మాతృదేవోభవ అమ్మకు శతకోటి పాదాభివందనం

మాయలేనిదీ మాయం కానిదీ మా

తృమూర్తి అవ్యాజమైన ప్రేమ మాత్రమే

దేవదేవుని కైనా అమ్మే కదా దేవత. చా

వో రేవో యైన ప్రసవాన సైతం తన తపన నీ

భవిత మీదనే కదా, తనను చీల్చుకుని

వచ్చిన నీకై అహర్నిశం ఆరాటం పోరాటం

అనురాగపు గొడుగు నీకు పట్టి, కష్టాల చె

మ్మ నీకు అంటనీక, తన రెక్కల మాటున

కునుకు లేక పొదిగి పెంచిపెద్ద చేసి

శతాయువు కమ్మని, తన ఆయువు పోసి

తల్లడిల్లి, తరించిపోయే పిచ్చితల్లి

కోరుకునేదొక్కటే నీ చేతుల మీదుగా కా

టికి చేరాలనీ నీ నీడన సేద తీరాలనీ

పాలు తాగిన ఋణం తీర్చుకోవాలి నీవు

దారంతా నీకు పూదారి చేసిన తల్లికి అ

భివాదం చేసి అశ్రుఅంజలి తో వేడుకో

వందలసార్లయినా' అమ్మా నీవే కావాలనీ '

దయతో దైవాన్ని ప్రార్ధించు ఈ విశాల అ

నంత విశ్వంలో' అమ్మ లేని మనుగడ వద్దనీ.
_____________________________________

కవిత ప్రతీ వాక్యం నందలి మొదటి అక్షరంతో
నిలువుగా ఏర్పడిన వాక్యం

మాతృదేవోభవ అమ్మకు శతకోటి పాదాభివందనం
_________________________________________

కలవల గిరిజా రాణి
9959948223

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.