేవాళ్ళెవరూ లేరు.నీకు చావు ఖాయం"అంది.
అప్పటికి కొంచెం దైర్యం తెచ్చుకున్న కుందేలు ఆలోచ నలనుండి బయటపడి"అదేంలేదు నక్కమామా!ఇవాళ పర్వదినం.నీవంటి పుణ్యపురుషునికి ఆహార మైతే సరాసరి స్వర్గానికి వెళ్ళి మోక్షాన్ని పొందుతాను.అంతమంచి అవకాశాన్ని ఎలా వదులు కుంటాను.పారిపోయే ఉద్ధేశ్యం నాకు లేదుగాని,ఇంటి దగ్గర నాకు రెండు కూనలున్నాయి.వాటిని ఆఖరు సారిగా చూసి వస్తాను"అంది ప్రాధేయపడుతూ. ఆమాట వినగానే నక్కకు ఆశ కలిగింది.కుందేలుతో పాటు దాని పిల్లల్ని కూడా తినాలని ఉబలాట పడింది
నక్క గంభీరంగామొహం పెట్టి"ఓసి కుందేలా!ఇంటికి పంపితే తిరిగి వస్తావని నాకు నమ్మకం లేదు.కాబట్టి నీకూడా నేనూ వస్తాను.మీ ఇంటికి వెళ్ళాక నీపిల్లలతో మాట్లాడి బయటికి వచ్చాక నిన్ను తినేస్తాను,సరేనా?" అంది.కుందేలు అందుకు అంగీకరించింది.
కుందేలు నక్కను తన నివాసంవైపు కాక మరోవైపుకి తీసుకువెళ్ళసాగింది.ఆదారిలో వేటగాళ్ళు ఏనుగు లను బంధించటం కోసం లోతైన గోతులు తీసి వాటికి ఆకులు కప్పి ఉంచటం కుందేలు చూసింది.ఎలాగోలా నక్కను ఆ గోతిలో తోసి దాని పీడ వదిలించుకోవాలని ఆదారి పట్టింది.కొంతదూరం వెళ్ళాక "నక్కమామా! నడవాలంటే విసుగ్గా ఉంది.వంగుళ్ళు దూకుళ్ళు ఆట ఆడుకుంటూ వెళ్దామా?"అంది.నక్కకి ఇష్టంలేకపో యినా,ఎలాగూ చచ్చేకుందేలు కదా!దీని ఆఖరు కోరి కగా భావిద్దాం"అని ఒప్పుకుంది.
అలా ఒకదానిమీద ఒకటి దూకుకుంటూ ఏనుగుల గోతివరకూ వచ్చాయి.గోతి అంచుమీద కుందేలు నిల బడి "జాగ్రత్తగా దూకు నక్కమామా!ఇక్కడ ముళ్ళు న్నట్టున్నాయి"అంది వెక్కిరింపుగా.నక్క నిర్లక్ష్యంగా "నిక్షేపంగా దూకగలను.నీబోడి సలహాలు అక్కర్లేదు" అంటూ ఒక్కదూకుదూకి అమాంతంగా గోతిలో జారి పోయింది.గోతిలో పడిపోయిన నక్క"మోసం దగా" అంటూ కేకలు వేయసాగింది.
కుందేలు"అల్పప్రాణులమీద దౌర్జన్యం చేయటం న్యాయమా?నీబారినుండి తప్పించుకోవాలనే ఈ గోతి వైపు నిన్ను తీసుకువచ్చాను.తిండి,నీరు లేక మల మలమాడి చావు"అని ఆనందంగా తన నివాసంవైపు పరుగెట్టింది.దొరికిన కుందేలును అక్కడే చంపకుండా దాని కూనల్ని కూడా తినాలనే దురాశే నా కొంప ముం చింది"అని విలపిస్తూ నక్క చచ్చింది.
-----కౌలూరి ప్రసాదరావు
'ఆదివారంఆంధ్రప్రభ'4ఫిబ్రవరి2007.

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.