చిన్నారి చిన్న కోరిక (కథ)

చిలకలపూడి సత్యనారాయణ

చిన్నారి చిన్న కోరిక (కథ)
(7)
పాఠకులు − 540
చదవండి
గ్రంథాలయానికి జత చేయండి

సంగ్రహం

అది బాల నేరస్థుల న్యాయస్థానం. పోలీసులు ఎనిమిదేళ్ళున్న ఒక కుర్రాడిని జడ్జి ముందు నిలబెట్టారు. గుమాస్తా అందించిన కేసు ఫైలును తీసుకున్న జడ్జి, కేసు ఫైలును చదివి ఆశ్చర్య పోయాడు. దెబ్బలను చూసుకుంటూ, ఏడుస్తూ బోనులో నిలబడున్న కుర్రాడిని చూశాడు. న్యాయ మూర్తికి ఆగ్రహం వచ్చింది. వాడిని న్యాయ స్థానం లోకి తీసుకు వచ్చిన పోలీసులను చూసి "మీ స్టేషన్ ఇన్స్ పెక్టర్ వచ్చారా?" అని అడిగాడు. "లేదు యువరానర్...స్టేషన్ లోనే ఉన్నారు" చెప్పాడు ఒక కానిస్టేబుల్. "ఈ న్యాయ స్థానానికి వెంటనే రమ్మని కబురు పెట్టండి..మీ ఇన్స్ పెక్టర్ వచ్చిన తరువాత ఈ కేసు విచారణ మొదలు పెడతాను" అని కానిస్టేబుల్ తో చెప్పి కేసు ఫైలును పక్కన పెట్టారు జడ్జి. అర గంట తరువాత వచ్చిన ఇన్స్ పెక్టర్ను చూసి "ఈ కుర్రాడి మీద కేసు ఫైలు ప్రిపేర్ చేసింది మీరేనా?" అడిగాడు జడ్జి. "ఎస్. సర్" అన్నాడు ఇన్స్ పెక్టర్. "ఏం మనుషులయ్యా మీరు. చిన్న పిల్ల వాడిని పట్టుకుని గొడ్డును బాదినట్టు బాదారు. వాడేం తప్పు చేశాడని అలా కొట్టారు. దొంగ తనం చేశాడా? దోపిడీ చేశాడా?మాన భంగం చేశాడా? లేక జేబులు కొట్టాడా? లేదే... మహిళ బొమ్మను కౌగలించుకున్నాడు. అంత మాత్రానా వాడు పాడు బుద్ది గలవాడని మీరంతా ఎలా ఒక నిర్ణయానికి వచ్చారు?”… ఇన్స్ పెక్టర్ను చూసి గట్టిగా అరిచాడు. “ఈ వయసులో వాడికి పాడు బుద్ది ఆలొచన వస్తుందా?...వీడికే కాదు...వీడి వయసులో ఉన్న ఏ పిల్లలకైనా అలాంటి ఆలొచన వస్తుందా? మీ ఇళ్ళల్లో వీడి వయసు పిల్లలు లేరా?...వాళ్ళకి కూడా ఇలాంటి బుద్దులే ఉన్నాయా...ఏం పోలీసులయ్యా మీరు?” ఆ బాలుడిని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు? న్యాయమూర్తి పోలీసులమీద ఎందుకు విరుచుకు పడ్డారు? ఆ బాలుడు మహిళ బొమ్మను ఎందుకు కౌగలించుకున్నాడు?.......తెలుసుకోవటానికి ఈ కథ చదవండి.

సమీక్షలు

సమీక్ష రాయండి
Mahesh
యింకా కొనసాగించి మంచి ముగింపు యిస్తే మరింత భాగుండేది......
Devaa
ఒక్క అందమైన కధ గుండేలకు అత్తుకుందీ కదా....SUPERB
ప్రత్యుత్తరం
Siva
heart touching... super
ప్రత్యుత్తరం
Aparna
sir idhi nijamga kadhane kadha! nizam kadhu kadha, yendukantae mee Katha chala chala adbhuthanga undhandi, kantilo neellu thepinchay
ప్రత్యుత్తరం
malleeshwari
simply superb
ప్రత్యుత్తరం
vinay
నమస్కారం !! మీ కథ అద్భుతం చాల బావుంది...ఇంకా మంచి కథలు అందించండి..మీ శైలి చాల బావుంది..
ప్రత్యుత్తరం
Pasam
Interesting
ప్రత్యుత్తరం
telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.