కవిసేన మ్యానిఫెస్టొ

గుంటూరు శేషేంద్ర శర్మ

కవిసేన మ్యానిఫెస్టొ
(3)
పాఠకులు − 292
చదవండి

సంగ్రహం

*ఈనాడు కావలసింది సామాజిక చైతన్యం కాదు . సాహిత్య చైతన్యం *కవిత్వం బతుకు తెరువు కాదు .... జీవన విధానం *వచనంలో ఏది చెప్పాడనే దానికి స్దానమున్నట్లే కవిత్వంలో ఎట్లా చెప్పాడనే దానికే ప్రధాన స్థానం ఉంటుంది . *వర్తమాన తెలుగు మహా కవులు కవిత్వపు కల్తీ లేని స్వచ్చమయిన వచనమే రాస్తున్నారు . *ప్రతి కవితా ఎలా ఉండాలి ? ... .. చదివి పాఠకుడు చావాలి . కొత్త జన్మ ఎత్తాలి . *కవి నడుస్తున్న మానవతా సంక్షిప్త శబ్ద చిత్రం . - శేషేంద్ర * * * 1977లో వచ్చిన ఈ కావ్య శాస్త్రం , అప్పట్లో సాహిత్యంలో అన్ని వర్గాలనూ , అన్ని సంఘాలనూ తీవ్రమయిన ఆందోళనకు , మనస్తాపానికి గురి చేసింది . నిజం అంత ప్రమాదకరమయింది . నేటికీ తెలుగు కవిత్వంలో అవే పరిస్థితులు కొనసాగుతున్నాయి . మరింత తీవ్ర రూపం దాల్చాయని చెప్పవచ్చు . కనుకనే కవిసేన కావ్య శాస్త్రం అన్నికాలాలకూ వర్తిస్తుంది . * * * ఒక కవి రాశిన ఆధునిక కావ్యశాస్త్ర్రం - తెలుగుదేశంలో నూతనంగా కవిత్వభోధ అభివ్యాప్తం చెయ్యడానికి ప్రయత్నించే గ్రంథం- అపూర్వ చైతన్య వ్యాప్తి కోసం ఐతిహాసిక పరిస్థితుల్లో ఆవిర్భవించిన ఒక ఉద్యమపత్రం. సామాన్య శబ్దానికి అసమాన్య ఆకర్షణ శక్తి ప్రదానం చేసి, దాన్ని మహత్తర పురోగమన సాధనంగా మార్చే అయస్కాంత విద్యను యువతరానికి నేర్పడానికి సాహిత్య సత్యాగ్రహయోద్ధల్ని మలచడానికి శబ్దరూపమెత్తిన కృషి- ప్రాచీన ప్రాక్ పశ్ఛిమ కావ్యతత్త్వ చింతన, ఆధునిక కావ్యతత్త్వ చింతన, మార్క్సిస్టు కావ్యతత్త్వ చింతనా అనే చింతనా చతుష్టయ శాఖల్ని కలిపి పరిశీలించి ఆ నాల్గింటిలో ఉన్న ఆశ్చర్య జనక అభిన్నతనూ ఐకమత్యాన్ని ప్రతిపాదించి, ఈ విజ్ఞాన భారాన్నంతటినీ మోస్తేనే ఆధునిక మానవుడి విజ్ఞానానికి సమగ్రత వస్తుందని ప్రతిపాదిస్తుంది. శోకము ప్రీతి సత్త్వము సమాధి ఆది శబ్దాలకున్న అలంకారిక ప్రతిపత్తి - ప్రతిభ జన్మసంస్కారం కాదు, సమాధిగానీ విలక్షణ వ్యుత్పత్తిగానీ సాధించగల శక్తి అనే అలంకారిక మతము- కవే ప్రాచీన మత వాజ్ఞ్మయ కర్త- వాల్మీకి ప్రధమ ప్రజాకవి- వాల్మీకి ఉపమలు ప్రతీకలే- కవి శోకజ్వాలే కవిత్వంలో కమిట్మెంట్ ఇత్యాది నూతన విశేషాలు ఆవిష్కరిస్తుంది. * * * శేషేంద్ర సాహిత్య జగత్తును జీవిత విశేషాలను ఈ కింది హోం పేజి లో దర్శించండి . Seshendra : Visionary poet of the Millennium http://seshendrasharma.weebly.com

సమీక్షలు

సమీక్ష రాయండి
ఈ కంటెంట్ పై సమీక్షలు లేవు.
telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.