నా చెల్లి సింధూ.. !!

నా చెల్లీ! సింధూ

సీసం

పుత్తడిబొమ్మంటి పూసర్లసిందమ్మ పట్టుదలగలిగి పరువునిలిపె ఆటాడు తీరులో వేటాడు పులియామె ఉత్కంఠ రేపును ఉరుముమల్లె చిన్నారిసింధులో చిరుతపులికన్పించె గెలుపునే గురిచూసె గెలిచి చూపె బంగారు తల్లిరా బాగుగా ఆడెరా భరతమాతకుయీమె హారతిచ్చె

ఆ.వె: పతక మొట్టుకొచ్చె పదునైన ఆటతో ముదము‌ పంచె మనకు ముద్దుగుమ్మ చిన్నదాడెనండి చిచ్చరపిడుగులా కోట్లజనము తనను కోరిమెచ్చె

సీసం::: తెలుగుతేజముచూడు వెలుగుచిమ్మెనుచూడు రియోలో చూపెను‌ రియలు పవరు చిత్రమ్ము చేసెను చక్కగా పోరాడె పతకంబు తెచ్చెను ప్రతిభ చాటె విజయమ్మరమణల విలువైన పుత్రిక కూతురి కోర్కెకు కూర్చె బలము తల్లిదండ్రులుకూడ తక్కువేం కాదండి ఇరువురూ యింపైన ఆటగాళ్లే

ఆ.వె: ఆటగాళ్లయింట అవతరించినతార అలుపు సొలుపు లేక ఆటలాడె నిత్యకృషి సల్పె నియమంబు పాటించె విజయమందుకొనెను వినయశీలి

సీసం::: రజతంబు తెచ్చినా రంజుగా ఆడింది కనకంబునకుమించుమనసుకలది సంస్కారమామెకు సంపూర్ణముగనుండె వినయంబుగౌరవం తనకుజాస్తి చెదిరిపోలేదులే చేజారి కనకంబు కరొలినాకిచ్చెను కౌగిలింత గురువుగా గోపీకి గొప్పగా విలువిచ్చె నేర్పుగాఆడింది నెగ్గె పతకం

ఆ.వె: పతకమేదిగానిచితకేసియాడింది పసిడికంటెమించు మిసిమి చూపె తెలుగుపిల్లతెగువవెలుగులోకొచ్చెలే! జయము సింధు కెపుడు జయముజయము #################### చావలి శేషాద్రి సోమయాజులు

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.