ఏటో ఈయాల నా గుండెల్లో
గుబులుగా యుండాది
తలుసుకొంటే సాలు
బేజారైపోతుండాది
ఏంమాయరోగమో అది
మగాళ్ళనట్టుకు పీడిస్తుండాది
మొలకలెత్తకముందే మొదలై
మీసాలు నెరిసినా వదలడంలేదాయే
ఏటీమాయదారి
మొగోళ్ళిట్టైపోనారు
గుంట కనబడ్డదంటె
గుటకలేస్తుండరు
మొగ్గైనాసిదిమేస్తుండ్రు
ముదితైనా ముట్టేస్తుండ్రు
ఆడవాసన తగిలితే సాలు
పడగలిప్పేస్తుండ్రు
బుసలుగొట్టి కాటేస్తుండ్రు
ఏటిరా ఈకాలం ఇట్టైపోనాది
సదువు సెప్పేటోడ్ని నమ్మలేము
సన్నాసోడ్ని నమ్మలేము
అంతెందుకు పుట్టీంచినోడికికూడా
పుట్టేస్తుండాది రోగం
కామరోగం.....
కళ్ళుపొరలుగట్టాయి
కుళ్ళుకోరికలకు
భయంతో బిగుసుకు పోతుండారాడోళ్ళు
ఇంటాబయటా
ఈకడికే మనువాడ
కన్నెపిల్లలు దొరకక
బమ్మచారులు బెండకాయల్లా
ముదిరిపోతుండరు
మునుముందు ఆడోళ్ళు
అరవైమందికి ఒకరుంటరేమో
మగాళ్ళను పీడించే ఆ జబ్బు
తగ్గకపోతే

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.